భువనగిరి,
నల్లగొండ జిల్లా.
తెలంగాణ.
ఇండియా.
శ్రీ రాముడు రావణాసురునిపై యుద్దం చేసేముందు తమిళనాడు లోని రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని ఋషులు చెప్పడంతో రాముడు శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతున్ని ఆదేశించాడు. హనుమంతుడు శివలింగాలు ఉన్న పర్వతాన్ని చేరుకుని అక్కడ చాలా శివలింగాలు ఉండటంతో ఏ లింగాన్ని తీసుకెళ్ళాలి అనే సందేహంతో మొత్తం పర్వతాన్నే పెకిలించి తీసుకువెళ్తుంటాడు. హనుమంతుడు రావడం ఆలస్యం కావడంతో శ్రీరాముడు రామేశ్వరంలో ఇసుక లింగాన్ని ప్రతిష్టిస్తాడు. హనుమంతుడు లింగాల్ని తెచ్చేసమయంలో కొన్ని లింగాలు కిందపడటం జరిగింది. అలా భువనగిరిలోని చెరువు సమీపంలో పడిన లింగాలలో ఒకటే ఈ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో ఉన్నది. శివలింగం తన మహిమతో భక్తులకోర్కెలను తీర్చడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి నేటి పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంగా విలసిల్లుతుంది.
శివలింగం పై సూర్యకిరణాలు పడినప్పుడు లింగం ఆకు పచ్చరంగులోకి మారుతుంది. అందువల్లే ఈ శివలింగానికి పచ్చలకట్ట సోమేశ్వర లింగం గా ప్రసిధ్ధిగాంచింది.
పెళ్ళికాని వారు, శనిదోషం ఉన్నవారు మానసిక ప్రశాంతత కోసం భక్తులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శింస్తుంటారు.
Pachchala Katta Temple Nalgonda Telangaana