అందం..ఆరు సూత్రాలు
6 beauty tips for beautiful skin
అందంగా ఉండాలని స్త్రీ అనుకుంటుంది. దీనికి కావాల్సిన నియమాలన్ని పాటిస్తుంది.
మేకప్ విషయంలో ఇతరత్రా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కొద్దిమందిలో
అందం ఏ మాత్రం మెరుపడదు. వారి కోసం..
ముందుగా వారు ఆరోగ్యంగా
ఉండాలి. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి వేస్టు. ముందు
శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దంతాల శుభ్రత. ప్రతి రోజు ఉదయం
దంతాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు
జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహార విలువలతో కూడిన ఆహారం. శరీరంలో ఉన్న
వివిధ అవయవాలు పుష్టిగా ఉండాలంటే తాజా కూరగాయలు, పళ్ళు తదితర
పదార్థాలను తీసుకోవాలి.
నడక కూడా ఇంపార్ట్ంట్. నడక వల్ల చిన్న చిన్న వ్యాయామాలు చేయడం
మంచింది. రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేయించుకోండి. దీనివల్ల అనారోగ్యానికి గురి
కాకుండా ఉంటారు. ఆందోళనలు, భయాలు వదిలేయాలి. చక్కని సంగీతంతో రిలాక్స్
అవ్వాలి. మానసిక ప్రశాంత వల్ల ముఖానికి కాంతిని, ఆకర్షణ ఇస్తుంది.
Blockades on face
కొంతమందికి బ్లాక్ – వైట్ హెడ్స్ వస్తుంటాయి. కొంతమందికి ఇవి ఎబ్బెట్టుగా
కనిపిస్తుంటాయి.
కానీ దీనికి పరిష్కారం ఉంది.
అబ్బో బ్యూటిపార్లర్కు వెళ్ళి ఖరీదైన వాటిని తెచ్చుకోలేం..అంటారా ..అలాంటేదిమి
లేదు. తరచూగా వంటకాలలో వాడే దానితో మీ బ్లాక్ లేదా వైట్ హెడ్స్
పొగొడుతుంది. అదే ‘టమాట’
టమాట స్లైసుల్లా కోసి ముఖమంతా రుద్దాలి. ఇందులో ఉన్న పోటాషియం,
మిటమిన్ సి గుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి.
తాజా టమాట రసం ఓ టేబుల్ స్పూన్ తీసుకుని అందులో నాలుగు చుక్కల
నిమ్మరసం కలపండి. దూదిని ముంచి ముఖమంత రాసుకోండి. పదిహేను నిమిషాల
తరువాత చల్లని నీటితో కడిగేయండి.
ఎండ కారణంగా నల్లగా మారి జీవం కొల్పోయినట్లు అనిపిస్తే టమాట రసంలో
తేనే కలపండి. దీనిని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తరువాత కడిగేయండి.
టమాటలోని ఆమ్లాలు యాక్నే సమస్యను నివారించడానికి ఉపయోగపడుతాయి.
టమాటలో కె విటమిన్ లభిస్తుంది.
టమాట గుజ్జును తరచూ పూతలా వేసుకోవడం వల్ల క్రమంగా మార్పు వస్తుంది.
టమాట వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ట్రై చేసి చూడండి…