Tips to get rid of dandruff

చుండ్రు పోవాలంటే
Tips to get rid of dandruff
చుండ్రు.. ఈ సమస్య ఎంతో మందిలో ఉంటుంది. వర్షాకాలంలో ఈ సమస్య

అధికంగా ఉంటుంది.

కొందరికి చండ్రు సమస్య విపరీతంగా బాధపెడుతుంది. చండ్రు వల్ల శిరోజాల అందం

పాడవడమే కాకుండా ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కొన్ని చిట్కాలు మీ కోసం

కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. అరగంట

పాటు అలాగే ఉంచి తలస్నానం చేయండి. వారానికి రెండు, మూడు సార్లు చేస్తే సరి.
గసగసాలను మెత్తని ముద్దలా చేసి తలకు పట్టించాలి. ఓ గంట తరువాత గోరు

వెచ్చటి నీటితో స్నానం చేయాలి.
కొబ్బరినూనెలో కర్పూరం కలుపుకుని వెంటుకలకు పట్టించాలి. అరగంట

తరువాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండి తలకు పట్టించి తరువాత స్నానం

చేయాలి.
ఎవరి దువ్వెనలు వారే వాడుకోవడం మంచిది. అలాగే టవల్‌ కూడా విడిగానే

ఉంచుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *