Tips for a slim body నాజుకుగా ఉండాలంటే
మహిళల శరీరాలు ఒక్కోక్కరివి ఒక్కో విధంగా ఉంటాయి. ఎవరికి వారు తాము నాజుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వారిలో ఏమాత్రం మార్పులు ఉండవు. ఎందుకు..
మీరు తీసుకుంటున్న ఆహారంలో కాని వ్యాయామం చేయకపోవడం వల్ల కాని ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీన్స్ పరంగా కొందరు సన్నగా ఉన్నా తగిన బరువును కలిగి ఉంటారు. ఎత్తుకు, వయస్సుకు తగ్గ బరువు లేకపోవడమే ప్రధాన సమస్య.
ఆహారం తీసుకోపోవంలో లోపాలు, దీర్ఘకాలిక వ్యాధులు, వయస్సు పెరగడం, మానసిక వత్తిడి, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వంటి కారణాలు చెప్పవచ్చు.
ఎంత బరువుండాలి
పురుషుల్లో మజిల్ ఎక్కువగా స్త్రీలలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఉండాల్సిన బరువు ఉన్నామో లేదో గుర్తించాలంటే.. సెంటిమీటర్లలో మన ఎత్తును కొలుచుకుని దానిలో నుండి 100 తీసేస్తే వచ్చే విలువే సుమారు కేజీలో మన ఐడియల్ వెయిట్ అనుకోవచ్చు. ఉదా : ఓ వ్యక్తి ఎత్తు 175 సెం.మీ. అనుకుంటే అందులో నుండి 100 తీసేస్తే వచ్చే విలువ 75. అంటే ఆ వ్యక్తి బరువు 75 కిలోల వరకు ఉండవచ్చు.
సూచనలు
ఆహారం, వ్యాయామశైలి, వయస్సు మానసిక శారీరక సామర్థ్యాలను బట్టి వైద్య సలహా మేరకు మాత్రమే అనుసరించాలి. బరువు తక్కువగా ఉన్నారంటే బరువు పెరిగేందుకు అవసరమైన ఆహారం తీసుకోండి రోజుకు ఎన్ని క్యాలరీలు ఆహారం తీసుకోవాలో గుర్తుంచుకొండి. ఫుడ్ డైరీ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తిన్నా ఫర్వాలేదు. రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం.
శారీరక శ్రమ
బరువు పెరగాలని ఎడాపెడ తినకండది. తిన్న ఏ ఆహారమైనా తగిన రీతిలో శరీరానికి పట్టాలంటే శారీరక శ్రమ అవసరం. పిజ్జాలు, బర్గర్లు, వడలు, దోసెలు, ఫ్రై చేసిన వంటకాల వంటివి తింటే బరువు పెరుగుతారని అందరూ భావిస్తారు. కానీ ఇవి తిన్నా కొంచెం శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది.
నాజుగ్గా ఉండేందుకు ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకొండి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మానసిక వత్తిడి నుండి ఉండేందుకు యోగాలాంటివి చేయండి. అలాగే కలుషితమైన ఆహార పదార్థాలను తినకండి. అందంగా కనబడాలని వివిధ క్రీములను వాడకండి. లావుగా ఉన్నవారు వైద్యులను సంప్రదించి వ్యాయామ పద్ధతులను, ఆహార డైటింగ్ వంటివి చేయాలి. నాజుకుగా ఉండేందుకు ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు ఉండే విధంగ చూసుకోండి. అలాగే తాజ పండ్లను తినండి. ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాజుకైన శరీరం మీ లభ్యం అవుతుంది.