Ladies Jeans Styles
జీన్స్ అంటే మగవారే వేసుకునే వారు. కానీ మారుతున్న కాలానికి తోడు ఫ్యాషన్ కూడా మార్పులు చెందుతోంది. ఇప్పుడు ఈ జీన్స్ మహిళలకు కూడా వచ్చేశాయి.
ఫ్యాషన్పరంగానే కాక ఉద్యోగ నిర్వాహణలో అనుకూలంగా ఉంటున్నాయి. అందుకే జీన్స్ అంటేనే యువతులు మక్కువ చూపుతున్నారు. శరీరాకృతికి సరిగ్గా సూటవ్వక సరైన స్టయిల్ కానట్లయితే ఎబ్బెట్టుగా తయారవుతారు.
పియర్ షేప్
ఇటువంటి ఆకృతి గల వారికి కింది భాగం భారీగా ఉంటుంది. నిండు రంగులు ధరిస్తే వీరు నాజుగ్గా కనిపిస్తారు. ఫర్పెక్ట్ ఫిట్, లోయెస్ట్, బూట్‌కట్ లేదా తేలిగ్గా విచ్చుకుని ఉండే జీన్స్ బాగా నప్పుతాయి. ఓ మాదిరిగా ఫిట్ కావాలి కాని బాగా టైట్‌గా ఫిట్ అనిపించకూడదు. వీటిపై పొడుగ్గా ఉండే టాప్స్ వేసుకుని లార్జ్ హీల్స్ వేసుకుంటే బాగుంటుంది.
jeans 2
యాపిల్ ఆకృతి
ఈ ఆకృతి గల వారికి పైభాగం భారీగా ఉంటుంది. ఫర్ఫెక్ట్ ఫిట్ : నడుము భాగంలో ఫిట్ అయ్యే స్ట్రెచ్ అయ్యే జీన్స్ వేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. ఎలైన్ లేదా బయాస్డ్ కట్ టాప్స్ వేసుకోవాలి. బాగా టైట్‌గా ఉంటే టీషర్టులు వేసుకోకండి. ఫ్లాట్ టై -ఆప్స్ లేదా బ్యాలెట్ షూస్ వేసుకుంటే ఫ్యాషన్‌గా కనిపిస్తారు.
హవర్‌గ్లాస్ ఆకృతి : అంటే కొంచెం భారీగా ఉన్న వారికి స్ట్రెచ్‌గా ఉండే జీన్స్ వేసుకుంటే బాగుంటాయి. డెనిమ్, క్యాప్రిస్ కూడా చాలా బావుంటాయి. ఫంకి టీ షర్ట్స్, ప్రింటెడ్ లేదా భుజాలు లేని టాప్స్ వేసుకొండి. స్మార్ట్‌గా కనిపిస్తారు.
ప్లస్ సైజు : భారీగా ఉన్న వారికి శరీరానికి హత్తుకపోయే రకాల్ని ఎంచుకోవద్దు. ఫర్పెక్ట్ ఫిట్ బూట్ కట్ జీన్స్ అయితే బెటర్. క్యాప్రీలు, త్రీ ఫోర్త్లు కూడా బాగానే ఉంటాయి. మందపాటి డెనిమ్స్ జోలికి వెళ్ళకండి. స్ట్రెచ్ అయ్యే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. నల్లని శాండిల్స్, చెప్పల్స్ వీరికి బాగుంటాయి.
jeans 1
పొట్టికాళ్ళు ఉన్నవారికి : స్కిన్‌ని, బూట్-కట్ జీన్స్ వేసుకుంటే పొట్టిగా ఉన్న కాళ్ళు కాస్తా పొడుగ్గా కనిపిస్తాయి.
థండర్ థైస్ : కాళ్ళకు కొంచెం అంటిపెట్టుకుని ఉండే స్టయిల్స్ ఎంచుకోవాలి. ఇవి పూర్తిగా అంటుకొని ఉండకూడదు.
చిన్న నడుము : హై వెయిస్ట్ జీన్స్ ఎంచుకోవాలి. బూట్-కట్, తేలికపాటి మడతలుండే జీన్స్ బాగుంటాయి.
ఈ డెనిమ్స్ ఎంత నిండుగా ఉంటే అంత నాజుకైన రూపం స్వంతమౌతుందని గ్రహించండి.
పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ ప్రింట్స్, వెయిస్ట్ ట్రిమ్మింగ్స్ను అసలు ఉపయోగించకండి.
డెనిమ్స్ తొలి ఉతుకులో పింక్ అవుతాయి. ఉతికేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుక ఉంటే ఎక్కువకాలం మన్నుతాయి.