Latest Gowns
లెటెస్ట్ గౌన్స్
సిగ్గు ఎక్కువగా మహిళలకే అంటారు చాలా మంది. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మారుతున్న సమాజంలో యువతులు మారుతున్నారు. వివిధ ఫ్యాషన్లతో ఆకట్టుకుంటున్నారు.
చీరలు ధరించిన వారు ఒక్కసారిగా చుడీదార్లోకి మారేటప్పుడు మనకు నప్పదేమోనని అనుకుంటారు.
కానీ అది ధరించిన తరువాతే అబ్బ చాలా బాగున్నావు అని తోటి వారు కామెంట్ చేస్తే అప్పుడు హ్యాపీగా ఫీలవుతారు. ఇప్పుడు యువతులు ఎక్కువగా గౌన్లు ధరిస్తున్నారు. ముందు గౌన్లంటే ప్లేన్ కలర్స్‌లో మాత్రమే ఉండేవి. ప్రస్తుతం రంగు రంగు కలర్స్‌తో, వివిధ రకాల క్లాత్‌లతో వీటిని తయారు చేస్తున్నారు.
ట్రెండీ ఔట్లుక్ : చక్కని శరీరాకృతికి నప్పుతుంది. ఈవెనింగ్ పార్టీలకు కరెక్టుగా సరిపోతుంది. వేరే అలంకరణలు లేకుండా ఆధునిక యువతులకు సొగసైన డ్రెస్ అని చెప్పవచ్చు. ఏదైనా వేడుక సమయంలో ఈ డ్రెస్‌ను ధరిస్తే ఎక్కడ ఉన్నా మీరే సెంటర్ ఎట్రాక్షన్ అవుతారు.
మాస్టర్ పీస్ : డిజైన్లలో ఈ ఫ్రాక్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఫ్యాషన్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ లాంగ్ ఫ్రాక్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ కలర్స్, డిజైన్స్లలో విభిన్న రకాలుగా యువతిని ఆకర్షిస్తోంది. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్స్, సీక్వెన్స్, బీడ్ వర్క్ ఈ ఫ్రాక్‌కు అదనపు హంగులుంటాయి.
కాక్టెయిల్ ఫ్రాక్ : అందమైన మోటిప్స్, పువ్వులు, ఆకుల డిజైన్స్‌తో ఈ ఫ్రాక్ను తీర్చిదిద్దారు. తాజా అనుభూతిని, సౌకర్యాన్ని కలిగించే ఈ డ్రెస్‌ను ధరింస్తే ఈవెనింగ్ పార్టీలో గ్రామరస్గా వుంటారు.
ఛార్మింగ్గౌన్ : పాశ్చాత్యగౌనులు ధరించడానికి నేటి యువతి పోటీ పడుతోంది. కళ్ళకు కట్టిపడేసే రంగులతో ఆకట్టుకుంటున్నాయి. ఈ గౌను ధరించిన వారు మంచి ఛార్మింగ్లుక్తో కట్టిపడేస్తున్నారు. ఇతరుల చూపులను తమవైపు తిప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ రకాలైన ‘గౌన్ల’ ఫోటోలు ఇచ్చాము. చూడండి.