Health disadvantages of eating while watching TV

Health disadvantages of eating while watching TVటీవీ చూస్తూ తినడం అనర్థం!

బొద్దుగా వుండే చిన్నారుల్ని చూస్తే ఎవరికైనా ముద్దే. కానీ కొందరు పిల్లలు వాళ్ళ

వయసుకి వుండాల్సిన బరువుకంటే రెట్టింపు బరువు పెరుగుతున్నారు. త్వరగా బరువు

పెరిగిపోవడానికి ముఖ్య కారణం, మన జీవన శైలి. మనం తినే, తాగే, పనిచేసే

పద్ధతుల వల్లనే తీసుకునే ఆహారంలో కూరగాయల పరిమాణం రోజురోజుకీ

తగ్గిపోతుంది. టెక్నాలజీ పెరిగినకొద్దీ టీ.వీ.లు సన్నగా తయారవుతుంటే ప్రేక్షకులు

వాటి ముందు గంటల తరబడి కూర్చోని లావైపోతున్నారు. భారతీయుల శరీరతత్వం

ప్రకారం తక్కువ ఆహారం , తక్కువ కేలరీలు సరిపోతాయి. కనుక మనం చక్కెర,

స్టార్చ్‌, కొవ్వుతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకుంటే పిల్లలు, పెద్దలూ త్వరాగా

స్థూలకాయులైపోతారు. దానితో అధిక రక్తపోటు, పక్షవాతం హార్ట్‌ఎటాక్‌లు,

డయాబెటిస్‌ రావచ్చు. బరువుతో పాటు శరీర ఆకారమూ పెరిగిపోవడానికి తగిన

వాతావరణం, వస్తువులు నేడు మన చుట్టూ వున్నాయి. శారీరక కష్టం చేయకుండా

తోడ్పడేందుకు ఇంట్లో వాడే పరికరాలు, యంత్రాలు వచ్చాయి. మనం వాటి మీద

ఆధారపడి బతకడమే కాకుండా రోజువారిగా చేయాల్సిన ఎక్సర్‌సైజ్‌ని తగ్గించేశాం.

నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ వాకింగ్‌ చేసే వారికి తగిన ట్రాక్‌లను, పబ్లిక్‌ పార్కులను,

ఏర్పాటు చేయడం సైకిల్‌ మీద తిరిగేందుకు ప్రోత్సహించడం. స్థానిక క్రీడలను

ప్రోత్సహించడం. ఆరోగ్యకర అలవాట్లను మీడియా ద్వారా సమాచార శాఖ ప్రచారం

చేయాలి. ఇకపోతే శారీరక శ్రమకోసం నగరవాసులు, లిఫ్ట్‌ బదులు మెట్లు ఎక్కడం

కదలకుండా కూర్చుని టీ.వీ చూసే బదులు ఆ సమయంలో ఎక్సర్‌సైజ్‌ బైక్‌నో,

ట్రెడ్‌మిల్‌నో ఉపయోగించాలి.

వీటిని తినడం తగ్గించాలి

గులాబ్‌జామ్‌: ఇది నోటికి తీయగా వుండొచ్చుగానీ ఆరోగ్యపరంగా చేదే. నెయ్యిలో

వేయించి, పంచదార పాకంలో నానబెట్టే గులాబ్‌జామ్‌ ఒక్కటి తింటేచాలు. శరీరానికి

320 క్యాలరీలు ఇస్తుంది.

సమోసాలు: సమోసను బంగాళాదుంపతో చేస్తారు. ఒక్కో సమోసాలో 400 క్యాలరీలు

వుంటాయి. ఒక సమోస తింటే చాలు కానీ మనం ఒక సమోసతో ఆపుతామా?

బర్గర్లు: మైదాతో చేసే బన్‌ అనారోగ్యకరమైనది. దానికి తోడు నూనెలో వేయించిన

పదార్థాలు, మాంసం ముక్కలు దట్టిస్తారు. వాటితో బర్గర్‌ని తిన్నవారి ఒంట్లో 500

క్యాలరీలు తిష్ట వేస్తాయి.

ఫింగర్‌ చిప్స్‌: వీటిలో పోషక పదార్థాలు తక్కువ వీటిలో వుండే కొవ్వు పదార్ధాలు

ధమనులకు హానిచేస్తాయి. వీటిని తినకపోవడం ఆరోగ్యానికి మేలు.

చోలేభతూరె: మళ్లీ మళ్లీ వాడే వనస్పతిలో ఎక్కువగా వేయించే, ఆహారపదార్థాన్ని

అసలు తినకపోవడమే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *