Bheem Rao Ambedkar biography in Telugu

 

భీమ్ రావ్ అంబేద్కర్ జీవిత చరిత్ర

అంబేద్కర్ గురించి పూర్తి వివరాలు

బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు…

(దయచేసి చదవండి – తరువాత తరాలకు తెలియజేయండి)

✿✿ జీవన చిత్రం ✿✿

☞ తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.

☞ జననం:- 14 ఏప్రిల్ 1891

☞ ప్రాంతం :- మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)

☞ వివాహం:-
రమాబాయి అంబేద్కర్ 1906 లో వివాహం జరిగింది, ఆయనకు ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు,చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో రమాబాయి చనిపోయారు.

సవిత అంబేద్కర్ :-
అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యాన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..

☞ డా. బి. ఆర్. అంబెడ్కర్ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు,నిద్రలేమి,మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు.

తన ఆఖరి పుస్తకం “Buddha and his Dhamma” పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసెంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు.

☞✿ బాబాసాహెబ్ చదువులు – ప్రత్యేకతలు:- ✿☜

✍ మెట్రికులేషన్ -1908
✍ B.A – (Politics and Economics) Bombay University in 1912 – అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
✍ M.A – (Economics – For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
✍ Ph.d – (Economics – For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. – ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
✍ D.Sc – (Thesis – ‘Problem of the Rupee – Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. – ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
✍ Bar-At-Law – Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
✍ Political Economics – Germany.
✍ LLD – (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.
✍ D.Litt – (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.
✍ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు,ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.

✿✿ తొమ్మిది భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావీణ్యత కలిగి ఉన్నారు ✿✿

– మరాఠీ
– హిందీ
– ఇంగ్లీషు
– గుజరాతీ
పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )
– సంస్కృతం
– జర్మన్
– పార్శీ
– ఫ్రెంచ్

✿✿ బాబాసాహెబ్ ఉద్యమ జీవితం ✿✿

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు:-

1. బహిషృిత హితకారిణి సభ :- జులై 20, 1924
2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-

1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)– ఆగస్టు 16, 1936
2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)– జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)
3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) – అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన విద్యసంస్థలు:

1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ — జూన్ 14, 1928
2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ — జూలై 08, 1945
3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై — జూన్ 20, 1946
4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ — జూన్ 01, 1950

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ:

1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా — మే 4, 1955

✿✿ బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు ✿✿

– మహద్ చెరువు ఉద్యమం – 20/3/1927
– మొహాళీ (ఘులేల)తిరుగుబాటు – 12/2/1939
– అంబాదేవీ మందిరం ఆందోళన – 26/7/1927
– పూణే కౌన్సిల్ ఉద్యమం – 4/6/1946
– పర్వతీ ఆలయ ఉద్యమం – 22/9/1929
– నాగపూర్ ఆందోళన – 3/9/1946
– కాలారామ్ ఆలయ ఆందోళన – 2/3/1930
– లక్నౌ ఉద్యమం – 2/3/1947
– ముఖేడ్ ఉద్యమం – 23/9/1931

✿✿ బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు ✿✿

*మూక్ నాయక్ – జనవరి 31, 1920
*బహిషృత భారత్ – ఏప్రిల్ 3, 1927
* సమత – జూన్ 29, 1928
*జనత – నవంబరు 24, 1930
*ప్రభుద్ధ భారత్ – ఫిబ్రవరి 4, 1956

✿✿ బాబాసాహెబ్ ప్రత్యేకతలు దక్కిన గౌరవాలు✿✿

☞- బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు,ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే.
☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కడు బాబాసాహెబ్.
☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్.
☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు.
☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.
☞- తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.

❤ అరుదైన గౌరవాలు

☞- భారత రత్న – ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం.

☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం – ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు.

☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత.

☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN.

*‍‍‌‍‌‍‌బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు

యావత్ ప్రపంచం బాబాసాహెబ్ ను నవభారత నిర్మాతగా,భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే,భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగా,ఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది.సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసి, హిందూ మత ఉద్ధారకునిగా ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది.ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర.

ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతే,మనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది.మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే,అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారమౌతం.

✿✿☆ వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి – గొప్పతనాలు – వాటి ఫలితాలు .. ☆✿✿

✿ బాబాసాహెబ్ – మహిళా హక్కులు ✿

☞✓ హిందూకోడ్ బిల్లు – మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం తన మంత్రి పదవినే వదిలేసారు.)
☞✓ పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు.
☞✓ మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave).
☞✓ పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు.
☞✓ స్త్రీ శిశు సంక్షేమ చట్టం – ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది.

✗✗✗ అయినప్పటికీ మనువాదంలో మునిగి తేలుతున్న స్త్రీ సమాజం ఏనాడూ బాబాసాహెబ్ పేరును కూడా తలుచుకోదు,మహిళా హక్కులంటూ గొంతు చించుకునే మహిళా సంఘాలు బాబాసాహెబ్ గురించి ఒక్క మాట కూడా తమ సంఘాల వారికి చెప్పరు ✗✗✗

✿ బాబాసాహెబ్ – కార్మికుల హక్కులు ✿

☞✓ 8 గంటల పనిదినాలు – 7వ Indian Labour Conference, నవంబరు 27, 1942 లో 14 నుండి 8 గంటలకు కుదించారు.
☞✓ ESI (Employee State Insurance) సౌకర్యం :- కార్మికుల ఆరోగ్య భద్రత కోసం (తూర్పు ఆసియాలోనే మొదటిది.
☞✓ ఇండియన్ ఫ్యాక్టరీల చట్టం :- పని ప్రదేశంలో నిర్ధిష్ట విధానాలు,జవాబుదారీతనం కోసం.
☞✓ కరువు భత్యం (Dearness Allowance)పెరిగిన నిత్యావసర ఖర్చులను భరించేందుకు వీలుగా.
☞✓ కనీస వేతనం ఉండే విధంగా చర్యలు.
☞✓ కేంద్ర కార్మిక సంఘాల (సవరణ) చట్టం :- 1926 చట్టం కేవలం కార్మిక సంఘాలను రిజిష్ట్రేషను చేయడం మాత్రమే చెప్పింది.8 నవంబరు 1943న సవరణ చట్టం తీసుకొచ్చి పూర్తి విధివిధానాలు రూపొందించారు బాబాసాహెబ్.
☞✓ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం.

✗✗✗ కానీ ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా ఎత్తకుండా కార్మికులను మాయలో ఉంచుతారు ఈ అగ్రకులాల నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్టులు.✗✗✗

✿ బాబాసాహెబ్ – రైతుల కోసం ✿

☞✓ నీటిపారుదల సౌకర్యాల పితామహుడు:- హిరాకుడ్ ప్రాజెక్టు,దామోదర్ నదీలోయ ప్రాజెక్టు, సోన్ నది లాంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్ దగ్గర నుండి పూర్తి చేసేదాకా బాబాసాహెబ్ కృషి ఉంది.భారతదేశ చరిత్రలో అనుకున్న ఖర్చు మరియు అనుకున్న సమయంలో పూర్తయిన నీటిపారుదల జలవిద్యుత్ ప్రాజెక్టులు ఇవే.
☞✓ మెరుగైన నీటిపారుదల కోసం Central Waterway and Irrigation Commission (CWIRC) ఏర్పాటు చేసారు.
☞✓ జలవనరుల నుండి విధ్యుత్తుత్పత్తిని క్రమబద్ధం చేయడం కోసం Central technical power board స్థాపించారు.
☞✓ ఇప్పటికీ సమస్యలు లేకుండా విజయవంతంగా నడుస్తూ దేశంలో విధ్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న “గ్రిడ్ వ్యవస్థ ” బాబాసాహెబ్ ఆలోచనే.

✗✗✗ మొక్షగుండం విశ్వేశ్వరయ్య, నెహ్రూ, పటేల్ ల వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయంటూ బాబాసాహెబ్ పేరు కూడా తలవవు ఈ ప్రభుత్వాలు.✗✗✗

✿ బాబాసాహెబ్-నిరుద్యోగం-స్వయం వికాసం ✿

☞✓ ఇప్పుడు నిరుద్యోగులకు అత్యంత సహాయకరంగా నిలుస్తున్న “ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజీలు” (Employement exchange) బాబాసాహెబ్ స్థాపించినవే.
☞✓ భారత దేశంలో సాంకేతిక విద్య అందుబాటులో లేని కారణంగా నిరుద్యోగులను యూనిట్ గా చేసుకుని ITI లాంటి సంస్థలు ఏర్పాటు చేసి అవసరం అయితే వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్.

✿ భారతదేశ ఆర్థిక ప్రగతికి బాబాసాహెబ్ కృషి ✿

☞✓ రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న భారతదేశాన్ని మళ్ళీ పునర్నించే ప్రయత్నంలో భాగంగా నియమించిన Reconstruction Commitee of Council లో బాబాసాహెబ్ సభ్యులుగా ఉన్నారు.నీటిపారుదల మరియు విధ్యుత్తుత్పత్తి ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేసారు.
☞✓ ఇప్పటిదాకా నివేదికలు సమర్పించిన 13 ఆర్థిక సంఘాల (Finance Commisions) నివేదికలు కూడా బాబాసాహెబ్ Phd thesis అయిన “The Evolution of Provincial Finance in British India” నుండి సేకరించినవే.
✍✓ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఘోరంగా దెబ్బ తీస్తున్న ఆర్థిక మాంద్యాలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేయలేక పోవడానికి ముఖ్య కారణం అయిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపన పూర్తిగా బాబాసాహెబ్ కృషి ఫలితమే.రిజర్వు బ్యాంకు స్థాపన కోసం ఏర్పాటు చేసిన హల్టన్ అండ్ యంగ్ కమీషన్ పూర్తిగా బాబాసాహెబ్ రాసిన “The Problem of the Rupee – it’s origin and it’s solution.” ని అనుసరించింది.

✗✗✗ మరి ఈనాడు చూస్తే కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ మరియు బ్యాంకుల్లో రవీంద్రనాద్ ఠాగోర్ ల ప్రవచనాలే కనిపిస్తాయి.నిజానికి వీరి ఇద్దరి సహకారం శూన్యం.

✿ బాబాసాహెబ్ – హేతువాదం – సామాజిక ఉద్యమాలు ✿

☞✓ భారతదేశం విజ్ఞానపరంగా ముందుకు వెళ్ళకుండా మూఢనమ్మకాలలో మగ్గుతూ ఉండడానికి ముఖ్యకారణం హిందూమతం అని నినదించి.ఈ రుగ్మతలు ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్న మనుధర్మాన్ని తగలబెట్టారు బాబాసాహెబ్.

☞✓ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఎదుర్కోవడానికి హేతువాదం మాత్రమే సరిపోదు, ఒక హేతువాద భావనలు గల మరో సంస్కృతి సృష్టించాల్సిందే అని చెప్పి నవయానాన్ని ప్రభోధించారు బాబాసాహెబ్.

కానీ ఈనాడు హేతువాదులం అని చెప్పుకునే ఏ అగ్రకులం వాడు బాబాసాహెబ్ పేరు తలవడానికి కూడ ఇష్టపడడు.

ఇలా మనువాద భావనలు నిండిన మన సమాజం బాబాసాహెబ్ ఈ దేశ వ్యవస్థకు అందించిన సహకారం పూర్తిగా విస్మరిస్తూ వస్తోంది.

*బాబాసాహెబ్ తన జీవిత కాలంలో నిర్వహించిన బాధ్యతలు.

ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త..

ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు..

ఒక విశిష్టమైన చరిత్రకారుడు..

ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక శాస్త్రవేత్త…

ఒక అద్భుతమైన రచయిత..

ఒక తిరుగులేని ఉద్యమకారుడు..

ప్రజలను కట్టిపడేయగల వక్త..

ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..

భారత రాజ్యాంగ నిర్మాత.

అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది.

స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం,
తపన పడ్డ సామాజిక విప్లవకారుడు.

భారత భూమిపై నడయాడిన ఒక “గ్రేటెస్ట్ ఇండియన్”

“జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉండాలి అని బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి.

పైన విషయాలు కొన్ని మాత్రమే, బాబాసాహెబ్ గురించీ మీరు కూడా మీకు తెలిసిన కొన్ని జోడించి, మన ఇంట్లో పిల్లలకు ఈ విషయాలు అవగాహన కల్పించండి. కుదిరితే మీ దగ్గర లోని SC,ST,BC హాస్టల్ లకు ఒక సాయంత్రం వెళ్ళి బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని మన తరువాతి తరాలకు వివరించండి.

✊ భారతదేశ సామాజిక ఉద్యమ పితామహుడు, ప్రపంచ మేధావి, నిజమైన ప్రజా నాయకుడు.

నేను హిందువుగా పుట్టినను అది నా చేతుల్లో లేదు, కానీ హిందువుగా మాత్రం చావను. Dr అంబేద్కర్….

Updated: April 21, 2020 — 2:48 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *