తిండి మానాలంటే ఇలా చేయాలి
how to stop eating excess food
Tips to control gluttony
మనలో చాలామందికి ఎక్కువ ఆకలిగా లేకపోయినా కాలక్షేపానికి తినడం
అలవాటుంటుంది. పోషకాహారం తీసుకుంటుంటే అనవసరంగా చిరుతిళ్ళ బారినుంచి
తప్పించుకోవచ్చు. లేదా అటువంటి కోరికను అణచుకోవచ్చు. అదే జంక్ ఫుడ్
అలవాటుంటే ఎంత తింటుంటే మరింత తినాలనిపిస్తుంది.
1. ఇంక ఆకలి లేదు అన్నప్పుడే తినడం ఆపేయాలి. పూర్తిగా పొట్ట నిండిపోయేలా
ఉండకూడదు. అంటే, ఇంకో చపాతి, లేక ఇంకో దోశ, లేక మరికొంచెం అన్నం
తినగలిగినప్పుడే తినడం ఆపేయాలి.
2. పరిశోధనలు ఏం చెప్పున్నాయంటే, చిన్న ప్లేటులో తింటే మామూలుగా తీసుకునే
ఆహారం కంటే 14 శాతం తక్కువగా తీసుకుంటారు. ఆ ప్లేటు ఖాళీ అయిపోయిన
ప్రతిసారి మళ్లీ వెళ్లి నింపుకురావాలి. ఆ క్రమంలో రెండోసారి పెట్టుకోగానే ఇంక
చాలనిపిస్తుంది.
3. మీకు అనారోగ్యాన్ని కలిగించే ఆహారం మీ గదిలో కాని, ఇంట్లో కాని
ఉంచకూడదు.
4. మీరు భోజనం చేసే ప్లేటులో సగానికి పైగా కూరలు, పండ్లతో నింపేయాలి.
మిగిలిన సగాన్ని ప్రొటీన్లు, స్టార్చ్తో నింపాలి.
5. బజార్లో కొనే వస్తువులతో జాగ్రత్త. ‘ఆరోగ్యకరమైన ఆహారం’ పేరుతో ఉండేవాటిలో
ఎక్కువశాతం కేలరీలు, కొవ్వు, చెక్కెర మిగిలిన వాటికంటే ఎక్కువ ఉంటాయి.
6. మీరు రోజూ తీసుకునే ఆహారం ఏంటో ఒక డైరీలో రాసి పెట్టుకుంటూ ఉంటే
ఎటువంటి భోజన అలవాట్లు మీకు ఉన్నాయో అర్ధం అవుతుంది. ఆ జాబితా నుంచి
ఏం తీసివేయచ్చో తెలుసుకోగలుగుతారు.