Sleeve Less

Sleeve Less స్లీవ్‌లెస్‌.. స్లీవ్‌లెస్‌
మహిళలు ఇప్పుడు ‘స్లీవ్‌లెస్‌’ బ్లౌజులు ధరిస్తున్నారు. మారుతున్న సమాజంతో పాటు మహిళ కూడా మారుతోంది. ఫ్యాషన్‌కు అనుగుణంగా ఆడవారు కొత్త కొత్త ఫ్యాషన్‌లతో ఆకట్టుకుంటున్నారు.

కానీ ఈ స్లీవ్‌లెస్‌ కొంతమంది మహిళలు వాడుతున్నారు. ఏదో వేసుకోవాలన్న తపనతో కొంతమంది వీటిని ధరిస్తున్నారు. కానీ వారికి ఇది అంతగా సూట్‌ కాదు. ఈ స్లీవ్‌లెస్‌ ఎవరికి ఎలా ధరించాలో చూద్దామా..

చీర, జీన్స్‌, నైటీ, సూట్‌.. వీటన్నింటికీ టాప్‌గా స్లీవ్‌లెస్‌ సూటవుతుంది. సన్నగా, పొడుగ్గా ఉన్నారా ఆలస్యం చేయండి స్లీవ్‌లెస్‌ ధరించండి. దీనివల్ల భుజాలు, చేతుల అందం మరింత రెట్టింపు అవుతుంది. ప్లేయిన్‌ లేదా ప్రింటెడ్‌ చీరలు ధరించే వారు స్లీవ్‌లెస్‌ ధరించండి.. ఆపై తేడా చూడండి..మీ మిత్రులు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు.

చేతులు, భుజాల క్రింద వేక్సింగ్‌ వేసుకోవాలి. మంచి బాడి లోషన్‌తో చేతులకు మసాజ్‌ చేయ్యంది. ఎండ వల్ల మీ చెయ్యి నల్లబడితే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ఉపయోగించండి. నెలలో రెండు సార్లు మేనిక్యూర్‌ చేయించాలి. డీప్‌ నెక్‌ స్లీవ్‌లెస్‌ కాటన్‌ సూట్‌ ధరించడం వల్ల ఎండ వేడిమి అంతగా బాధించదు. భుజాల క్రింద పౌడర్‌ లేదా డియోడెంట్‌ రాసుకోండి. ఇవి పాటించండి..హాయిగా స్లీవ్‌లెస్‌ ధరించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *