Tips for glowing cheeks
బుగ్గలు అందంగా కనిపించాలంటే
ముఖంలో కన్నులు, పెదాలు ఎంత ముఖ్యమో బుగ్గలు కూడా అంతే ముఖ్యం.
బుగ్గలకు కొందరు ఫౌండేషన్ వాడుతుంటారు. ఈ ఫౌండేషన్ పౌడర్ కంటే లిక్విడ్
రూపంలో ఉంటెనే మంచిది. మీ శరీరరంగును బట్టి ఈ ఫౌండేషన్ రంగును కూడా
ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్లషర్‌తో బుగ్గలకు రోజ్ అప్లయ్ చేయండి. కోలముఖం
ఉన్నవారు బ్లషర్‌ని వర్టికల్, హరిజాంటల్లో పద్ధతిలో వాడితో బుగ్గలు అందంగా
కనిపించే వీలుంది. గుండ్రటి ముఖం కలవారు బ్లషర్‌ని ట్రయాంగిల్ షేపులో వాడాల్సి
ఉంటుంది.
ఇక ఫౌండేషన్ అప్లయ్ చేసిన తరువాత ముఖానికి పౌడర్ అద్దుకోవాలి. పౌడర్‌ను
ముఖానికి అతిగా రాయవద్దు. పౌడర్ ఎక్కువగా ఉందనిపిస్తే పఫ్‌తో నెమ్మదిగా
తడిచేసుకోండి. అంతే ఇలాంటివి పాటిస్తే మీ బుగ్గలు అందంగా కనిపించే వీలుంది.
ట్రై చేయండి.
ఇక కళ్ళ క్రింద కొందరికి నళ్ళగా వలయాలు ఉంటాయి కదా వీటికి పరిష్కారం వైట్
కలర్ ఫౌండేషన్‌ను అప్లయ్ చేయండి.
Tips for bright cheeks