Attract attention in public functions

Attract attention in public functions, marriage and birth day functions

పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లకు వెళుతున్నారా ?

వివాహాలు, ఫంక్షన్‌లకు వెళుతున్నారా ? ఆ ఫంక్షన్‌లో మిమ్మల్నే చూడాలంటే

అందమైన అలంకరణ, అందంగా తయరు కావాలి.

ఎదో హాడావుడిగా తయారై వెళితే ఎబ్బెట్టుగా ఉంటుంది. అలంకరణ కూడా

సాధ్యమైనంత ఎక్కువ సమయం నిలిచిఉండేలా చూసుకుంటే బాగుంటుంది. అయితే

దీని కోసం ఈ చిట్కాలను పాటించండి.

స్నానం చేసిన తరువాత కొందరికి వెంటుకలు పొడి బారుతుంటాయి. తడి జట్టు

ఆరేందుకు వెంటనే డ్రయర్‌ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల కూడా మీ వెంట్రుకలు

పొడి బారుతుంటాయి. దీనికి కేశాలకు సంబంధించిన ‘జెల్‌’ దొరకుతుంది. జుట్టు

మధ్య భాగం నుండి అంచుల దాక తలకు పట్టించాలి. అలాగే సీరమ్‌ స్ప్రే కూడా

చేసుకోవచ్చు. తలస్నానం చేసేటప్పుడు లివ్‌ ఇన్‌ కండీషనర్‌ వాడాల్సి ఉంటుంది.
ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత తడిపొడిగా ఉన్నప్పుడే ముఖానికి

మాయిశ్చరైజర్‌ను పూతలా వ్రాసుకోవాలి. దీనివల్ల మీరు చేసుకునే అలంకరణ ఎక్కువ

సమయం ఉంటుంది.
పండ్లు, కూరగాయలతో ముఖానిక ఫేస్‌ప్యాక్‌లాగా వేసుకుని ముఖాన్ని కడిగేస్తే సరి.

ప్యాక్‌ వేసుకుని ఓ అరగంట పాటు కూర్చొవాలంటే టై ఉంటుందా ? అంటారు. ప్యాక్‌

వేసుకుని ఇతర పనులు చేసుకోండి. టైం కాగానే కడిగేసుకోండి.
ఇక కంటి క్రింద నల్లగా మచ్చలు, ఉబ్బిన కళ్ళు కనిపించకుండా ఉండాలంటే

నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను తీసుకుని కంటి అడుగున వ్రాయండి. గుండ్రని బ్రష్‌తో

కన్సీలర్‌ వేసుకోవాలి. అంతే ..

వివాహాలలో, ఫంక్షన్‌లలో దేనికి తగ్గట్టు వస్రాధరణ చేసుకుని వెళ్ళండి..మంచిగా

ఆకర్షణీయంగా తయారైన మీరు ఫంక్షన్‌లో గ్రాండ్‌గా కనిపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *