రోజంతా మెరిసిపోవాలంటే
Tips for day long freshness
Milk Bath – Milk Massage
రోజంతా తాజాగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి..? మిల్స్బాత్ చేసేయండి
అంతే..అవును ఇలా చేయడం వల్ల రోజంతా తాజాదనంగా ఉంటారని బ్యూటిషన్స్
నిపుణులు చెబుతున్నారు. మీరు ట్రై చేస్తారా
ఓ బకెట్ నీటిలో ఒక కప్పు పాల పొడి వేసి స్నానం
చేయండి. స్నానం చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకొని అయినా స్నానం
చేయవచ్చు. కాస్తంత కలబంద గుజ్జును బకెట్ నీటిలో వేయండి. దీనితో స్నానం
చేయడం వల్ల ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా
ఉపయోగపడుతుంది.
అలసత్వం పోవాలంటే
గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల శరీరం
శుభ్రమవ్వడమే కాకుండా మృదువుగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇలా ట్రై చేసి
చూడండి..తేడా గమనించండి..