tips for beautiful neck and lips

tips for beautiful neck and lips
అందమైన మెడ, పెదవుల కోసం
స్త్రీలు అందంగా కనిపించాలంటే ఎంతో తాపత్రయ పడుతారు. శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ తాపత్రయం మరింతగా ఉంటుంది.

ఆడవారు కొద్దిగా జాగ్రత్తలు, ఓర్పు ఉంటే అందంగా ఉండవచ్చు. మెడ, పెదవుల గురించి మీ కోసం…

స్త్రీలు తమ శరీరాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోగలిగితే అంత అందంగా కనిపిస్తారు. ఇతరులు కూడా మీ అందానికి ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి కావల్సింది కొంచెం ఓర్పు. ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింపచేయడంలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుందంటారు ? కరెక్టు ‘మెడ’ . శంఖంలాంటి మెడ ఉంటే ఎంత బాగుంటుంది.. అందంగా ఉండవచ్చు. కదా . కాని చాలా మంది స్త్రీలు ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. మృదువుగా కనిపించే మెడ భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

nice neck 2మెడ మీద చర్మ చాలా సున్నితంగా ఉంటుంది. కానీ కొంతమంది ఆడవారు ఈ భాగంపై ఇష్టం వచ్చినట్లుగా రుద్దుతారు. అలా చేయడం వల్ల చర్మం పాడైపోతుంది. ఎండలో తిరిగి ఇంటికి రాగానే వేడి నీటితో మెడను శుభ్రం చేయాలి. వేసవి కాలంలో గిల్టీ నగలను ధరించ కూడదు. ఎందుకంటే వేడిమికి చర్మంపై నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది.

ఆలీవ్‌ ఆయిల్‌ రాసి మసాజ్‌ చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. రాత్రి పడుకునే ముందు ఆలీవ్‌ నూనె రాసి ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకు కనీసం నాలుగు నిమిషాల పాటు మెడను అటు, ఇటూ వంచడంలాంటి ఎక్సర్‌సైజలు చేయండి. దీనివల్ల మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి. అలాగే కొద్దిగా గ్లిజరిన్‌ తీసుకుని అందులో నిమ్మరసం చుక్కలు వేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మెరుపులాంటి మెడ మీ సొంతం..ట్రై చేయండి..

ఆడవాళ్ళు ఎన్ని రకాలుగా..ఎంత అందంగా తయారైనా వారికి ఎక్కడో ఎదో లోటు ఉన్నట్లు అనిపిస్తుంది కదా ? ఎంత అందంగా మేకప్‌ వేసుకున్నా చివరకు ఎక్కడో లోపం ఉందని అనుకుంటారు. అందమైన ‘పెదవుల’ దగ్గరకు వచ్చే సరికి ఎలాంటి ‘లిప్‌స్టిక్‌’ వాడాలి అనుకుంటూ ఉంటారు. కొంతమంది తెలిసి, తెలియక ఎవో ఎవో లిప్‌స్టిక్‌లు వాడుతుంటారు. ఇవి కరెక్టుగా లేకపోయితే మీరు ఎంత అందంగా తయారైనా ఈ లిప్‌స్టిక్‌ వల్ల దిష్టిచుక్కలా కనబడుతాయి. మన శరీర వర్ణం, పెదవుల రంగుకు సరిపోయే లిప్‌స్టిక్‌ను ఎంచుకోండి. ఇలా తయారు కావడం ద్వారా మీరు మరింత అందంగా తయారు కావచ్చు.

lip stick shades 1

ఎరుపు లేదా పింక్‌

ఇలాంటి రంగుల లిప్‌స్టిక్‌లు గాఢమైన అనుభూతినిస్తాయి. మీ శరీరం కూడా ఎరుపు రంగు అయి ఉంటే ఇది పూర్తిగా సెట్‌ అవుతుంది. ఒక్క పెదవుల రంగే చూడకుండా మీ శరీరం రంగు కూడా చూసి వాడండి

పసుపు లేదా ఆరెంజ్‌

ఇవి సున్నితమైన ఫీలింగ్‌ కలుగచేస్తాయి. శరీరం రంగు ముదురుగా ఉండి ఉంటే ఈ రకమైన లిప్‌స్టిక్‌ సెట్‌ అవుతుంది. బాగా ఎరుపు రంగు కలర్‌ ఉన్న వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు. పాలిపోయి ఉన్న వారికి ఈ లిప్‌స్టిక్‌ సెట్‌ కాదు.

నీలం

గాఢమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఆకర్షించేలా ఉంటుంది. రాత్రి పూట ఫంక్షన్‌లు ఉంటే దీనిని వాడకండి. ఎందుకంటే ఈ లిప్‌స్టిక్‌లు వాడితే ఎలా ఉంటుందంటే మీరు ఒక ఫ్లోరోసెంట్‌ క్రింద నిలబడి, అది మీ పెదవులను ప్రతిబింబిస్తుదన్నమాట. పగటి పూట, అరుదైన సందర్భాలలో ఉంటే తప్ప దీనిని వాడకుంటే మంచిది.

సిల్వర్‌, బూడిద రంగు

రాత్రి వేళ ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. పెదవులపై రాస్తే మెరుపును మాత్రమే ఇస్తాయి తప్ప ఎలాంటి గాఢమైన ప్రభావాన్ని కలిగించవు. సున్నితమైన మెరుపు కలిగి ఉంటాయి. లైట్ల వెలుగు పెదవులపై పడినప్పుడే తగినంతగా మాత్రమే ప్రతిఫలిస్తుంది.

ఆకుపచ్చ

దీనిని వాడకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ రంగు చూసేందుకు మరీ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

నాణ్యమైన లిప్‌స్టిక్‌లనే వాడండి. లేకపోతే పెదవులు పాడైపోయే ప్రమాదం ఉంది. కొంత మందికి లిప్‌స్టిక్‌లు పడవు. ఎందుకంటే అందులో రసాయనం లాంటివ ఉండడం వల్ల పెదవులకు హాని కలుగ చేస్తాయి. ఎవి కరెక్టుగా సూట్‌ అవుతాయో లేదో నిర్ధారించుకుని వాడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *