Mukku Pudaka Nose Stud

Mukku Pudaka Nose Studముక్కుపుడక’
ముక్కుపుడక లేదా ముక్కెర అంటారు. ఇది కూడా ఒక ధరించే ఆభరణం. ముక్కుపుడక ధరించడం వల్ల ఆడవారి అందం మరింత రెట్టింపు చేస్తుందంటారు.

సంపంగిలాంటి ముక్కుకు కొత్త అందాన్ని ఇస్తుంది. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలో ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నప్పుడే వీటిని కుట్టిస్తారు. అలా ముక్కుపుడక పెట్టుకునే అలవాటు అవుతుంది. హిందూ దేవతలకందరికి ముక్కుపుడక ఉంటుంది. కృష్ణా నది పొంగి బెజవాడ కనకదుర్గమ్మ ‘ముక్కెర’ను తాకితే భూమిపై ఎవరూ మిగలరని కాలజ్ఞానంలో చెప్పబడిందని అంటుంటారు. దక్షిణ భారతదేశంలో దీనిని ఎక్కువగా కుడివైపు పెట్టుకుంటే ఉత్తరాదిలో మాత్రం ఎడమవైపున పెట్టుకుంటారు. ప్రస్తుతం మారుతున్న సమాజంలో కొందరు మహిళలు ముక్కుపుడక అంటేనే అమ్మో..భయం అంటారు. ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా దీనిని మార్చకుండా ధరిస్తుందంట. అలాగే ప్రపంచ సుందరియైన ఐశ్వర్యరాయ్‌ ప్రపంచ సుందరి పోటీలో ముక్కుపుడకతో పాల్గొని అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.

mukkupudaka 2

ముక్కుపుడక అనగానే ఓ కథ గుర్తుకొస్తుంది. విదేశాలలో ఈ ఘటన జరిగింది. భారతీయ సాంప్రదాయాలలో నిలిచిన ఈముక్కుపుడకను పెట్టుకుని భారత సంతతికి చెందిన పన్నాన్‌ కన్నోల్లి (13) స్కూలుకెళ్ళింది. కానీ అక్కడి స్కూలు యాజమాన్యం కన్నోల్లిని అడ్డుకుంది. కారణం ‘ముక్కుపుడక’ పెట్టుకుందని..అది తీస్తేనే స్కూలుకు రావాలని ఆదేశించింది. తాను ముక్కుపుడక పెట్టుకొనే స్కూలుకు వస్తానని..పోరాటం చేసింది. కన్నోల్లికి బాసటగా బ్రిటన్‌లోని హిందూ కౌన్సిళ్ళన్నీ మద్దతు తెలిపి తమ సహాయ సహకారాలందించాయి. ఎట్టకేలకు స్కూలు యాజమాన్యమే దిగొచ్చింది తన నిబంధనలు సడలించుకుంది. విదేశాల్లో సైతం భారతీయ సాంప్రదాయాన్ని కాపాడిన కన్నోల్లిని అందరూ అభినందించారు.

శతాబ్దకాలం నుండి వంశపారంపర్యగా వస్తున్న ఈ అలంకరణ మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే స్త్రీకి బహుకరించాలన్నది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం. ఇవి తమతో ఉన్నంత కాలం భర్తలు క్షేమంగా ఉంటారన్నది వారి నమ్మకం. ముక్కుపుడక ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. ఊళ్ళో కొన్ని ప్రాంతాలలో చూస్తే ముక్కుకు కొన్ని ముక్కుపుడకలను ధరిస్తుంటారు. ఇప్పుడు పెళ్ళి కాని యువతులు కూడా ధరిస్తున్నారు. మార్కెట్లో కూడా వెరైటీ ముక్కుపుడలు దొరుకుతున్నాయి.

mukkupudaka 3

కొంతమందికి ముక్కుపుడక పెట్టుకోవాలని ఆశ ఉంటుంది..కాని వారికి ముక్కును కుట్టించుకోవాలంటే భయంగా ఉంటుంది. అలాంటి వారి కోసం మార్కెట్‌లో రెడిమేడ్‌ ముక్కుపుడకలు దొరుకుతున్నాయి. ముక్కుకు ప్రెస్‌ చేస్తే సరి..మరి మీరేం చేస్తారు..అలవాటు లేని వారు ఒక్కసారి ముక్కుపుడకను పెట్టుకుని అద్దం చూసుకొండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *