Various Eyebrow coloring ‘ఐ’ బ్రో కలరింగ్..
ఆకర్షిణీయంగా తయారు..
స్త్రీ ఎంత అందంగా తయారైనా ఎక్కడో ఎదో వెలితిగా ఫీలవుతుంటారు. మారుతున్న ఫ్యాషన్‌కు అనుగుణంగా వెరైటీగా తయారు కావడానికి తాపత్రయ పడుతుంటారు. ఎక్కువగా వీరి ‘కళ్ళ’పైనే దృష్టి పడుతుంది. సో ‘ఐ’ బ్రో కలరింగ్‌తో వీటిని చూడముచ్చటగా తయారు కావచ్చు. పది మందిలో నిలబడినా వారి దృష్టి మీ మీదనే ఉండే విధంగా చూసుకోవచ్చు. కానీ ఈ ‘ఐ’ బ్రో వాడేటప్పుడు కొన్ని టిప్స్ తీసుకుంటే సరిపోతుంది.
ఈ ‘ఐ’ బ్రో కలర్ పెన్సిల్‌తో కలరింగ్ చేయడం ఒకటో పద్ధతి కాగా, బ్రాండెడ్ బ్రష్, చిన్నపాటి బ్రెష్‌తో చేయడం రెండో పద్ధతులున్నాయి.
‘ఐ’ బ్రో కలర్ పెన్సిల్
ఈ కలర్ పెన్సిల్‌తో మీ కనుబొమ్మలను మరింత అందమైనదిగా తీసుకరావచ్చు. సుమారు 10 నుండి 12 రంగుల్లో మార్కెట్లో దొరుకుతోంది. ‘ఐ’ బ్రో పెన్సిల్‌తో కనుబొమ్మలప చిన్న స్ట్రోక్ ఇచ్చి తరువాత బ్రౌజ్ లోపల చేతులతో నెమ్మదిగా రాయాలి. ఏదైనా కాటన్ బడ్‌తో చేయవచ్చు. మీకు నచ్చిన కలర్ షేడ్స్‌లో పెన్సిల్‌తో విభిన్న రకాల స్ట్రోక్స్ ఇవ్వవచ్చు.
eye bro 2
పౌడర్ కలరింగ్
బ్రో పౌడర్‌తో కలరింగ్ చేయాలనుకుంటే చిన్న ‘ఐ’ బ్రో బ్రష్ లేదా స్పాంజ్‌ను వాడవచ్చు. పౌడర్ వేసుకునే ముందు చర్మంపై పౌడర్ పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. స్పాంజ్‌తో మెల్లిమెల్లిగా రుద్దుతూ నాచురల్ లుక్ వచ్చేలా చేయాలి. కలర్పౌడర్ను ఎంచుకునేటప్పుడు మీ కనుబొమ్మల రూపం, సైజను దృష్టిలో పెట్టుకోవాలి.
మరింత ఆకర్షిణీయంగా కనిపించాలంటే
మీరు మరింత ఆకర్షిణీయంగా కనిపించాలంటే కనుబొమ్మలు, కనురెప్పలపై ఒకే రంగు వాడి చూడండి. ‘ఐ’ లైనర్ కూడా మ్యాచింగ్ కలర్‌తో వేసుకోవచ్చు.
eye bro 3
ఎప్పుడూ వాడిన కలర్స్ మాత్రం వాడకండి. కనుబొమ్మలకు కలరింగ్ చేసుకుని రాత్రి కడిగేసుకుంటే చర్మం తిరిగి సహజంగా మారిపోతుంది. దీనితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. పార్టీకి వెళ్ళానుకునే వారు వేసుకోవచ్చు. వీటి కోసం షైన్ పెన్సిల్స్ కూడా వాడవచ్చు. రాత్రి పడుకునే పోయే ముందు మాత్రం కళ్ళను శుభ్రంగా కడుక్కోండి. అంటే చిన్న చిన్న పార్టీలకు కూడా ఎంచక్కా వేసుకొని వెళ్ళండి. అలాగే మార్కెట్లో దొరుకుతున్న ఇష్టమొచ్చిన వాటిని మాత్రం వాడకండి. దాని గురించి పూర్తిగా తెలుసుకుని నాణ్యమైన వాటిని, ప్రముఖ సంస్థలు తయారు చేసిన వాటిని మాత్రమే వాడండి.