Government aid to girl child families

తగ్గుతున్న ఒకే ఆడబిడ్డ కుటుంబాల సంఖ్య

Government aid to girl child families

 

ఒకప్పుడు కొడుకు పుట్టేవరకు తిట్టుకుంటూనైనా ఆడపిల్లలను కనేవారు. కాని,

సాంకేతికత పరిజ్ఞానంతో పుట్టేది ఆడపిల్లయితే అబార్షన్‌ చేయించేసుకుంటున్నారు.

దక్షిణాది రాష్ట్రాలలో ఆడపిల్లలపై చూపే వివక్ష చాలా ఎక్కువ. ఫలితంగా అక్కడ

ఆడపిల్లలు పూర్తిగా తగ్గిపోయి పెళ్లికూతురు దొరక్క మగవారు అవివాహితులుగానే

మిగిలిపోతున్నారు. ఒక్క కూతురుని మాత్రమే( కొడుకులు లేకుండా)కన్న

తల్లిదండ్రులకు ప్రభుత్వం వారి కూతురి భవిష్యత్తు కోసం ప్రత్యేక సౌకర్యాలు

కల్పిస్తోంది. అయినా సరే ఒక్క ఆడపిల్ల మాత్రమే కలిగిన కుటుంబాల సంఖ్య మరీ

తగ్గిపోతోందని ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక విడుదల చేసింది. నివేదికతో పాటు

ఒక్కతే ఆడపిల్ల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలేమిటో చూద్దాం.

ఐక్యరాజ్యసమితి నివేదిక సారాంశం

మనదేశంలో ఆడపిల్లల పుట్టుక రేటు తగ్గుతున్నమాట వాస్తవం. ఈ పరిస్థితి హర్యాణా,

పంజాబ్‌, రాజస్తాన్‌లలో మరింత ఎక్కువగా ఉంది.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కతే ఆడపిల్ల ఉన్న కుటుంబాలు దాదాపు పూర్తిగా

మాయమవుతున్నాయి. మహిళల అభివృద్ధిపై అధ్యయనం చేసి ‘లింగ నిష్పత్తి,

పుట్టబోయే పిల్లల లింగనిర్ధారణ, చారిత్రక చర్చలు, భవిష్య మార్గదర్శకాలు’ అనే

పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక సమర్పించింది. ప్రస్తుతం జరిగిన

అధ్యయనాలను ఉటంకిస్తూ, ప్రస్తుతం మాయమైపోతున్న ఒక్కతే ఆడపిల్ల ఉన్న

కుటుంబాల మీద దృష్టి పెట్టవలసి ఉందని నివేదిక చెబుతోంది. పంజాబ్‌,

హర్యాణాలలో కేవలం ఆడపిల్ల ఒక్కతే ఉన్న తల్లిదండ్రులు కేవలం రెండు శాతం

మాత్రమే ఉన్నారని, భారతదేశంలో నార్త్‌వెస్ట్‌ ప్రాంతంలో లింగ పక్షపాతం చాలా

ఎక్కువగా ఉందన్న విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తుంది. మొత్తం మీద ప్రజలు

ఎక్కువమంది కొడుకుల్ని కనడం లేదు. అంటే దాని అర్థం కొడుకు ప్రాముఖ్యత

తగ్గిందని అర్థం కాదు. వారి ప్రకారం, ఒక కొడుకు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఒక

కూతురు కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని

ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతోంది.

ఒక్కతే ఆడపిల్ల ఉన్న కుటుంబాలలోని ఆడపిల్లలకు ప్రభుత్వం ప్రకటించిన విద్యా

అలవెన్స్‌లు

సీ బీ ఎస్‌ సీ, ఇంకా యు జీ సీ సంస్థలలో కొత్తగా స్కాలర్‌షిప్‌లు

ఈ ఏడాది నుంచి దేశంలో ఆడపిల్లలు చదువుకోవడానికి అవకాశాలు

కల్పిస్తోంది.ఇంట్లో కేవలం ఒక్కతే కూతురుగా ఉన్న ఆడపిల్లకు ఆరవ తరగతి నుంచి

పన్నెండవ తరగతి వరకు విద్య ఉచితంగా అందిస్తుంది.

చదువులో నైపుణ్యం చూపే ఆడపిల్లలకు మద్దతు, గుర్తింపు ఇవ్వడానికి, ఆడపిల్లల

విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇంకా అదనంగా సీ బీ ఎస్‌ ఈ, యు జీ

సీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెట్టాలని కోరింది.

సీ బీ ఎస్‌ ఈ లో చదువుకుంటున్న, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అయిన

ఆడపిల్లకు పూర్తిగా ఎటువంటి రుసుము లేకుండా ఆరవ తరగతి నుంచి పన్నెండవ

తరగతి వరకు అలానే ఇద్దరూ ఆడపిల్లలే అయితే వారికి ఫీజులో 50 శాతం రాయితీ

కల్పిస్తోంది.సీ బీ ఎస్‌ ఈ మొత్తం 550 మందికి పన్నెండవ తరగతి పరీక్షల్లో చూపిన

ప్రతిభ ఆధారంగా నెలకి 500 రూపాయలు చొప్పున వైద్య, ఇంజనీరింగ్‌ విద్య తప్ప

మిగిలిన డిగ్రీలు చదివేవారికి అందచేస్తుంది.

యు జీ సీ, ఒక్కతే ఆడపిల్ల ఉన్నవారికి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని

ఆరంభించింది. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న

ఆడపిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తారు. బి.ఎ, బి.కామ్‌, బీ ఎస్సీ లలో మొదటి అన్ని

గుర్తింపు పొందిన, డీమ్డ్‌ యూనివర్శిటీల నుంచి ర్యాంకు సాధించిన తల్లిదండ్రులకు

ఒక్కతే ఆడపిల్లకు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ రెండేళ్లపాటు నెలకి 2000 రూపాయలు

స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. యు జీ సీ కూడా వారి అన్ని అనుబంధ కార్యక్రమాలు

మరియు కోర్సు లకు ఇదే విధంగా సౌకర్యాలు కల్పించనుంది. ఇతర పరీక్షా బోర్డులు,

అనుబంధ విద్యా సంస్థలు కూడా ఒక్కతే ఆడపిల్లకు ప్రాముఖ్యత కల్పించేలా

ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ద న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ద్వారా బీమా సౌకర్యాలు

భాగ్యశ్రీ పిల్లల సంక్షేమ పథకం

ఈ పథకం ఒక్కతే కూతురుగా ఉన్న కుటుంబంలోని 0 నుంచి 18 ఏళ్ల లోపు

ఆడపిల్లలలు ఎవరైతే తల్లిని కాని, తండ్రిని కాని ప్రమాదంలో పోగొట్టుకుంటారో ఆ

ఆడపిల్లలకు బీమా కవరేజ్‌ ఇస్తుంది. 24 గంటలలోగా రిస్క్‌ బేసిస్‌ మీద ఈ బీమా

సౌకర్యం దొరుకుతుంది. కంపెనీ ఆ అమ్మాయి పేరు మీద 25000 రూపాయలు

డిపాజిట్‌ చేస్తుంది.

ఆశాకిరణ్‌

ఈ ఏడాది మార్చిలో ఆడపిల్ల మాత్రమే ఉన్న కుటుంబాల వారికి ‘న్యూ ఇండియా

ఆశాకిరణ్‌’ పేరుతో ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం మొదలు పెట్టింది. ఈ పథకం

ఆడపిల్లల కోసం చేసే బీమాకు 50 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తుంది. బీమా కంపెనీ

అంచనా ప్రకారం, 20 నుంచి 30 శాతం వరకు కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్న

కుటుంబాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *