For a long life of costly traditional silk saree

For a long life of costly traditional silk saree
Tips for the care of pattu cheera / Silk Sari
‘పట్టుచీర భద్రానికి సూత్రాలు’
పెళ్ళిళ్లకు శుభకార్యాలకు ఎక్కువగా స్త్రీలు ఉపయోగించేది ‘పట్టుచీర’ ఈ పట్టుచీరలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి.

కొంతమంది వీటిని ఎలా ఉతకాలో..ఎలా భద్రంగా ఉంచుకోవాలో అర్థం కాదు. మీ కోసం అవి

1. పట్టీలు వేసుకునే అలవాటున్న వారు చీరలకు ఫాల్స్‌ కుట్టించుకోండి. దీనివల్ల చీర కాళ్ళ పట్టీలకు పట్టకుండా ఉంటాయి.

2.కట్టుకున్న చీరను గాలి తగిలేలా ఫోల్డ్‌ చేసుకోవాలి.

3. మరకలు అంటిన చోట వెంటనే తడిబట్టతో తుడవాలి. మొండి మరకలను నిమ్మరసంలో కొంచెం వాటర్‌ లిపి రుద్దాలి.

4. ప్లాస్టిక్‌ కవర్‌లో కాకుండా పలచటి టవల్స్‌ లాంటి బట్టలో గాని పెట్టి భధ్రపరచుకోవాలి.

5. చీరలు భద్రపరిచే ప్లేస్‌లో పేపర్‌ తప్పకుండా వేయాలి. నాలుగు పక్కల ‘లవంగ ముక్కలు’ లేదా శుభ్రపరిచిన ‘వేప ఆకులు’ వేయండి.

pattu saree 26. పట్టు చీరలను నెలకు కొకసారి మడతలు మార్చి నీడలో గాని గాలి తగిలేలా ఉంచాలి.

7. పట్టు చీరను మొదటిసారిగా ఉతికిటేప్పుడు వాటర్‌లో కొంచెం సాల్ట్‌ వేసి చీరను నానబెట్టండి. తర్వాత చల్లని నీటితో బాగా రుద్దాలి.

8. డిటర్జెంట్‌ సోప్‌ వాడకుండా కుంకుడుకాయలతో ఉన్న రసంతో వాష్‌ చేసుకోవాలి.(పల్చటి రసం)

9. ఫాల్స్‌ దగ్గర, జరీ మీద బ్రష్‌ అసలు ఉపయోగించకూడదు. చీర కొంగు, చీరను విడిగా ఉతకాలి.

10. తడి చీరను నీడలో ఆరబెట్టాలి. చీరను, కొంగును, బార్డర్‌ను స్ట్రేట్‌ చేస్తే ఇస్త్రీ చేసుకోవడం సులువు అవుతుంది.

11. పట్టు చీరను ఇస్త్రీ చేసేటప్పుడు మీడియం వేడి మీద చేయాలి. చీరను తిప్పి చేసుకుంటే ఇంకా మంచిది. కాస్త చల్లారిన తరువాతనే చీరను ఫోల్డ్‌ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *