Tips to prevent hair fall

Tips to prevent hair fall
జుట్టు రాలకుండా ఉండాలంటే
నేటి ఉరుకుల పరుగల జీవితంలో అసలు మనం గురించి మనం పట్టించుకుంటున్నామా ? లేదు కదా..అయితే ఒకసారి మీ గురించి మీరు పట్టించుకోండి. యాంత్రీకమైన జీవితంలో అందం కోసం ఎవరు పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా మహిళల గురించి. కానీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ‘శిరోజాల’ గురించి చెప్పుకోవచ్చు. కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జట్టు చిట్లిపోవడం జరుగుతుంటుంది. జుట్టు రాలడం మొదలయిదంటే చాలు ఇక మహిళలకు టెన్షన్‌..టెన్షన్‌ పడుతుంటారు.

అసలు జుట్టు ఎందుకు రాలుతుందంటారు ? ప్రధానంగా ఇందులో శరీరతత్వం, అనారోగ్యం, అపరేషన్లు, విటమిన్ల లోపం, థైరాయిడ్‌ సమస్యలు, ఇతర సైడ్‌ ఎఫెక్ట్‌ అని చెప్పవచ్చు. స్త్రీలలో పోషకాహార లోపం వల్ల ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. హెయిర్‌ ట్రీట్‌మెంట్లు తీసుకుంటే మాత్రం జుట్టుపై తీవ్ర వత్తిడి పెరుగుతుంది. శిరోజాలపై ఎక్కువగా రసాయానలతో కూడిన పదార్థాలను వాడడం కూడా రాలిపోయే సూచనలున్నాయని ఫ్యాషన్‌ నిపుణులు పేర్కొంటుంటారు.

woman-suffering-from-hair-loss2 nalgonda.info

శిరోజాల కేరింగ్‌ గురించి

ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మాటిమాటికి షాంపులను మార్చవద్దు. స్టయిలింగ్‌ తగ్గించాలి. తరచూ మాయిశ్చరైజర్‌ వాడాలి. గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్‌ చేయాలి. తలస్నానం చేసిన తరువాత కండీషనర్‌ తప్పక వాడాలి. నూనెతో మసాజ్‌ చేయడం వల్ల శిరోజాలకు నిగారింపు వస్తుంది. ఆహారంలో పాలు, పండ్లు, పచ్చికూరగాయలు తీసుకోవాలి. వత్తిడి లేకుండా ఉండండి. ఫర్మింగ్‌, కలరింగ్‌ వంటి ట్రీట్‌మెంట్‌లకు బాయ్‌ చెప్పాలి. హెయిర్‌ డ్రయ్యర్‌ను కొంచెం దూరంగా పెట్టి వాడాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జట్టు రాలకుండా ఉంటుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *