Ayurveda is a gift of God to all the human beings Bhavanarushi

పాంచభౌతిక శరీరం

మానవ శరీరం పంచ భూతాలతో ఉత్పన్నమైనటువంటిది. అది చివరికి పంచ భూతాలలో కలవవలసిందే. మానవ శరీర నిర్మాణానికి పరమాత్ముడు ఇచ్చిన నియమమును పాటించినట్లైతే ధీర్షాయుష్మంతుడై, బలవంతుడై, ఆరోగ్యోవంతుడే, అష్టఐశ్వర్యమవంతుడై ప్రకృతి మనకు ఒనర్చినటువంటి ఫల, పుష్ప, వృక్ష, రస, గంధక, పాశానాదులచే ధాతువులచే, వజ్ర వైఢూర్యములచే, వెండి బంగారములచే అబ్రకాది గోమూత్ర శిలాజిత్ మట్టి, నీరు, వీటి ప్రభావములచే ఆకర్షితుడై ప్రకృతికి అనుసంధానవంతుడై, నిశ్చలమైన మనస్సుగలవాడై ప్రకృతిని సమస్త ప్రాణులను ప్రేమిస్తూ సజ్జన సాంప్రదాయం గలవాడై ధర్మాన్ని రక్షిస్తూ తోటి వారలను క్షమిస్తూ ప్రజాహితం కోరి యుక్తాయుక్త పరిజ్ఞానం గలవాడై నిర్ణయితమైన ఆహారం సేవించువాడై,భార్య పిల్లల సమేతుడై బంధువర్గ సమేతుడై ఈ బాహ్య ప్రపంచంలో సుఖవంతుడిగా జీవించగలడు. ఇది సృష్టికి మూలాధారమైన మొదటి ప్రశ్న. ఇందుకు మూలం ఆరోగ్యం, ఆయుర్వేదం.

ఆయువుని వృధ్ధి చేసుకోవడమే ఆయుర్వేదం. ఈ భరత భూమిలో చరాచర సృష్టిలో ప్రకృతికి వ్యతిరైకమైన రోగములన్నింటికి ఈశ్వరుడు చికిత్సాసారమైన రోగ నివారణకై సమస్త మూలికలను సృష్టించియుండెను. ఆ మూలికల నిలయమే ఈ భరతభూమి. ఈ భరత భూమిలో జన్మించిన ప్రతి జీవి ధన్యజీవి. సృష్టిలో జన్మించిన 84,00,000 జీవ రాసులలో అన్ని జీవరాసులకు పరమాత్ముడు ఔషధం నిర్నయించి ఉన్నాడు. అట్టి నిర్ణయం ప్రకారం జీవించని జీవులకు రోగము జనించును. మానవుడు తల్లి గర్భమునండి తన తల్లి తండ్రియ యొక్క రక్త మల మూత్రాదులచే కొన్ని రోగములను సంక్రమించుకొని వెడలును. అందులో రోగాలకు మూలము ప్రకృతిలో వాతం ప్రధానమైనది. పిత్తము పైత్యము (కఫం శ్లేషం) ఇట్టి రోగములకు వాత పిత్త కఫములని పేర్లు. అనగా.. వాతం – గాలి , పిత్తం – అగ్ని, శ్లేషం అనగా నీరు. ఈ మూడు గుణముల వ్యతిరేక ప్రభావముచే మానవుడు స్వస్ధానాన్ని వీడి ఒకదానియందు ఒకటి మిశ్రితమై వ్యతిరేక ప్రభావం ఉండి రోగ బారిన పడుచుండును. అట్టి రోగములేమనగా…
వాతములు – ఎనబై 80
పిత్తములు – ఇరవైనాలుగు 24
జలములు – ఇరవై రెండు. 22

వీటికి ప్రతికూలముగా మానవుడు సంచరించు విధానాన్నిబట్టి వేల రోగాలు ఉత్పన్నమగును.
Human body is made of 5 elements.(Air, Water, Soil, Sky, Fire). After the death the body gets merged with those 5 elements. If all the human beings follow the rules framed by the God, they get health, Wealth, energy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *