Hand bag selection tips
హ్యాండ్ బ్యాగులు ఎంచుకోవడమూ ఓ కళే!
నలుగురిలో వహ్వా అనిపించాలంటే… సందర్భాన్ని బట్టి దుస్తులే కాదు, హ్యాండు బ్యాగుల్నీ ఎంచుకోవడం కూడా తప్పనిసరి. అందుకే అవిప్పుడు ఫ్యాషన్ యాక్సెసరీల్లో ప్రత్యేక స్థానం పొందుతాయి. ఈ తరం వనితల అభిరుచి, ఆసక్తికి తగినట్లుగా పలు డిజైన్లలో లభిస్తున్నాయి.
అయితే వాటిని ఎంచుకునే ముందు కేవలం ఫ్యాషన్ మాత్రమే కాకుండా సౌకర్యం, రంగు, శరీరాకృతికి తగినట్లుగా ట్రెండీగా ఉండేలా పరిగణించాలని సూచిస్తున్నారు డిజైనర్లు.
విధులకు వెళ్లేవారు కాస్త పెద్దగా ఉండే లెదర్ రకాల్ని నలుపు, గోధుమ రంగుల్లో ఎంచుకుంటే.. అవసరమైన వస్తువున్నింటినీ వేసుకెళ్లవచ్చు. కాస్త ఎత్తు తక్కువుగా, లావు కనిపించేవారు సన్నని రకాల్నిప్రయత్నించాలి. అదే సన్నగా, పొడుగ్గా ఉన్నవారు.. గుండ్రని, ఆకృతి పెద్దగా ఉండే బ్యాగుల్ని వెంట తీసుకెళ్తే చూడముచ్చటగా కనిపిస్తారు.
పార్టీలకు టోటెల్లాంటివి బాగుంటే… పెళ్ళిళ్లు వంటి సందర్భాలకు బ్రొకేడు క్లచ్ సరైన ఎంపిక అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఉదయం వేళ పార్టీల్లాంటి వాటికి పెద్ద పెద్ద బ్యాగులు సరైన ఎంపికవుతాయి. సాయంత్రాలైతే మాత్రం.. క్లచ్కు మించిన సొగసు లేదు. అవికూడా ఇప్పుడు పలు డిజైన్లలో లభిస్తూ… ప్రముఖుల స్థాయి నుంచి సామాన్య మహిళల దాకా అందరి మనసూ దోస్తున్నాయి. దుస్తులకు తగిన రంగుల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి.