శ్రావణమాసం గురించి మీ కోసం..
Shravana maasam pramukhyatha
మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. ఆలయాల్లో ప్రత్యేక
పూజలు నిర్వహిస్తుంటారు. ఈ మాసంతా అంతా పండుగ వాతావరణం నెలకొని
ఉంటుంది. పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు ఇలా ఎవరో ఒకరి ఇంట్లో పూజ ఉండనే
ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు ‘మహలక్ష్మి’లా వెలుగొందుతూ తమ
కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు
చేస్తుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూర్తాయని
పెద్దలు చెబుతుంటారు. ఈ నెల రోజుల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది.
విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రమున పుట్టారు.
ఈ నెలలో జన్మించిన వారు వేదొక్త కర్మలు నిర్వహించడం, సకల జనుల
గౌరవమన్ననలు పొందడం..సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయని..నమ్మకం.. ఈ
శ్రావణమాసంలో ప్రతి రోజు ముఖ్యమైనదే…ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో
దేవతను పూజిస్తుంటారు.
సోమవారం : శివుడికి అభిషేకాలు
మంగళవారం : గౌరీ వ్రతం
బుధవారం : విఠలుడికి పూజలు
గురువారం : గురుదేవుని ఆరాధన
శుక్రవారం : లక్ష్మీ, తులసి పూజలు
శనివారం : హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరుడికి పూజలు చేస్తుంటారు.
అంతేకాక నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి,
సీతల సప్తమి, శ్రీ కృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ శ్రావణ
మాసంలోనే వస్తాయి.