ఎత్తు తక్కువగా కనిపిస్తున్నారా .
Tips to appear tall
ఎత్తు తక్కువగా ఉన్నారా అయితే ఈ చిట్కాలను పాటించండి..పొడవుగా ఉన్నట్లు
ఎదుటివారు భ్రమ కలిగేలా ఉండవచ్చు..ఎలాగా ?
పెద్ద పెద్ద డిజైన్లు ఉన్న దుస్తులను వాడకండి. చిన్న చిన్న ప్రింట్లతో కూడుకున్న
వాటిని ధరించండి.
నిలువుగీతలున్న దుస్తులను ధరించండి. అడ్డగీతలతో ఉన్న దుస్తులను ధరించడం
వల్ల పొట్టిగా, లావుగా ఉన్నట్లు కనిపిస్తారు.
ఒంటికి అంటిపెట్టుకునే వస్త్రాలను కొంచెం పొడవుగా ఉన్నట్లు కనిపించేలా
చేస్తుంది. వదులుగా ఉన్న డ్రెసెస్ వేసుకుంటే పొట్టిగా ఉన్నట్లు కనిపిస్తుంది.
నడుము భాగాన్ని ఆక్రమించే స్కర్టులు, ప్యాంటు పొడవుగా కనిపించేలా చేస్తాయి.
కానీ ఇవి సన్నగా ఉండే వారికి మాత్రమే నప్పుతాయి. చిన్న చిన్న స్కర్ట్లు ధరిస్తే
పొడవుగా ఉన్నట్లు కనబడుతారు. అయితే మోకాలిపైకి ఉండకుండా మాత్రం
చూసుకోండి.
చెవులకు ధరించే పొడవైన జుంకాలు ధరించండి. అలాగే జట్టును సందర్బాన్ని బట్టి
విరబోయండి.
టీ షర్టులు, కాని స్వెట్టర్లు వేసుకుంటే ఇవి వి ఆకారంలో ఉండే విధంగా
చూసుకోండి.
ధరించే దుస్తులు విభిన్నమైన రంగులను వాడండి. దుస్తుల నుండి మొదలుకొని
ఆభరణాలు, కాలి చెప్పుల వరకు మ్యాచింగ్ పాటించండి.