Ladies Decoration
ముచ్చటైన అలంకరణ
స్త్రీలు ముచ్చటగా అలంకరించుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. ఎదో హడావుడిగా అయిపోయిందిలే అనిపించుకుని కొంతమంది స్త్రీలు తయారవుతారు. ఫంక్షన్లకు, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అందంగా తయారవుతే బాగుంటుంది. ఎలా తయారు కావాలో కొన్ని అంశాలు మీ కోసం..ట్రై చేయండి.. తేడా గమనించండి..
మొట్టమొదటిగా చెప్పాల్సింది కట్టు. భారతదేశ సాంప్రదాయంలో ఏ పండుగైనా, పార్టీయైనా, ఎక్కడికి వెళ్ళినా దీని ఫ్యాషన్ దీనిదే. అదేనండి ‘చీర’ ఇది కట్టుకోవడం వల్ల సాంప్రదాయ కళ ఉట్టిపడుతుంది. ధర్మవరం, పోచంపల్లి, చేనేత, కంజీవరం, ఉప్పాడ, సిల్క్ చీరలు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మనకి నచ్చింది..సూటయ్యేది ఎంచుకుని కట్టుకోండి. ఎవరి శరీరాకృతి బట్టి ఫ్యాబ్రిక్ ఎంచుకోండి. లావుగా ఉన్నట్లైతే ‘జార్జెట్ బెనారస్’ ఉపయోగించండి. అదే స్లిమ్‌గా ఉన్నవారు ‘బెనారస్ ఫ్యాబ్రిక్స్ ఎన్నుకోవచ్చు. టిష్యూ లేని ప్లెయిన్ కంచిపట్లు బార్డర్ ఉన్నది లావుగా ఉన్న వారు ఎంచుకుని కుట్టుకుని చూడండి. ఇక 40 సంవత్సరాలు ఉన్నవారు కాటన్,. సిల్క్, గద్వాల్ చీరలను ఎంచుకుని కట్టుకోండి.
కలర్స్ : ఇక కలర్స్ విషయానికొస్తే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు సాంప్రదాయ కలర్స్ పండుగలకు అబ్బుతాయి. లేత రంగులు ఇష్టపడే వారు ఈ కలర్స్‌లోనే లైట్‌వి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. లావుగా ఉన్నవారు ముదురు రంగులను ఎంపిక చేసుకోవాలి. సన్నగా ఉన్నవారు లేత రంగులను ఎంపిక చేసుకుని ధరించండి.
అభరణాలు : పండుగలప్పుడు మెరిసే వాటికన్నా యాంటిక్ జ్వువెల్లరి వాడండి. తెల్లరంగు కలవారు డైమండ్స్ లాంటి ఆభరణాలు ధరించవచ్చు. తమ తమ స్థోమతను బట్టి ఆభరణాలు ధరించండి. అవి మరి ఎబ్బెట్టుగా కనిపంచకుండా ఉంటే సరిపోతుంది.
మేకప్ : పగలు ఏదైనా ఫంక్షన్ ఉందనుకొండి మేకప్ ఎక్కువగా వేసుకోవద్దు. మీడియం టోన్ ఉన్న మేకప్ కిట్‌ను ఎంచుకోవాలి. తాము ధరించిన ఫ్యాబ్రిక్‌ను బట్టి మేకప్ వేసుకుంటే బాగుంటుంది. వేసుకున్న ఫ్యాబ్రిక్‌కు మేకప్‌కు తేడా ఉంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. నలుగురిలో మంచిగా కనబడదు.
hari style
కేశ అలంకరణ : తాము ఏ ఫంక్షన్‌కు వెళుతున్నారో..ఎప్పుడు కేశాలను ఎలా అలంకరించుకోవాలో ఎక్కువగా స్త్రీలకే తెలుసనుకోండి. పండుగలకైతే పొడవాటి జడలు అందంగా ఉంటాయి. జుట్టు పొట్టిగా ఉందనుకోండి సవరాలు ఉన్నాయిగా వీటిని పెట్టుకొని పొడవుగా వేసుకోండి. అలాగే వదిలేస్తే కూడా బాగుంటుంది. సాయంత్రం వేళల్లో కేశాలను అలాగే వదిలేసి మధ్యలో ఓ రాళ్ళబిళ్ళలు లాంటివి పెట్టుకుని వెళ్ళండి. పాపిడ బొట్టు అని ఇలా ఎన్నో రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. క్వాలిటీ గమనించి తీసుకోండి. అలాగే చెవి కమ్మలు, కాని ముక్కు పుడకలాంటివి మరీ పెద్దదిగా ఉండకుండా ఉంటే బాగుంటుంది. సింపుల్‌గా తయారు కావచ్చు.
కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే మీరు అందంగా తయారై వెళ్ళవచ్చు.. మీ వెంట వచ్చే వారిని మనస్సు గాయపర్చకుండా..నలుగురిలో మిమ్మల్ని మెచ్చుకునేలా అలంకరించుకుని వెళ్ళండి..మీరు హ్యాపీ..మీ తోటి వచ్చిన వారు హ్యాపీ ఏమంటారు…