చిన్న చిట్కాతో ‘అందం’
Beauty tips with fruit juices
అందం..అందం అనేది కళ్ళల్లో ఉంటుంది కదా.. చూపు తిప్పుకోలేని అందం
ఉండాలని ప్రతి మహిళ కొరుకుంటుంది.
తాము అందంగా తయారు కావాలని ఎంతో
మంది ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. బ్యూటి ప్రొడక్ట్స్, వ్యాయమాలు, ఫేస్‌ప్యాక్‌లు ఇలా
ఎన్నో రకాలను మహిళలు పాటిస్తుంటారు. కాని ఒక్క చిన్న చిట్కా మీ మదిని దోచే
అందాన్ని దోచేస్తుంది..ఏంటా చిట్కా ? అంటారా ? ఆరెంజ్..ఆరెంజా ? అని
కొట్టిపారేయక ఇది చదవండి.. తక్కువ ఖర్చు..సయయం వృదా అయిపోకుండా
ఆరెంజ్‌తో అందాన్ని పొందవచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఓ ఆరెంజ్
(కమలాపండు) జ్యూస్ తాగండి చాలు..అవునండి .అంతే…
దీనివల్ల ఏం లాభం
ఆరెంజ్ జ్యూస్‌ను సేవించడం వల్ల జుట్టు, గోళ్ళు అందంగా ఉంటాయి. ఇందులో
విటమిన్ ‘సి’, ఫొలిక్ యాసిడ్, పోటాషియం అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయం
చేస్తాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం రెట్టింపు అందాన్ని
సంతరించుకుంటుంది. తాజాగా దీనిపై ఓ పరిశోధన కూడా నిర్వహించారు. ఇందులో
జ్యూస్‌ను సేవించిన వారిలో అందం రెట్టింపు అయిందని పరిశోధనలో తెలిందంట..
సో..ఇంకెందుకు ఆలస్యం..ప్రతి రోజు క్రమం తప్పకుండా ‘ఒక గ్లాసు అంటే 200
మి.లీటర్ల’ ఆరెంజ్ జ్యూస్ తాగండి..