హెచ్ఐవీ వైరస్ మటుమాయం!
HIV discovery reveals virus hidden in immune system cells
Philadelphia University discovered medicine to remove HIV virus from human DNA
ఫిలడెల్ఫియా: ఒక్కసారి ఎయిడ్స్ కారక హ్యూమన్ ఇమ్యూనోవైరస్ కానీ మనుషుల
కణాల్లోకి చేరిందంటే, ఇక అదెప్పటికీ అక్కడే ఉండిపోతుంది. అత్యంత
ప్రమాదకరమైన డీఎన్ఏను ఈ వైరస్ మానవ డీఎన్ఏలో ప్రవేశపెడుతుంది.
ఫలితంగా ఈ వైరస్ బారినపడినవారు జీవితాంతం మందులు వాడుతూనే ఉండాల్సి
వస్తున్నది. ఇటీవల ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్
పరిశోధకులు ఈ వైరస్‌ను శాశ్వతంగా మానవ కణాల నుంచి తొలగించే మార్గాన్ని
కనుగొన్నారు. వీరు హెచ్ఐవీ-1 వైరస్‌ను మానవకణాల నుంచి శాశ్వతంగా
తొలగించగలిగారు. ఏక్వర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) వ్యాధి
శాశ్వత చికిత్స కనుగొనడంలో ఇది తొలిమెట్టు అని పరిశోధనలకు నేతృత్వం
వహించిన కమేల్ ఖలాలీ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే
అవకాశం లేదు కానీ.. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో
పరిశోధనలు కొనసాగిస్తున్నామని వివరించారు. ముందుగా పరిశోధకులు
హెచ్ఐవీ-1 వైరస్ డీఎన్ఏను గుర్తించే గైడ్ ఆర్ఎన్ఏను తయారుచేశారు. దీనిని
ప్రయోగించినప్పుడు కణ డీఎన్ఏలకు అతుక్కుపోయిన వైరస్ డీఎన్ఏ పోగులను
గుర్తించింది. ఆ తరువాత డీఎన్ఏ మరమ్మతుల కోసం ఉపయోగించే సీఏఎస్9 అనే
ఎంజైమ్‌తో పరిశోధకులు వైరస్ డీఎన్ఏను మానవకణ డీఎన్ఏ నుంచి తొలగించారు.
ఆ వెంటనే కణంలో సహజంగా ఉండే జన్యుమరమ్మతు వ్యవస్థ ఉత్తేజితమై తెగిపోయిన
మానవకణ డీఎన్ఏ పోగులను అతికించేస్తుంది.వైరస్ డీఎన్ఏ లేని కణాలు
తయారయ్యాయి అంటే.. ఎయిడ్స్ వ్యాధి నయమైపోయినట్టే. ప్రపంచవ్యాప్తంగా 3.3
కోట్ల మంది ఎయిడ్స్ బాధితులున్నారు.