Remedies for skin diseases

చర్మ వ్యాధులకు చెక్

Remedies for skin diseases
సొరియాసిస్ తీవ్రమైన చర్మ సంబంధ వ్యాధి. ఈ వ్యాధి బారినపడిన వారిలో చర్మం

ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత తెల్లటి పొలుసుల మాదిరిగా రాలిపోతుంది.

విపరీతమైన దురద ఉంటుంది. ఈ వ్యాధిని ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’ అంటారు.

సాధారణంగా చర్మంలో కణజాల ఉత్పత్తి, కణజాల మర్పు నెలకొకసారి జరుగుతుంది.

సొరియాసిస్ వ్యాధి సోకితే కొన్నిరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కొన్ని

వాతావరణ పరిస్థితుల్లో పెరగడం, తగ్గడం జరుగుతుంది. సొరియాసిస్ గట్టెడ్, క్రానిక్

ప్లేక్, పస్టులర్, ఎరివూతోడెర్రా, నెయిల్ సొరియాసిస్, ప్లెక్సరల్, ఆర్థ్రోపతి సొరియాసిస్

వంటి రకాలున్నాయి.

సొరియాసిస్ దీర్ఘకాలం కొనసాగినపుడు జాయింట్లపై ప్రభావం పడుతుంది.

జాయింట్లలో నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని ‘సొరియాటిక్

ఆర్థరైటిస్’ అంటారు.

లక్నే వల్టారిన్

సాధారణంగా కనిపించే చర్మ వ్యాధి. దీని బారినపడిన వారిలో చర్మం ఎర్రగా

మారుతుంది. ముఖం, ఛాతీ, వీపు భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సెబాసియస్

గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది. యుక్తవయస్కుల్లో ఈ సమస్య

సాధారణంగా కనిపిస్తుంది. టీనేజ్‌లో టెస్టొస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా

జరగడం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. 25 సంవత్సరాలు వచ్చే సరికి

మొటిమలు వాటంతటవే తగ్గిపోతాయి.

ఎగ్జిమా

ఈ వ్యాధి సోకినపుడు చర్మం ఎర్రగా మారి పొలుసులు, దురదతో కూడిన పొక్కులు

వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎగ్జిమా బారినపడిన వారిలో చర్మం పొడిబారి పోతుంది.

కొందరిలో విపరీతమైన దురదతో పాటు రక్తం కారడం కనిపిస్తుంది.

హెర్పిస్

ఇది ఒక వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి . హెర్పిస్ సింప్లెక్స్ టైప్ 1, టైప్-2 వైరస్

రకాలు ఈ వ్యాధికి కారణమవుతాయి. చేతులు, కళ్లు, నరాల వ్యవస్థ పైన ప్రభావం

చూపుతుంది. హెర్పిస్ ఎన్‌కెఫలైటిస్ వ్యాధిలో మెదడు దెబ్బతింటుంది. రోగనిరోధక

శక్తి తగ్గిపోయిన వారిలో ఈ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ.

రింగ్ వార్మ్

ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి చర్మం పైనే

కాకుండా కేశాలు, గోళ్లపై కూడా వచ్చే అవకాశముంది. గుండ్రంగా బిళ్ళలుగా వచ్చే

ఈ చర్మ వ్యాధి జనాభాలో 20 శాతం మందికి వస్తుంది. పెద్దవారిలో ఎక్కువగా వచ్చే

ఈ చర్మవ్యాధి వేసవి కాలంలో పెరుగుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దుస్తులు వాడటం

వల్ల కూడా వ్యాపిస్తుంది. అందువల్ల ఈ వ్యాధి వచ్చిన వారు వాడిన దుస్తులు

వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ చర్మవ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన హోమియో వైద్యున్ని

సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే ప్రాథమిక దశలోనే చర్మ వ్యాధులకు చెక్

పెట్టచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *