చర్మం నల్లగా అవుతుందా ?
చర్మం నల్లగా మారిపోతుందా..? ఎన్ని టెక్నిక్స్ అమలు చేసినా అలాగే ఉంటుందా ?
కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. ఈ విధమైన సమస్యలను
పిగ్మెంటేషన్ సమస్యలుగా చెబుతుంటారు. దీని కోసం కొన్ని చిట్కాలు..అమలు చేసి
చూడండి..అందంగా..ఆకర్షణీయంగా కనిపించండి.
అసలు సమస్య ఎందుకు వస్తుంది
Reasons skin becomes black
హర్మోన్మ అసమతుల్యత, వెంటుకలకు క్రమం తప్పకుండా రంగులు వేసుకోవడం,
సూర్యుడి అతి నీలలోహిత కిరణాల వల్ల, థైరాయిడ్ సంబంధిత సమస్యల వల్ల చర్మం
నల్లగా మారడానికి అవకాశాలున్నాయి.
చిట్కాలు
కొంచెం కొంచెంగా క్యారెట్, క్యాబేజీ, ఓట్స్ కలిపి మిక్సీలో వేసి పేస్టుగా
చేసుకోండి. అందులో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనే, మూడు చెంచాల
నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని
నీళ్ళతో ముఖాన్ని కడిగేయండి. క్రమం తప్పకుండా చేయాలి.
నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనే కలిపి ప్రతి రోజు స్నానానికి కంటే ముందు (20
నిమిషాల ముందు) ముఖానికి రాసుకొని చన్నీళ్ళతో స్నానం చేయండి.
మంచినీళ్ళు ఎక్కువగా తాగండి..తాజా పండ్ల రసాలు, మజ్జిగా ఎక్కువగా
తీసుకోవాలి.
పిగ్మెంటేషన్ సమస్య ఎక్కువగా ఉన్నవారు ఎండలో బయటకు వెళ్ళి రాగానే ముఖం
కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖంపై 20 నిమిషాల పాటు
పెట్టుకోవాలి.
నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.