Personal Hygiene to follow before cooking

Personal Hygiene to follow before cooking
వంటగదిని నీట్‌గా పెట్టుకోండి
ఇంట్లో గదులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని మీకందరికీ తెలుసు కదా. ప్రస్తుతం వర్షాకాలం మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ‘కిచెన్‌’లో.

ఈ వంటిల్లుకు ప్రత్యేకత ఉంది. దీనిపై కొంత అధికంగానే శ్రద్ధ తీసుకోవాలి. ఎందుంటే మనం తినే ఆహారపదార్థాలు నిల్వ చేసుకునేది ఇక్కడే కాబట్టి. వంటిలు ఎలా ఉండాలో చూద్దామా

1. వంటకు ఉపక్రమించే ముందు స్నానం చేసి రావాలి. కొందరు వంట చేసిన తరువాత స్నానం చేయవచ్చు అనుకుంటారు ఇది తప్పు. ధరించే డ్రసు కూడా శుభ్రంగా ఉండాలి. చీరలు కట్టుకునే వారు కాటన్‌ చీరలు వాడాలి.

2. కొందరు చెప్పులతో వెళ్తారు. ఇలా వెళ్ళకూడదు. ఒకవేళ పాదరక్షలు వేసుకోవడం తప్పనిసరి అయిన వారు ప్రత్యేకంగా కిచెన్‌ కోసం ఓ జత చెప్పులు కొనుక్కోవాలి.

3. ఆహారం వండే ముందు, తినే ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకోసం సింక్‌ దగ్గర డెటాల్‌ వంటివి, వస్త్రం పెట్టుకోవాలి.

4. వంట అయిపోగానే వంటగద్దెను శుభ్రంగా కడిగేయాలి.

5. బయటకు వెళ్ళి వచ్చి నేరుగా వంట గదిలోకి వెళ్ళకూడదు. కాళ్లు, చేతులు కడుక్కొన్న తరువాత వెళ్ళాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *