How to get rid of dark spots on face and darkening of elbow

How to get rid of dark spots on face and darkening of elbow

మో చేతులు, ముఖంపై నల్లటి మచ్చలు

మోచేతుల మీద కొంతమందికి నల్లగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానిక పలు

రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాగే ముఖంపై నల్లటిమచ్చలు తగ్గాలంటే ఈ కొన్ని

చిట్కాలు పాటించండి.. ట్రై చేయండి

మోచేతుల నలుపుదనం తగ్గాలంటే
పెసరపిండి తీసుకుని మోచేతులపై రాయాలి. కొద్దిసేపటి తరువాత నీటితో

కడిగేయాలి. తరువాత రెండు టీ స్పూన్ల కమలాపండు రసాన్ని తీసుకొని మోచేతులకు

పట్టించండి. మంచిగా ఓ 20 నిమిషాల పాటు మసాజ్‌ చేసి ఈసారి గోరువెచ్చని

నీటితో కడిగేయండి. ఇప్పుడు ఒక ఐదారు చుక్కల బాదం ఆయిల& రాయాలి. ఇలా

రెండు వారాల పాటు రాయాలి. తరువాత తేడా మీరే చూడండి.

అరటిపండు ఫేస్‌ ప్యాక్‌
అరటిపండును తీసుకుని మెత్తగా చిదమాలి. ఇందులో అర టీ స్పూన్‌ తేనే, బాదం

ఆయిల్‌, ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు

ప్యాక్‌ మాదిరిగా వేయాలి. ఓ 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీటితో కడిగేయండి.

వారానికి రెండు సార్లు చేయాలి. అంతే ముఖం పొడిబారడం, నల్లటి మచ్చలు తగ్గి

చర్మ మృదువుగా మారుతుంది. ట్రై చేసి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *