Ladies Bangles

Ladies Bangles ‘గాజుల’ గలగలలు
మగువుల అలంకార వస్తువుల్లో దీనికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఎంటిదో ఊహించండి.. కరెక్టు. ‘గాజులు’ చేతిగాజులకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్నాయి.
మట్టివి, బంగారు గాజులైనా వీటిని ధరించడం ఆడవారికి మంగళ ప్రదమైనవని పూర్వకాలం నుండి నమ్ముతారు. వివిధ ఫ్యాషన్‌లతో కూడిన గాజులు నేటి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మట్టి గాజుల నుండది బంగారు గాజుల వరకు వారి వారి స్థోమతను బట్టి ధరిస్తారు. గాజులు ‘శుభానికి’ సంకేతాలుగా చెబుతుంటారు. గాజులను ‘దానం’ చేస్తే మంచిదని.. దీనివల్ల మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. పూర్వం పూజలు చేసినా, తాంబులం ఇచ్చినా ‘గాజులను’ దానంగా ఇచ్చే వారు. ఇప్పటికీ అక్కడక్కకడ ఈ దృశ్యాలు కనిపిస్తుంటాయి. శుభకార్యాలు చేసేటప్పుడు ‘ముత్తయిదవులను’ ఇంటికి పిలిపించుకుని వారి కాళ్ళకు పసుపు, మెడకు గంధం, తిలకం అద్దుతారు. తమల పాకులు, జాకెట్‌ కనుము, ఇతరత్రాతో పాటు ‘గాజులను’ ఇస్తుంటారు.

bangles1

ఆధునిక యుగంలో వస్తున్న మార్పులనుగుణంగా ‘యువత’ కూడా మార్పును కొరుకుంటోంది. చేతుల నిండుగా గాజులు వేసుకుంటే ఆ అందమే వేరు. ప్రస్తుతం రెండు చేతులకు రంగు రంగులతో కూడిన వాటిని వేసుకుంటున్నారు. మట్టి గాజులు కాకున్నా బంగారం, వెండి, మెటల్‌, లక్క ప్లాస్టిక్‌, దంతంతో చేసిన వాటిని ధరిస్తున్నారు. చేతులకు గాజులు వేసుకోవడం వల్ల శరీరానికి ‘లాభాలే’ ఉన్నాయని కొందరు చెబుతుంటారు. చేతి నరాలపై ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ మెరుగౌతుందని, గాజుల శబ్ధం మనిషి మెదడును ప్రభావితం చేస్తుందని సర్వేలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొంటారు.

bangles 2

ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల గాజులు వస్తున్నాయి. చేతికి ఎవి నప్పుతాయో వాటిని సెలెక్ట్‌ చేసుకోండి. రకరకాలైన గాజులు, రంగు రంగుల గాజులు సెలక్ట్‌ చేసుకోండి. మరి చమ్కీగా ఉన్న గాజులను వేసుకోకండి. రసాయన పదార్థాలతో చమ్కీలు చేయడం వల్ల అవి మీ శరీరంపై పడి దుద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. చేతికి నిండుగా ‘గాజుల’ను ధరించండి..ఏది ఏమైనా చేతుల అందాలను మరింతగా పెంచేవి గాజులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *