Benefits of drumstick leaves and mehandi leaves
ఆషాడమాసం..గోరింటాకు..
ఆషాడమాసం..అంటే కొత్తగా పెళ్ళి చేసుకున్న వారికి కొంత ఇబ్బందే. ఎందుకంటే కొత్తగా పెళ్ళి చేసుకున్న వారి అత్తలను చూడవద్దని పాతకాలం నుండి వస్తోందని అందుకు పెళ్ళి కూతురును పుట్టింటికి తీసుకెళ్తుంటారు.
ఈ ఆషాడమాసంలో ‘బోనాలు’ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆషాడానికి ఇంకో ప్రత్యేకత ఉంది చెప్పగలరా అదేనండి ‘గోరింటాకు. ఈ మాసంలో మునగాకు తినడం ఆచారంగా వస్తోంది. శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు గోరింటాకు, మునగాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ వర్షాకాలం రోగాలకు అనుకూలమైనది. వాటిని నిరోధించడానకి గోరింటాకు, మునగాకు చాలా ఉపయోగపడుతాయని అందరూ పేర్కొంటుంటారు. గోరింటాకు పేరు వింటేనే మగువల మనస్సులు ఊహలలో తేలియాడుతుంటాయి. పండుగలకు మరియు శుభకార్యాలప్పుడు పెట్టుకునే ఈ గోరింటాకు ఆషాడమాసంలో ప్రతి మహిళ పెట్టుకుంటుంది. ఇటీవల గోరింట ఆకుల కన్నా కోన్ల ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది. మరి మునగాకు, గోరింటాకు వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దామా
మునగాకు
మునగాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కంటికి చాలా మేలు.
దగ్గుతో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ మునగాకు రసానికి ఒక టేబుల్ స్పూన్ తేనే తీసుకొండి
జలుబు పోవాలంటే రెండు చుక్కల మునగాకు రసాన్ని నాసికారంధ్రాల్లో వేసుకోండి.
మునగాకు రసానికి నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించండి. ముఖం కాంతివంతంతో వెలుగుతుంది.
కాలు బెణికిందా ? అయితే ఒక చుక్క ఆముదం వేసి వేడి చేసి కట్టుకడితే నొప్పి మాయం.
గోరింటాకు..
గోరింట చెట్టు బెరడును కాల్చి ఆ బూడిదతో పళ్ళు తోముకుంటే పళ్ళకు, చిగుళ్ళకు మేలు.
తెల్ల వెంట్రుకలు నల్లబడటానికి గోరింట చాలా ఉపయోగపడుతుంది.
కుదుళ్ళకు గట్టిదనం ఇవ్వడమే కాకుండా చుండ్రు నుండి కాపాడుతుంది.
గోరింట ఆకును రుబ్బి బిళ్ళలు బిళ్ళలుగా చేసి ఎండనిచ్చి వీటిని కొబ్బరినూనెలో వేసి రోజుకు తలకు మర్ధన చేస్తే దీర్ఘకాల తలనొప్పి తగ్గుతుంది.
అరికాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే శరీరంలోని వేడిని, అరికాళ్ళు మంటలను తగ్గిస్తుంది.
గోరింటాకు చేతికి పెట్టుకోవడం వల్ల క్రిములు దరిచేరవు.
ఇక్కడ కొన్ని డిజైన్స్ ఇస్తున్నాం..ట్రై చేయండి.