బొట్టు
Women sticker
Enhance beauty with women sticker
బొట్టు..మహిళలు నుదుట పెట్టుకునే ‘బొట్టు’ ద్వారా ప్రత్యేక అందం చేకూరుతుందని
ఫ్యాషన్ నిపుణులు చెబుతుంటారు. మరి ఈ బొట్ల ఎంపికపై కొన్ని విషయాలు మీ
కోసం..
వెడల్పు నుదురునున్న స్త్రీలు పెద్దబొట్లు,
చిన్న నుదురున్న వారు చిన్న బొట్టు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. అలాగే
నుదురు పెద్దగా ఉన్నవారు బొట్టును కనుబొమ్మల మధ్య కాకుండా కొంచెం పైకి
పెట్టుకొని చూడండి. అలాగే పెద్ద బొట్టు పెట్టుకుంటే నుదురు పెద్దగా ఉన్న విషయం
తెలియదు. ఛామనచాయ లేదా అంతకన్న కాస్త రంగు ఉంటే పింక్, ఆరేంజ్,
గంధపురంగు, ఎరుపు రంగు బొట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. తెల్లని శరీరం ఉండే
వారికి ముదురు రంగు బొట్టు బాగుంటుంది. కరెక్టుగా మ్యాచింగ్ చీర, జాకెట్ ధరిస్తే
మ్యాచింగ్ స్టిక్కర్స్‌ను ఎంచుకోవాలి. దీనివల్ల మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. జీన్స్,
మాక్సీ, ఇతర డిజైన్ దుస్తులను ధరించినప్పుడు కొంతమంది బొట్టు పెట్టుకోరు. ఇది
కూడా ఫ్యాషన్‌లో భాగమే.
లిప్‌స్టిక్ పెట్టుకునే అలవాటున్న వారికి
లిప్‌స్టిక్ ఒకటే కలర్, బొట్టు ఒకటే కలర్ ఉంటే చూడటానికి బాగుండదు. ఉదయం,
సాయంత్రం మాములు బొట్లు ధరించినా మద్యాహ్నం మాత్రం మెరుపు బొట్లను
ధరించండి. ఇక రాత్రి పడుకునే ముందు మాత్రం ముఖం మంచిగా కడుక్కొని చిన్న
బొట్టు పెట్టుకుంటే సరి. ప్రతిసారి కొత్త బొట్టునే ఉపయోగించండి. ఒకే బొట్టును
ఎక్కువసార్లు ఉపయోగించకండి. మీరు బొట్టు పెట్టుకుని తీసిన తరువాత ఆ స్థానంలో
పాలు, మీగడతో కొద్దిగా తుడవండి. దీనివల్ల బొట్టు పెట్టుకునే ప్రదేశంలో మరలు పడే
అవకాశం లేదు