Best Ladies Jackets and jacket care
జాకెట్ గురించి
ప్రస్తుతం మార్కెట్లో జాకెట్లు చీరలతో పాటే వస్తున్నాయి. కానీ కొన్ని జాకెట్లు ఉంటే
ఇతర చీరలపై కూడా ధరించొచ్చు.
ఈ జాకెట్లు కూడా ఎక్కువ కాలం మన్నకుండా పాడైపోతుంటాయి. కరెక్టుగా
కుట్టించుకుంటే మీ జాకెట్‌కు సరైన లుక్, రూపం వస్తాయి. స్త్రీని అందంగా చూపే
దుస్తులు ఒక్కోసారి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. శరీరం సరిగ్గా, అందంగా,
సౌకర్యంగా ఉండాలంటే జాకెట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.
మీ దగ్గరున్న జాకెట్లను రెండు, మూడు సార్లు ఉతికేసరికి జాకెట్ కుట్లు ఊడిపోవడం,
హుక్కులు తెగిపోవడం జరుగుతుంటాయి. వీటిని ఏం చేస్తారు టైలర్కిస్తాం అంటారు.
కరెక్టె టైలర్కిచ్చేటప్పుడు దానికి కావాల్సిన హుక్స్, రీలు దారాన్ని మీరే కొనుక్కోండి.
టైలర్‌కు ఇచ్చి కుట్టివ్వమని అడగండి. కుట్టిచ్చిన తరువాత మీ రీలు, హుక్కులను
తీసుసేకోండి. దీనివల్ల రంగు రంగుల రీళ్ళు, కొన్ని హుక్స్ మీ దగ్గర ఉంటాయి. చీర
ఫాల్ కుట్టుకోవడానికి, దుస్తులు కుట్టుకోవడానికి వాడుకోవచ్చు.
Jacket washing care – How to wash jacket
జాకెట్ ఉతికే విధానం
జాకెట్లను ఎప్పుడూ వాషింగ్‌మెషిన్‌లో ఉతకొద్దు. ఉతికే సబ్బుతోనే ఉతికి నీడలో
ఆరేయండి. ఎండలో ఆరేయడం వల్ల రంగు వెలిసిపోతుంది. నీలి పౌడర్ కూడా జాకెట్ల
ఉతకవద్దు. లైనింగ్ బట్టలను కొద్ది గంటల పాలు నీళ్ళలో నానబెట్టాలి. ఎండ తగలని
ప్రాంతలో వీటిని ఆరేయాలి. తరువాతే కట్టడానికి ఇచ్చేయాలి. రాత్రి జాకెట్ వేసుకుని
నిద్రపోకుండా ఉంటేనే మంచింది. ప్రస్తుతం మార్కెట్లో ‘బ్యాక్‌లెస్’, ‘నెక్లెస్’, ‘హాఫ్
షోల్డర్’, ‘స్లీవ్‌లెస్’ జాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎది సౌకర్యవంతంగా
ఉంటుందో వాటినే ధరించండి.