అందం..గంధం
Beauty tips with sandal wood
చందనంలో మేని సౌందర్యాన్ని సంరక్షించే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. దీనిని వాడడం
వల్ల చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆహారంలో తేడా, కాలుష్యం
తదితర కారణాల వల్ల చర్మం పాడై పోతుంటుంది.
ఇలాంటి వారు గంధం పొడిలో చెంచె పాలు, రెండు చుక్కల తేనే కలిపి దీనిని ముఖం,
మెడ, చేతులకు పట్టించాలి. ఆరిన తరువాత మృదువుగా మర్దన చేస్తూ చల్లని నీటితో
కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
చర్మం పొడిగా ఉన్న వారికి నాలుగు చెంచాల గంధంలో చెంచా బాదం ముద్ద,
నాలుగు చక్కల కొబ్బరి నూనె తీసుకుని ముఖానికి పట్టండి. 15 నిమిషాల తరువాత
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అంతే.
నల్లటి మచ్చలున్న వారికి గంధం పొడిలో చెంచె పసుపు, కర్పూరం మిశ్రమాన్ని కలిపి
ముఖానికి పెట్టుకోండి. తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే
సరి.
కాలి పగుళ్ళకు కూడా గంధం పరిష్కారం చూపిస్తుంది. గంధంలో రెండు చుక్కల
కొబ్బరి నూనె వేసి పాదాలకు పట్టించండి.
యవ్వనంగా ఉండాలంటే నాలుగు చెంచాల గంధం పొడిలో గులాబి నీరు, బొప్పాయి
గుజ్జు, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత
కడుగేసుకోండి..
ఇలా చేయడం వల్ల మీ చర్మం, ముఖం ఎంత కాంతివంతంగా తయారైవుతుందో
చూడండి..ట్రై చేయండి..