రేషన్ సరుకులు సక్రమంగా అందకుంటే ఫిర్యాదు చేయండిలా
Whom to complaint for ration shop dealer frauds
హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా ఏఏ సరుకులు సరఫరాచేస్తున్నారన్నవిషయం కూడా చాలా మంది కార్డు దారులకు తెలియడం లేదు. కేవలం బియ్యం మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ కరోనా వ్యాప్తి నేపధ్యంలో లాక్డౌన్సమయంలో రేషన్‌షాపుల ద్వారా మరిన్ని ఎక్కువ సరుకులు ప్రభుత్వం అందిస్తోంది. కానీ కొందరు రేషన్‌దుకాణం దారులు సరుకులను అందరికీ సక్రమంగా ఇవ్వడం లేదు. అంతేకాదు పేదలకు ఉచితంగా ఇస్తామన్న బియ్యాన్నికూడా కొందరు రేషన్‌డీలర్లు సరిగ్గా ఇవడం లేదు. దీంతో రోజుల తరబడి షాపుల చుట్టూ తిరిగేవారి సంఖ్య ఎక్కువగానే వుంది. నిజానికి రేషన్ దుకాణాల్లో లభిస్తున్న సరుకులు ఏవి. బియ్యం, చక్కెర, కిరోసిన్, కందిపప్పు, శనగలు, ఇలా ఏమేం ఉన్నాయన్నవిషయాన్నికార్డు దారులు తెలుసుకోవడం లేదు. కొందరు రేషన్ డీలర్లుచాలా తె లివిగా లబిఽ్ధదారులను మోసంచేస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రలు తీసుకుంటున్నారు.
కానీ ఒకటి రెండు సరుకలు ఇచ్చి మిగిలినవి కూడా ఇచ్చినట్టుగా రికార్డు చేసుకుంటున్నారు. అంతేకాకుండా రేషన్‌షాపులను సమయానికి తెరవడం లేదు. ఇచ్చిన రేషన్ సరుకులకు రశీదులు కూడా కొందరు ఇవ్వడం లేదు. ఇష్టం ఉంటే తీసుకో లేకపోతేఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటే బెదిరిస్తున్నారు. కొందరు రేషన్‌డీలర్లు చాలా తెలివిగా లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు తీసుకుని సరుకులు ఇవ్వకుండా నగదు ఇస్తున్నారు. తర్వాత ఆసరుకులను ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు.
రేషన్‌షాపుల్లో అక్రమాలు జరుగుతున్నా చాలా మంది ఎవరికి ఫిర్యాదుచేయాలో కూడా తెలియక వదిలేస్తున్నారు. రేషన్‌సరుకులను సరిగ్గా ఇవ్వకపోయినా, బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నా నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తిచేశారు. రేషన్ అక్రమార్కులపై ఫిర్యాదుచేయాలనుకునే వారు పౌరసరఫరాలశాఖ వాట్సప్ నెంబరు 7330774444 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు.