Sari ‘చీర’
భారతీయులు చీర కట్టు గురించి తెలియని వారుండరంటే సందేహం లేదు. విదేశీయులని కూడా ఈ ‘చీర కట్టు’ ఆకర్షించిందంటే చీరలో ఎంత విశేషం ఉందో అర్థమౌతుంది.
ప్రతినిత్యం ఏదో ఒక కొత్తదనం కోసం పాకులాడడం మానవనైజం. ప్రతిసారి ఎదో కొత్త కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని తెరమరుగు కావడం.. మరలా కొన్ని పుట్టుక రావడం జరుగుతూనే ఉన్నాయి. కానీ చీర ఉన్న మక్కువ అది తెరమరుగు కావడం లేదు. దాదాపు ప్రతి ఫ్యాషన్‌లో ఒక మోడల్ చీరతో దర్శనమిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆడవారికి ఎంతో సౌకర్యంగా ఉండేది చీర.. చీర గురించి చెప్పాలంటే ..ఎంత చెప్పినా ఇంతేనా అంటారు. అంతటి చరిత్ర గలది ఈ ‘చీర’. పాశ్చాత్య పోకడలో ఉన్న కొందరు చీర కట్టడం రాదు అని కొందరు ముఖం తిప్పేస్తారు. కొంతమంది ఓ అడుగు ముందుకేసి చీర కట్టుకోవడం రాదా..అయితే మా దగ్గర ‘రెడిమెడ్ చీరలు’ లభిస్తాయని వ్యాపారం కూడా చేసుకుంటున్నారు.saree 1
కానీ ఒక్కసారి ఆలోచించండి. భారతీయులైన మనం చీర కట్టుకోవడం మన బాధ్యత. నాకు చీర కట్టుకోవడం రాదు అంటే విదేశీయులు నవ్విపోతారు. చీర.. చీర..అంటారు అసలు ఏంటి చీర ? ఐదు నుండి ఆరు గజాల వరకు చీర ఉంటుంది. కొంతమంది 9 గజాల చీర కూడా కట్టుకుంటారు. ఎటువంటి శరీరాకృతి వల గారికైనా ఈ చీర నప్పుతుంది. ఈ చీరను ఎన్నో రకాలుగా కట్టుకోవచ్చు. చీరలు కొనడం నుండి కట్టుకోవడం వరకు కొన్ని టెక్నిక్స్ వాడితే అందంగా కనబడవచ్చు.
saree 2
ఈ చీర కట్టులో సన్నగా ఉన్న వారు లావుగా, లావుగా ఉన్న వారు సన్నగా కనబడే అవకాశం ఉంది.
సన్నగా ఉండే వారు మందంగా ఉండే చీరలు, కాటన్ చీరలు కట్టుకుంటే సమంగా అందంగా కనిపిస్తారు. అలాగే ఆర్గాన్జా, టిష్యూ, కాటన్, టస్సర్ శారీస్ ఎంపిక చేసుకుని కట్టుకుంటే నిండుగా ఆకర్షణీయంగా కనబడుతారు.
హెవి పర్సనాల్టీ ఉన్నారా ? అయితే మీరు షిఫాన్, జార్జెట్‌ల్లో చీరలు ఎంపిక చేసుకోండి. హెవీ మైసూర్ శారీస్లో అందంగా..స్లిమ్‌గా కనబడుతారు. తేలికైన సింథటిక్ చీరలను కట్టుకుంటే పొందికగా కనిపిస్తారు.
తక్కువ హైట్ ఉన్న బాధ పడకండి.. మీరు సన్నని బోర్డర్స్‌తో ఉన్న చీరలను ఎంపిక చేసుకోండి. అసలు బోర్డర్ లేని శారీస్ కూడా మీకు బాగా నప్పుతాయి. హెవీ బోర్డర్స్ ఉన్న వాటిని కట్టుకుంటే అవే ఎత్తిచూపుతాయి.
ఇక ఏమైనా ఫంక్షన్లు జరిగితే బరువైన చీరలను ధరించకండి. ఒంటి పొరను పిన్ చేసి స్టైల్‌గా చేతిపై నుండి పట్టుకుని ఫంక్షన్‌కు వెళ్లండి..అందరి ముఖాలు మీ వైపే..
ఇక ఉద్యోగస్థులు ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి. ప్రిల్స్సెట్ చేసి పిన్ పెట్టుకోండి. ఆఫీసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడమే కాకుండా సింపుల్‌గా, సౌకర్యంగా ఉంటుంది.
saree 3
శారీపై ప్రిల్స్ ఉంటే పెట్టికోట్ వాడకండి.
కొంతమంది కాటన్ చీరలంటే చాలా మక్కువ ప్రదర్శిస్తారు. వీరు స్టార్చ్ పెట్టడం, ఐరన్ చేయడం మరచిపోవద్దు. ఇలా చేయడం వల్ల కాటన్ చీర అందం పెరుగుతుంది.
చీరకట్టు తెలిసిన వారి దగ్గర మరికొన్ని సలహాలు, సూచనలు పాటించి అందంగా తయారు కావచ్చు.
పొట్టిగా, లావుగా ఉన్న వారు నిలువుచారలున్న చీరెలు కొనుకోవద్దు. అడ్డచారల డిజైన్స్ అయితే బెటర్.
ఒక చీరకు రెండు, మూడు రంగుల వెరైటీ బ్లౌజ్‌ను సెలక్ట్ చేసుకోండి.
ప్రస్తుత కాలంలో ఒకే చీరకు రెండు పల్లులు వస్తున్నాయి. ఒక పల్లు సింపుల్‌గా..మరొకటి రిచ్‌గా ఉంటుంది. దీనిని తీసుకుంటే క్యాజువల్, పార్టీవేర్‌గా ధరించే అవకాశం ఉంది.
ఒక బ్లౌజ్‌కి ఏడు, ఏనిమిది రంగుల పూసలు, చమ్కీలు, సిల్క్ దారాలతో రిచ్ ఎంబ్రాయిడరీ చేసి ధరించండి. పార్టీలో ఉన్న వారంతా మీ వైపు చూస్తారు. నిజం..ట్రై చేయండి..
మరీ ముఖ్యంగా మీరు ఉన్న రంగును బట్టి చీరను ఎంపిక చేసుకోండి. మీ రంగుకు ఆ చీర నచ్చితే అని మీకనిపిస్తే సెలక్ట్ చేసుకోండి..