Sri Goli Amarender Reddy Joins BJP


ఐక్య కార్యాచరణ సంఘం నల్లగొండ జిల్లా కన్వీనర్ గా ప్రత్యేక తెలంగాణా ఉధ్యమానికి పాటుపడిన శ్రీ గోలి అమరేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. గోలి అమరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తిని చేపడుతూనే పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. సామాజిక సేవ దృక్పథం కల శ్రీ గోలి అమరేందర్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరి గత ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవ కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ తన సేవలను ఇంకా విస్తరించడానికి పూర్తిస్దాయి రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకున్నారు. శ్రీ గోలి అమరేందర్ రెడ్డి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా , బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా విధులను నిర్వర్తించారు. లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అనతికాలంలోనే నల్లగొండ మరియు ఖమ్మం జిల్లాల గవర్నర్ గా సేవలందించారు. ప్రత్యేక తెలంగాణా ధ్యమంలో ఆయన చాలా చురుకుగా పాల్గొనడంతో అనతికాలంలోనే తెలంగాణా ఐక్య కార్యాచరణ సంఘం కన్వీనర్ శ్రీ కోదండరామ్ గారికి అత్యంత సన్నిహితులయ్యారు. బాజపా నాయకులు ఆయనతో సంప్రదింపులుజరపడంతో తెలంగాణా ఏర్పాటుకు సహకరించిన భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి ఆయన నిర్ణయించుకున్నారు.

Lion Sri Goli Amarender Reddy confirmed his joining in the Bharathiya Janatha Party. Goli Amarender Reddy was native of Nalgonda district, Telangaana. He was born on 16.June.1962. He left his government job and continued as an advocate. In 1984 he joined as a member of Lions Club International. As a Lions Club International member he actively participated in various Social Activities. In no time he rose to the position of Governor of a district. He acted as a Governor of Khammam and Nalgonda districts. Sri Goli Amarender Reddy delivered his duties as a Public Prosecutor and Bar Association Member. He actively participated in Separate Telangaana Movement and due to his sincerity and hard work soon he attracted the attention of Sri Kodandaram gaaru, Convener of Telangaana Join Action Committee, and eventually made  Convener for Telangaana Join Action Committee- Nalgonda. He effectively participated in Separate Telangaana Movement. As a token of his gratitude and to serve the people effectively he joined in  B.J.P., which helped in forming Separate Telangaana State. NLGINFO.COM team wishing him all the best for his future plans.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *