సిజేరియన్ చేయించు కుంటున్నారా ? ఆగండి..
Disadvantages of cesarean operation
పెద్దాపరేషన్ వల్ల ముప్పు
మహిళలు గర్భం దాల్చిన సమయంలో ఎంతో
కష్టపడుతుంటారు. డెలివరీ సమయంలో ఈ బాధ మరింత రెట్టింపు అవుతుంది.
సహజ ప్రసవం కానప్పుడు వైద్యులు వారికి ‘సిజేరియన్’ ఆపరేషన్ చేస్తుంటారు.
సిజేరియన్ అంటే పెద్దాపరేషన్ అని అంటారు. ప్రస్తుతం ఈ వైద్యమే ఎక్కువగా
చేస్తున్నారు. సిజేరియన్ చాలా సురక్షితమని కొంతమంది మహిళలు
అనుకుంటుంటారు. కానీ ఇది తప్పు..తెలుసా ఈ పెద్దాఆపరేషన్ వల్ల ఎన్నో సమస్యలు
వస్తాయని పరిశోధనలో తేలింది. లండన్ ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు చేసిన
అధ్యయనంలో ఇంకా ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకుందామా ?
సిజేరియన్ చేయించుకున్న తల్లులకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందంట. ముఖ్యంగా
స్థూలకాయం లేదా మధుమేహం ఉన్న మహిళల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని వారి
అధ్యయనంలో తేలింది. ప్రతి పది మంది తల్లుల్లో ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తోందని
పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల వారి వారి పిల్లలను సరిగ్గా చూసుకోలేక
పోతున్నారని, వత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఆపరేషన్ వల్ల కలిగే గాయం వల్ల
ఇన్ఫెక్షన్ సర్వసాధారణంగా మారిందని, దీనివల్ల వారు ఆస్పత్రిలో వైద్యం కోసం
ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తోందని తెలిపారు. సహజ ప్రసవం కానప్పుడూ, తల్లి,
గర్భంలో ఉన్న బిడ్డకు ముప్పు ఉన్నప్పుడే సిజేరియన్‌కు మొగ్గు చూపాలని
సూచిస్తున్నారు. సో..తల్లులారా చూశారా ఒక్కసారి ఆలోచించండి..