High heels care
హీల్స్‌తో జాగ్రత్త..
ఎత్తుమడపలు చెప్పులు వేసుకోనేముందు ..
ఎత్తుమడమలు చెప్పులు కొనేటప్పుడు పాయింట్ హీల్‌కు బదులుగా అడుగును పాదమంతా సమానంగా ఉండే రకాలను ఎంచుకోవాలి. దీనివల్ల మడమపై కాకుండా శరీర బరువు కాలు మీద పడుతుంది.
తరచూ ఎత్తుమడమల చెప్పులు ధరించాల్సి వస్తే గోరువెచ్చని కొబ్బరినూనె రాసుకోవడం వల్ల అరిపాదాలు నొప్పి పుట్టవు.
పగుళ్ళు బాధిస్తుంటే హీల్స్‌ను వదిలేయండి.
పాదానికి పట్టినట్లుగా ఉండే చెప్పుల్ని ధరించకూడదు. కాస్తా వదులుగా ఉండే చెప్పుల్ని ధరించాలి.
సందర్భాన్ని బట్టి చెప్పుల్ని ధరించాలి. వేగంగా నడవాల్సి వచ్చినప్పుడు, షాపింగ్, మెట్లు ఎక్కే సందర్భాలలో హీల్స్‌తో ఇబ్బంది తప్పదు.
అదే పనిగా వేసుకోవాల్సి వస్తే మాత్రం కాళ్ళకు వ్యాయామం ఉండాలి. హీల్స్ వల్ల పాదాలు అరిగిపోతాయి. కాసేపు చెప్పుల్ని వదిలేసి పచ్చగడ్డిలో నడవండి. ఎంత హాయిగా ఉంటుందో..రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అలసట దూరమవుతుంది. నొప్పులు బాధించవు.
ఎలాంటి చెప్పులు వేసుకోవాలి.
రోడ్డు మీద అమ్మాయి నడుస్తుంటే ఏం నడుస్తుందిరా..అమ్మాయి అంటుంటాం..అమ్మాయి అంటే అలా నడవాలి అంటూ పురుషులే కాదు అమ్మాయిలు కూడా అంటుంటారు. వీరి నడకను వారు వేసుకున్న చెప్పులు నిర్ణయిస్తాయంటే నమ్ముతారా ?
Ladies-Chappal
అవును వేసుకునే చెప్పులను బట్టి కూడా ఆ అందం కాస్తా మరింత రెట్టింపు అవుతుంది. ఒకప్పుడు కేవలం పాదాలకు రక్షణగా పాదరక్షలను వాడేవారు. ఇప్పుడు ఫ్యాషన్‌కు అనుగుణంగా చెప్పుల్ని కూడా మారుస్తున్నారు. మార్కెట్లో శాండల్స్, ప్లేట్స్, హీల్స్ ఇలా ఎన్నో రకాల పేర్లతో మగువల మనస్సులను దోచేస్తున్నాయి.
కొన్ని రకాల దస్తులను ధరించేటప్పుడు వాటికి తగిన పాదరక్షలను ధరిస్తే మరింతగా అందంగా కనిపిస్తారు. వివిధ రంగులు, డిజైన్లతో పాదరక్షలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అందానికి అందం..ఫ్యాషన్‌కి ష్యాషన్.. నడకలో హుందాతనం..వయ్యారం ఇనుమడింప చేయాలంటే పాదరక్షలను కరెక్టుగా సెలక్ట్ చేసుకోవాలి. కొన్ని రకాల చెప్పులు వేటికి సూట్ అవుతాయో చూద్దామా
బలెట్స్ : ఈ రకం చెప్పులు డెనిమ్ స్కర్టులు, పొట్టి స్కర్టులు, మోకాళ్ళ వరకు ఉండే డ్రెస్ ధరిస్తే ఈ రకమైన చెప్పుల్ని వేసుకోండి..తేడా మీరే చూడండి..
టేపరింగ్ హిల్స్ : పొట్టి స్కర్టులు, పొడుగ్గా ఉన్న స్కర్ట్లు, కుర్తా, పూలతో ఉన్న దుస్తుల మీద బాగుంటాయి.
చెప్పల్స్ : కుర్తాలు, ఎత్నిక్ టాప్స్, పొడవైన కుచ్చిళ్ళు ఉంటే ఈ రకమైన చెప్పులు బాగుంటాయి.
స్టిలోటోస్ : అనబడే ఎత్తు మడమలు చెప్పులను కుర్తాలు, ఇతర డ్రెస్‌లు, స్కర్ట్లుతో బాగుంటాయి.
సల్వార్ – కుర్తాలతో బలెట్స్ ధరించకూడదు. అలాగే ట్రౌజర్లు, చొక్కా ధరించినప్పుడు చెప్పల్స్ వేసుకోకూడదు.