Jasmine flowers health benefits
మల్లెపూలు…దీనితో..
మల్లెపూలను ఏం చేస్తారు…ఏం ప్రశ్న అది ఆడవారు తలలో పెట్టుకుంటారు. అని
ఠక్కున సమాధానం చెబుతారు కదా ! మీరు చెప్పేది కూడా కరెక్టె. మల్లెపూలు
కనబడితే చాలు ఆడవారు దానిపై మనస్సు పారేసుకుంటారు.
ఎన్ని పూలు ఉన్నా మల్లెపూలది మాత్రం ప్రత్యేక
స్థానం అని చెప్పవచ్చు. మల్లెపూలను ఏం చేస్తారు అని అడిగి వేదాంతం
చెబుతున్నారు అని అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం.. మల్లెపూలను తలలో
పెట్టుకోవడమే కాకుండా సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా వాడుతారు తెలుసా
? తెలియదా అయితే ఈ క్రింది వాటిని చదివి ట్రై చేయండి..తేడా గమనించండి..
మల్లెల్ని పేస్టుగా చేసి, కొద్దిగా పచ్చిపాలు కలిపండి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా
మసాజ్ చేసుకోవాలి. తరువాత ముల్తాన మట్టి, తెనే గంధంలను అర స్పూన్ చొప్పున
తీసుకుని ప్యాక్ వేసుకోవచ్చు.
కొబ్బరి నూనెలో మల్లెల్ని ఓ రాత్రంతా నాననివ్వండి. తరువాత మరిగనివ్వండి.
దీనిని కాచి వడగొట్టి ఓ డబ్బాలో నిల్వ చేసుకుని కేశాలకు రాయండి. కేశాలకు మంచి
పోషణనివ్వడమే కాకుండా సువాసన కూడా వస్తుంది.
చర్మానికి అవసరమయ్యే మిటమిన్ సి మల్లెల్లో విరివిగా ఉంటుందని వైద్యులు
పేర్కొంటుంటారు. అందుకే మల్లె తూడులను అన్నంలో కూడా తింటారు. ఇక్కడ
కాదు లేండి గ్రామీణ జీవితంలో బాగా కనబడుతుంది.
మల్లెపూలు, గులాబీ పువ్వులను తీసుకోండి. వీటిని నుండి రసం తీయాలి.
గుడ్డులోని పచ్చసొన రెండు స్పూన్ల చొప్పున తీసుకోని బాగా అన్నింటిని కలుపుకోవాలి.
దీనని ముఖానికి పట్టిస్తే మృదువుగా, కాంతివంతంగా ఉంటుది…ట్రై చేస్తారుగా .