Various ways to use egg for hair care
గుడ్డుతో జుట్టు సంరక్షణ
మీ జుట్టు పొడిగా, జిడ్డుగా, నిర్జీవంగా ఉంటుందా… అయితే ఈ చిట్కాలు మీ
కోసమే.
జిడ్డు వెంట్రుకల కోసం:
గుడ్డులోని తెల్లసొన తీసుకొని మాడు నుంచి కింది వరకు మొత్తం వెంట్రుకలకి
పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం
ఉంటుంది.
పొడి జుట్టు కోసం:
వెన్న తీసిన పాలు ఒక కప్పు తీసుకొని దానిలో గుడ్డు కలిపి జుట్టుకి పట్టించి
30నిమిషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. అంతే, ఎండిపోయినట్టు, జీవం
కోల్పోయినట్టు ఉన్న జుట్టుకి మంచి మెరుపు లభిస్తుంది.
మెరిసే జుట్టు కోసం:
కొంచెం నిమ్మరసంలో గుడ్డుని కలిపి జుట్టుకు పూర్తిగా పట్టించాలి. ఒక అరగంట
తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరగడమే
కాకుండా, ఎంతో మృదువుగా కూడా అవుతుంది.
ఒక పాత్రలో ఒక గుడ్డు, పెరుగు, స్పూను అలీవ్ నూనె, కొంచెం బాదం నూనె తీసుకొని
అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి 45 నిమిషాల తర్వాత
గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అంతే, మిలమిల మెరిసే జుట్టు మీ
సొంతమవుతుంది.