What hair style suits you

ముఖా కృతిని బట్టి కేశాలంకరణ
What hair style suits you
ఈ తరం అమ్మాయిలు బాబ్డ్‌ హెయిర్‌, భుజల వరకు స్టెప్‌ కటింగ్‌ ఇష్టపడు తున్నారు.

అయితే ముఖా కృతిని బట్టి కేశాలంకరణ చేసుకుంటే అందం మరింతగా

ఇనుమడిస్తుంది.

గుండ్రటి ముఖం: ముఖం గుండ్రంగా వున్నవారు పొడవు జుట్టు ఉంచుకోవచ్చు.

అయితే ముఖానికి రువైపులా ఎక్కువ జుట్టు కన్పించేలా ఉంచుకో కూడదు.దాని వల్ల

ముఖం వెడల్పుగా కనబడు తుంది.

పొడవు ముఖం:

ముఖం కోలగా పొడవుగా ఉన్న వారు తిన్నగా, పొడవుగా ఉన్న జుట్టును అసలు

ఉంచుకోకూడదు. శిరోజాలు పొట్టిగా, గుబురుగా ఉంటేనే వీరికి అందం. కత్తిరించు

కోవాలను కున్నప్పుడు పొట్టిగా మధ్యస్థంగానైన కత్తిరించుకోవడం మంచిది.

నలుచదరపు ముఖం: ముఖం చతురస్రాకారంలో ఉన్నప్పుడు బ్లంట్‌కట్‌, అతిగా

కన్పించే అలంకరణ జోలికి పోకూడదు. కొద్దిగా రింగులు తిరిగేలా ముఖం చుట్టూ

అలల్లా తేలియాడేటట్లు జుట్టు కత్తిరించు కోవాలి.

అండాకృతి ముఖం : కేశాలంకరణ విషయంలో ఇలాంటి ముఖాన్ని ఫర్‌ఫెక్ట్‌ ఫేస్‌గా

పేర్కొంటారు. చాలా రకాలుగా హెయిర్‌ స్టైల్స్‌ వీరికి నప్పుతాయి. జుట్టు ముఖం మీద

పడకుండా చేసే హెయిర్‌ స్టైల్స్‌ వీరికి నప్పుతాయి.ముఖ కవళికలు ప్రస్ఫుటంగా

కన్పిస్తాయి. హెయిర్‌ స్టైయిల్‌ కూడా బాగా కనబడు తుంది. ఇక సంరక్షణకు సంబం

ధించిన కొన్ని సూచనలు:

తలస్నానం చేసేటప్పుడు షాంపూతో ముందుగా వెంట్రుకల కుదుళ్ళ దగ్గర రుద్దాలి.

అక్కడ్నుంచీ కొనలకు రావాలి. ముందే చివర్లు రుద్ది తర్వాత మొదళ్ళ దగ్గరకు

వెళ్ళవద్దు.

చలికాలం వేడి వేడి నీటితో తల స్నానం ఎంతో హాయిగా ఉంటుంది. నిజమే

తలస్నానం ఎంతో హాయిగ వుంటుంది. నిజమే కానీ, వెంట్రుకలకు అది మంచిది

కాదు. చాలా వేడి నీరు వెంట్రుకలకు హాని చేస్తాయి. గోరువెచ్చని నీటితోనే తలస్నానం

చేయాలి.

వెంట్రుకలు జిడ్డుగా, డల్‌గా కన్పిస్తుంటాయి. మీకు తలస్నానం చేసే సమయం లేదు.

అప్పుడురాత్రి పడుకోబోయే ముందు వెంట్రుకల చివర్లమీద కాస్త టాల్కం పౌడర్‌

చల్లండి .అది నూనెను పీల్చుకొని వెంట్రుకలను పొడిగా మెరిసేలా మారుస్తుంది.

ఉదయం మామూ లుగా దువ్వుకుని ఆఫీసుకు వెళ్ళవచ్చు. జుట్టు కత్తిరించుకునే

వారైనా, పొడవు జట్టును అలాగే ఉంచుకున్నవారైనా ఆరు నుంచి ఎనిమిది వారాల

కోసారైనా తప్పని సరిగా ట్రిమ్‌ చేయించుకోవాలి. అలా చేస్తేనే శిరోజాలు అందంగా

ఉంటాయి.

శిరోజాల విషయంలో ఏదో మార్పు ఉంటే బాగుం టుందని పిస్తుంది. కానీ ధైర్యం

చాలదు. అలాం టప్పుడు చిన్న చిన్న మార్పులు మాత్రం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *