పిల్లల మెదడు చురుకుగా ఉండాలంటే ?
Tips for active brain in kids
పిల్లల మెదడును చురుకుగా ఉండాలంటే తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఏ
ఆహార పదార్థాలు అందించాలో..వారు ఎలా చురుకుగా ఉండాలో ఆలోచిస్తున్నారా ?
అయితే చదవండి..
గింజధాన్యాలలో
విటమిన్ ‘బి’ మరియు గ్లూకోజ్ ఉంటుంది. ఇది మెదడుకు మంచి ఆహారంగా
చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా ఓట్స్, బ్రౌన్ పైస్ వంటి వాటిలో దొరుకుతుంది. గ్లూకోజ్
శరీరానికి ఎంతో అవసరం కూడా. కల కూరగాయలు, టమాట, కేరట్లు, దానిమ్మ,
బీన్స్ వంటి పదార్థాలను తినిపించండి. దీనిద్వారా పిల్లల మెదడుతో సహా అన్ని
అవయవాల రక్త ప్రసరణ బాగా సాగేలా చూస్తుంది.
గుడ్లు, ఎండు ఫలాలు తీసుకోవడం వల్ల మెమొరీ స్టెమ్ సెల్స్ అభివృద్ధి చేస్తాయి.
గుడ్లు, డ్రై ఫ్రూట్స్లో చోలైన్ అనే పదార్థం ఉంటుంది. ఇవి అలసటను పొగొడుతాయి.
మిటమిన్ ‘డి’ కూడా అధికస్థాయిలో ఉంటుంది.
పాలు – పెరుగు – ఇతర డైరీ ఉత్పత్తుల్లో ప్రోటీన్లు, కాల్షియం, పోటాషియం,
విటమిన్ ‘డి’ అధికంగా ఉంటాయి. మెదడులోని మస్కులర్ సిస్టం, న్యూరో
ట్రాన్స్మిటర్లు, ఎంజైములు మెదడును అభివృద్ధికి దోహదపడుతాయి.
సో…పిల్లల మెదడు..వారు చురుకుగా ఉండేందుకు పైన పైర్కొన్న వాటిని
పాటించండి..