Colourful Kurtas

Colourful Kurtas కలర్‌ఫుల్‌ కుర్తాలు

‘కుర్తాలు’ అంటే మగవారికే మాత్రమే వేసుకునే వారు. కానీ మారుతున్న ఫ్యాషన్‌లో ఆడవారికి కూడ ‘కుర్తా’లు మార్కెట్లో వచ్చేసాయి. ఇవి పొడుగుగా, పొట్టిగా ఉండే కుర్తాలు మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్లేన్‌గా, పూల పూల రకాలతో, రంగు రంగుల్లో దొరుకుతున్నాయి. మరికొన్ని స్లీవ్‌లెస్‌గా కనబడుతాయి. జీన్స్‌పై కాని టైట్‌గా ఉండే పైజామా మీద వీటిని ధరిస్తున్నారు. కుర్తాల గురించి మీకోసం…

కుర్తాలు అంటే వదులుగా ఉండేదని అర్థం. ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా ఇవి నప్పుతాయి. శరీరాకృతికి తగ్గట్టుగా ఉండే కుర్తాలను కుట్టించుకుంటే ఇంకా బెటర్‌. కాటన్‌, లినెన్‌, రెయన్‌ బ్లెండ్స్‌ ఇలా వివిధ రకాలైన మెటీరియల్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి.

ఎలాంటి ఫిట్‌ : శరీరాకృతి ఎలా ఉన్నా వారికి ఈ కుర్తాలు కరెక్టుగా సరిపోతాయి. సన్నని నడుము ఉన్నవారు కుర్తా నడుము భాగం వద్ద బిగుతుగా ఉండేలా కుట్టించుకోవాల్సి ఉంటుంది. నడుం బాగా లావుగా, కొంచెం భారీ శరీరం ఉన్నవారు పై నుండి క్రింది వరకు ఒకే విధంగా కుట్టించుకుంటే అందంగా కనబడుతారు. పొట్టిగా ఉండే వాళ్ళు మాత్రం మందంగా ఉన్న బట్ట తీసుకుని కుర్తాను కుట్టించుకోవాలి. సన్నగా ఉన్నవారు మాత్రం మీడియం రకం బట్ట తీసుకుని కుట్టించుకుంటే బాగుంటుంది.

kurta 5

పొడవు ఎంత ఉండాలి ?

అందరి శరీరాలు ఒకేలా ఉండవు. అలాగే ఎత్తు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. అందుకని కుర్తాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పొట్టిగా ఉండేవారు మోకాళ్ళ వరకు కుర్తా కుట్టించుకుని చూడండి. ఈ కుర్తాలు నిలువు చారలున్న కుర్తాలు ధరిస్తే పొడవుగా కనిపిస్తారు. ఒక్కసారి ఇలా కుట్టించుకుని ట్రై చేసి చూడండి. తేడా మీ స్నేహితులే చెబుతారు.

పొడవుగా ఉన్న వారు మాత్రం నడుం క్రిందదాక ఉన్న కుర్తీలను ఉపయోగిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరికాస్త పొడుగుగా ఉన్న వారు మాత్రం అడ్డగీతలున్న కుర్తాలను ఉపయోగించండి. ముదురు రంగు కుర్తాలను వేసుకుంటే బాటమ్‌ మాత్రం లేత రంగులలో ఉండేలా చూసుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. ట్రే చేయండి…ఔ

స్లీవ్‌లెస్‌ కుర్తాలు :

kurta 7

కుర్తాలు మార్కెట్‌లోకి రావడం మంచి డిమాండ్‌ ఉండడంతో వీటినే స్లీవ్‌లెస్‌ కుర్తాలను కూడా మార్కెట్‌లో పెట్టారు. వీటికి కూడా మంచి డిమాండ్‌ ఉంది. కానీ కొంతమందికి ఇవి సూట్‌ కావు. వీటిని ధరించే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.

లావుగా ఉన్న వారు స్లీవ్స్‌ కుర్తాలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మోచేతి వరకు లేదా 3/4 లెంగ్త్‌తో ఉన్న కుర్తాలు లేదా ఫుల్‌ స్లీవ్స్‌తో ఉన్న కుర్తాలను సెలక్ట్‌ చేసుకోండి. కానీ ఇవి బిగుతుగా ఉంటే సన్నగా కనిపిస్తారు.

ఇక సన్నగా ఉండే అమ్మాయిలకు బెల్‌, పఫ్స్‌, బట్టర్‌ ఫ్లై, కప్స్‌ వంటి స్లీవ్స్‌ ధరించవచ్చు. సన్నగా ఉండి పొట్టిగా ఉన్నవారు 3/4 వాటిని సెలక్ట్‌ చేసుకోవడం బెటర్‌.

నెక్‌లైన్‌

kurta 8

కుర్తాలలో నెక్‌లైన్‌ వెరైటీస్‌ కూడా వస్తున్నాయి. మెడ, భుజాలు, ఛాతి, ముఖం ఆధారంగా వీటిని సెలక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. భుజాలు చిన్నవిగా ఉన్నవారు సాధారణ నెక్‌లైన్స్‌కు భిన్నంగా ఉండేవి వేసుకుంటే బాగుంటుంది. పొడవు మెడ, కోల మోహం ఉన్నవారు మాత్రం క్రూ నెక్‌లైన్‌ సెలక్ట్‌ చేసుకోండి. దీనివల్ల మీ శరీరాకృతి బ్యాలన్స్‌ చేయవచ్చు.

వర్క్‌ :

kurta 9

ఈ కుర్తాలకు వర్క్‌ కూడా ఉపయోగిస్తున్నారు. ఎంబ్రాయిడరీ, గోటా, బ్రొకేడ్‌, పల్లు, నిట్టెడ్‌ ఇలాంటి ఎన్నో రకాల కుర్తాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సాంప్రదాయంగా కనిపించాలంటే మాత్రం జరీ, జర్దోసి, బ్రొకెడ్‌ వర్క్స్‌, గోటా ఉన్న కుర్తాలను ధరిస్తే మాత్రం సింపుల్‌గా అందంగా కనిపిస్తారు. ఇంకాస్త లుక్‌ రావాలంటే మాత్రం జర్దోసి, పల్లు, నక్షి వర్క్‌ ఉన్న కుర్తాలను ఉపయోగించండి.

కలర్స్‌

కలర్స్‌ విషయానికొస్తే మాత్రం మార్కెట్లో ఎన్నో రంగుల కుర్తాలు దొరుకుతున్నాయి. మార్కెట్లోకి వీటిని ఖరీదు చేసేముందు మనకు కరెక్టుగా సూట్‌ అవుతాయో లేదో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనుక్కొండి. లావుగా ఉన్న వారు సింగిల్‌ కలర్‌ ఉన్న టోన్‌ కుర్తాలను ధరిస్తే సన్నగా కనిపిస్తారు. ఇలా మీ ఇష్టం ఉన్నవాటిని ధరించండి. కానీ మరి ఎబ్బెట్టుగా ఉన్నట్టు కాకుండా సింపుల్‌గా అందంగా ఉండే వాటిని సెలక్ట్‌ చేసుకుని ధరించండి. మీరు ఏ డ్రెస్‌ ధరించినా ఒకరు మీకు కాంప్లిమెంట్‌ ఇచ్చేవిధంగా డ్రెస్‌ వేసుకోండి. కుర్తాలను ధరించే ముందు ఒకసారి పై సూచనలు పాటించండి..తేడా గమనించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *