Dress selection tips

ఏ డ్రెస్‌లు బాగుంటాయి

మీ శరీరానికి ఏ డ్రెస్‌లు బాగుంటాయి అంటే ఏమో అని సమాధానం వస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఏ డ్రెస్‌ వేసుకోవాలో..ఎప్పుడు వేసుకోవాలో అర్థం కాదు..మార్కెట్లో దొరికేవి సెలక్ట్‌ చేసుకుని వేసుకుంటారు. అవి మనకు నప్పలేదంటే వాటిని మూలకు పడేస్తారు. ఇలా ఎందుకు మనకు ఏం కరెక్టుగా సెట్‌ అవుతాయో వాటిని సెలెక్ట్‌ చేసుకుని ధరిస్తే నలుగురు మెచ్చుకుంటారు.

కళ్ళు చెదిరే రంగుల్లో..డిజైన్లు..ఆకర్షణీయంగా ‘చీరలు’ మార్కెట్లో లభ్యమైతున్నాయి. చీరలు అందరూ ధరించాలని అనుకుంటారు. కానీ కొంతమందికి ఇవి సూట్‌ కావు. వారి వారి శరీరాకృతిని బట్టి, ఛాయకి సరిపడా రంగుల చీరలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి వర్క్‌ చీరలన్నా ఇష్టం. కొంతమందికి డిజైన్‌ ఉన్న చీరలంటే ఇష్టం. వాళ్ళ అభిరుచిని బట్టి సెలక్ట్‌ చేసుకోవాలి. కాస్తంత శ్రద్ధ, ఓపిక, ఆసక్తి ఉంటే చాలు చీరలను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. కొంచెం డబ్బు ఉంటే చాలు సరికొత్త మోడల్స్‌ ఎన్నో మార్కెట్లో లభ్యమౌతున్నాయి. సో చీరలు సెలెక్ట్‌ చేసుకునేటప్పుడు ఎత్తు, రంగు, శరీరాకృతిని మదిలో పెట్టుకుని సెలెక్ట్‌ చేసుకోండి..

కొంచెం ఎత్తు ఉండి..పొడుగా..తెల్లగా ఉండి..మరి లావుగా కాకుండా..మరి సన్నగా కాకుండా ఉన్న వారికి మోడరన్‌ డ్రెస్‌లతో పాటు, భారతీయ సాంప్రదాయ దుస్తులు బాగా నప్పుతాయి. లంగ్‌ ట్యూనిక్స్‌, పొడుగాటి ట్రౌజర్స్‌ వీరికి బాగుంటాయి. ముఖ్యమైన సందర్భాలలో సల్వార్‌ కుర్తీలు, చీరలు ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు.

పాతిక సంవత్సరాలలోపు ఉన్న వారు.. సన్నగా ఉండి.. ఎత్తు తక్కువ ఉన్న వారు మాత్రం స్కర్ట్స్‌, ట్రౌజర్స్‌, డ్రెస్సులు, ఇండియన్‌ డ్రెస్‌లు ఎవైనా సరే బాగుంటాయి. ధరించే షూస్‌ పట్ల కూడా కొద్దిగా సెలెక్ట్‌ ఛేంజ్‌ చేయాల్సి ఉంటుంది. హెయిర్‌ స్టైల్‌, వాకింగ్‌ స్టయిల్‌లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే నలుగురు మెచ్చుకుంటారు.

తేలికపాటివి కొనకండి..అలాగే చౌకగా ఉన్నవి కదా వాటిని సెలెక్ట్‌ చేసుకుంటే తొందరగా పాడై పోకుండడమే కాకుండా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి.
ముదురు గోధుమ రంగు, మూడు నాలుగు నుండి రకపు జీన్స్‌, ట్రౌజర్స్‌ ఎప్పటికి స్టాక్‌ పెట్టుకోండి.
ట్రెండ్‌కు తగిన డిజన్స్‌ని ఎంపిక చేసుకోండి.
బంగారు రంగులో ఉండేవి ఎప్పటికి ఫ్యాషనబుల్‌. ఇవి సెలెక్ట్‌ చేసుకుంటే ఎక్కడైనా వేసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఏ స్టయిల్‌ బట్టలు దొరుకుతున్నాయో తెలుసుకుని అవి మనకు నప్పుతాయో లేదో చూసుకుని సెలక్ట్‌ చేసుకొండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *