How to make pure kajal at home

How to make pure kajal at home

Intivadda Katuka Thayaru Cheyadam yela?

కళ్ళకు అందం ‘కాటుక’

కళ్ళకు ఏం అందం..అంటే ఏం చెబుతారు ? కళ్ళకు అందమా ? అని

ఆశ్చర్యపోతారు కదా…’కాటుక’ అండి..

కళ్ళకు కాటుక పెట్టుకుంటే ఎంత అందం వస్తుందో తెలుసా ? ఎంత చిన్న కనులున్నా

ఈ కాటుక పెట్టుకుంటే పెద్దదిగా కనుబడుతాయి. కాటుక వల్ల కళ్ళకు చలువే

కాకుండా కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి. చక్కగా కంటి రెప్పలంచు భాగం మీద

వేలితో సన్నగా పెట్టుకోవాలి.

ఎన్నో రకాల కాటుకలు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఏది మంచిదో కాదో

తెలుసుకుని వాడాలి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూస్తున్నది రెండు కళ్ళే కాబట్టి.

అందుకే కంటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని కాటుకలు

వాడడం వల్ల కళ్ళకు మంటలు, దురదలు వస్తుంటాయి. మరి ఎలా అంటారా ?

అయితే ఇంట్లోనే కాటుక తయారు చేసుకోవచ్చు…

ప్రమిద, ఆముదం, దూది(వత్తి), రాగి పాత్ర, గంధం, కర్పూరం,

ఒక శుభ్రమైన ప్రమిదను తేవాలి. మంచి ఆముదాన్ని ప్రమిదలో పోయాలి. అందులో

దూదితో చేసిన వత్తిని ముంచి వెలిగించాలి.ో రాగి పాత్రను వెలుగుతున్న వత్తికి

సుమారు 2 నుండి 3 అంగుళాలపైన ఉండేట్లు బోర్లించాల్సి ఉంటుంది. అరె మసి

అంటుకుంటుంది అంటారా ? అదే ఎక్కడైతే మసి అంటుకుంటుందో అక్కడ గంధం

పూయండి. మధ్య మధ్యలో ఆముదం పోస్తూ ఉండండి. అంటే బాగా మసి పట్టేంత

వరకు చూడాలి. తరువాత రాగిపాత్రకు పట్టిన మసిని మెల్లిగా గీకాలి. దీనిని

ఆముదంతో తడిచేసి ఇందులో కొంచెం కర్పూరం కలిపి శుభ్రమైన సీసాలో నిలువ

చేయాలి. అంతే కాటుక తయార్‌…

ఇంకోటి..కాటుక పెట్టుకంటే కళ్ళు అందంగా కనిపించాలంటే కనుబొమ్మలు చక్కగా

ట్రీమ్‌ చేసుకోవాలండి. కళ్ళకు కాటుక పెట్టుకోని వారు ఒక్కసారి ప పెట్టుకొని

చూడండి..తేడా మీరే గమనిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *