విప్లవ యోధుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర

ఏజార్జ్ రెడ్డి బయోగ్రఫీ..

అతనో విప్లవ యోధుడు. విప్లవాన్నే ఎరుపెక్కించిన అరుణతార. పాతికేళ్ల వయసులో అమరుడైనా.. అతని భావజాలం, సిద్ధాంతాలు ఈనాటికీ చెక్కుచెదరలేదు. అతనే జార్జ్ రెడ్డి. అతని మెదడు పాదరసం. అతనో ఉరకలెత్తే ఉత్సాహం. ఎక్కడో కేరళలో పుట్టి, మద్రాస్ లో పెరిగి, హైదరాబాద్ లో స్థిరపడి దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో, యువతలో స్ఫూర్తి రగిలించిన కాంతిధార జార్జ్ రెడ్డి.

1947 జనవరి 15న కేరళ మలబార్ జిల్లాలోని పాలక్కాడ్ లో పుట్టాడు జార్జిరెడ్డి. తండ్రి చల్లా రఘునాథరెడ్డి. తల్లి లీలా వర్గీస్. తండ్రిది చిత్తూరు జిల్లా పీలేరు తాలూకాలోని రొంపిచెర్ల గ్రామం. తల్లి లీలా వర్గీస్ క్రిస్టియన్. స్కూల్ టీచర్. వృత్తిరిత్యా తండ్రి వేర్వేరు ప్రాంతాలకు మారాల్సి రావడంతో జార్జ్ చదువు ఎక్కడా కుదురుగా సాగలేదనే చెప్పాలి. జార్జ్ 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారంటారు. ఆ ప్రభావం జార్జ్ జీవితంపై ఎంతో ప్రభావం చూపించిందంటారు.

ఇకపోతే రఘునాథరెడ్డి, లీలా వర్గీస్ నాలుగవ సంతానం జార్జ్ రెడ్డి. కారల్ రెడ్డి, సిరిల్ రెడ్డి, డాన్ రెడ్డి జార్జ్ సోదరులు. జాయ్ రెడ్డి జార్జ్ సోదరి. జార్జ్ అన్న కారల్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్. మరో సోదరుడు సిరిల్ రెడ్డి పేరుమోసిన న్యాయవాది. జార్జ్ తోబుట్టువులంతా వెల్ ఎడ్యుకేటెడ్.

జార్జ్ ప్రైమరీ స్కూల్ అంతా కేరళ కొల్లమ్ పట్టణంలోని తంగెస్సరీ గ్రామంలో జరిగింది. ఇన్సంట్ జీసస్ రెసిడెన్షియల్ స్కూళ్లో మూడేళ్ల పాటు చదివాడు జార్జ్. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ ఎస్.గోమోజీ క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను విపరీతంగా అదుపు ఆజ్ఞల్లో పెట్టేవాడంటారు. చదువులో చురుగ్గా ఉండే జార్జ్.. తన స్కూల్ ప్రిన్సిపల్ పెట్టే రూల్స్ నచ్చేవి కావంటారు. ఓ వైపు తల్లిదండ్రులు విడిపోయిన ప్రభావం, మరోవైపు స్కూళ్లో ప్రిన్సిపల్ కఠిన నిబంధనలు అన్నీ కలిపి చిన్నతనం నుంచే ప్రశ్నించే ధోరణిని పెంచాయి. రాడికల్ భావాలవైపు మళ్లేలా చేశాయంటారు. ఓరోజు మ్యాథ్స్ లో తోటి స్టూడెంట్ కి ఏదో డౌట్ వస్తే బోర్డుపై క్లారిఫై చేసేందుకు ప్రయత్నించాడట జార్జ్. అది చూసిన ప్రిన్సిపల్ గోమోజీ రోజంతా ఎండలో నిలబడాలని జార్జ్ ని ఆదేశించాడు. ఎండలో నిలబడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తిరగేశాడట జార్జ్. అది గమనించిన ప్రిన్సిపల్ ఇంకా సీరియస్ అయి జార్జ్ ని సంజాయిషీ అడిగాడట. ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేయలేదని తెలిసి విద్యార్థులకు కఠిన శిక్ష విధించడం టీచర్లు చేయాల్సిన పని కాదని.. శిక్ష అనుభవించడం తనకిష్టం లేదని ప్రిన్సిపల్ మొహం మీదే చెప్పాడు జార్జ్. చేయని తప్పుకి సరెండర్ అవడమంటే తనకి అసహ్యమని మిత్రులకు పదేపదే చెప్పేవాడట జార్జ్.

తర్వాత వరంగల్ కు జార్జ్ కుటుంబం మకాం మారాల్సి వచ్చింది. వరంగల్లోని గ్యాబ్రియెల్ జీసస్ లో మూడేళ్ల పాటు చదివాడు జార్జ్. అక్కడే పీపుల్స్ వార్ గ్రూప్ కు చెందిన కేజీ సత్యమూర్తి(కంభం జ్ఞాన సత్యమూర్తి)తో శిష్యరికం చేసిన జార్జ్ విప్లవభావాలవైపు ఆకర్షితుడయ్యాడంటారు. 1962లో హైదరాబాద్ కు వచ్చి స్థిరపడింది జార్జ్ కుటుంబం. అప్పటికి జార్జ్ వయసు 15 ఏళ్లు. హైదర్ గూడలోని సెయింట్ పాల్ స్కూళ్లో మిగతా స్కూలింగ్ పూర్తిచేశాడు జార్జ్. పీయూసీ(ప్రీ యూనివర్సిటీ) కోసం నిజాం కాలేజీలో చేరాడు. పీయూసీలో స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ సాధించాడు జార్జ్. కానీ అప్పుడప్పుడే ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో నాన్ లోకల్ కేటగిరీ కింద జార్జ్ కు మెడిసిన్ సీటును నిరాకరించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత 1967లో ఎంఎస్సీ చేసేందుకు ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటరయ్యాడు జార్జ్ రెడ్డి. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది.

#_న్యూక్లియర్_సైంటిస్ట్_కాదు__మెడిసిన్_జార్జ్_డ్రీమ్

ఐన్ స్టీన్ ఐక్యూ ప్లస్ చెగువేరా తెగువా ఈజ్ ఈక్వల్ టూ జార్జ్ రెడ్డి. మ్యాథ్స్, ఫిజిక్స్ మేధావి అయిన జార్జ్ గురించి అప్పట్లో తోటి సహచరులు చెప్పిన ఈక్వెషన్ ఇది. ప్రిన్సిపళ్లకే చెమటలు పట్టించే థీసిస్ రాయడం, అన్ సాల్వ్డ్ థియరీలపై డీటెయిల్డ్ నోట్స్ రాసిన మహాజ్ఞాని జార్జ్ రెడ్డి. జార్జ్ క్లాస్ లో ఉన్నాడంటే పాఠాలు చెప్పేందుకు జంకేవాళ్లట ప్రొఫెసర్లు. 1971లో ఎంఎస్సీ గోల్డ్ మెడల్ సాధించాడు జార్జ్ రెడ్డి. అప్పట్లో జార్జ్ ఆన్సర్ షీట్ దిద్దిన బాంబే ప్రొఫెసర్ అతను ప్రయోగించిన ఫార్ములాలు, థీసిస్ ను చూసి ముచ్చటపడ్డాడట. జార్జ్ ను స్వయంగా కలిసి భుజం తట్టేందుకు బాంబే నుంచి ఉస్మానియాకు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. కలిసి వెళ్తూ ఉస్మానియా వైస్ ఛాన్స్ లర్ తో ఆయన అన్న మాటలేంటో తెలుసా ? ‘‘ఉస్మానియాలో ప్రపంచం గర్వించదగ్గ మేధావి ఉన్నాడు అతనే జార్జ్ రెడ్డి’’. అని చెప్పి వెళ్లాడట.

గోల్డ్ మెడల్ సాధించిన జార్జ్ రెడ్డిని వెతుక్కుంటూ దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలెన్నో వచ్చాయి. ఎంఎస్సీ ఫిజిక్స్ తర్వాత రీసెర్చ్ స్కాలర్ గా ఉస్మానియాలోనే ఉండిపోయాడు జార్జ్. 1971 ప్రాంతంలో ప్రతిష్టాత్మక టాటా ఇన్ స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR) జార్జ్ కు రీసెర్చ్ స్కాలర్ గా అవకాశం ఇచ్చింది. TIFRలో పనిచేసే రాఘవరావు అనే తెలుగు ప్రొఫెసర్ ఆ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ లలో ఒకరిగా పనిచేశారు. జార్జ్ మేధస్సును గ్రహించిన TIFR డీన్ డా.పిశరోత్తి జార్జ్ ను ఎలాగైనా మన ఇన్ స్టిట్యూట్ లో చేరేలా కన్విన్స్ చేయమని రాఘవరావును పురమాయించారట. ఉస్మానియా, TIFR రెండింట్లో రీసెర్చ్ స్కాలర్ గా అవకాశమిస్తే దేన్ని ఎంచుకుంటావని జార్జ్ కు ఆప్షన్ ఇస్తే.. ఖచ్చితంగా ఉస్మానియాకే ఓటేస్తా అన్నాడట. అప్పటికే ఉస్మానియాకు, అక్కడి పరిస్థితులకు మెల్ట్ అయిపోవడం జార్జ్ ను TIFRకు దూరం చేసిందంటారు అతని సన్నిహితులు. నిజానికి TIFRలో చేరి ఉంటే జార్జ్ జాతకం మరోలా ఉండేదన్నది వాళ్ల వాదన.

ఫిజిక్స్-మ్యాథమెటిక్స్ లో అంతటి మేధస్సు కల్గిన జార్జ్… నిజానికి మెడిసిన్ చేయాలని కలలుగన్నాడని తెలుసా ? పీయూసీ తర్వాత మెడిసిన్ చదివి డాక్టర్ గా స్థిరపడాలనుకున్నాడని అతని స్నేహితులు చెప్పిన మాట. అప్పట్లో తెలంగాణ తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలో ముల్కీ-నాన్ ముల్కీ నిబంధనలపై విద్యార్థిలోకం ఆత్మార్పణలకు సైతం సిద్ధపడుతున్న రోజులవి. అలాంటి టైంలో జార్జ్ పీయూసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు. ఇప్పటిలా మెడిసిన్ సీటు కోసం ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించడం లేదప్పట్లో. మార్క్స్, విద్యార్థి నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేసేవారు. అదే ప్రాతిపదికన అయితే జార్జ్ కు మెడిసిన్ సీటు ఖచ్చితంగా రావాల్సింది. కానీ నాన్ లోకల్ అన్న ఒకే ఒక్క కారణంతో ఉస్మానియా అతనికి మెడిసిన్ సీటు నిరాకరించింది. అప్పటి సబ్ రిజిస్ట్రార్ తో జార్జ్ స్నేహితులు ఆరా తీస్తే తేలిన విషయమిది. జార్జ్ కుటుంబం హైదరాబాదుకు వచ్చి స్థిరపడి అప్పటికి ఐదేళ్లు మాత్రమే అయింది. ఆ కారణంతో మెడిసిన్ సీటు కోల్పోయాడు జార్జ్. ఒకవేళ మెడికల్ సీటు వచ్చుంటే జార్జ్ జీవితం ఎలా ఉండేదో ?

#_జార్జ్_హత్య_32_మంది_గూండాలు_60కి_పైగా_కత్తిపోట్లు

జార్జ్ రెడ్డి. అది పేరు కాదు. ప్రవహించే ఉత్తేజం. ఉరకలెత్తే ఉత్సాహం. 5 అడుగుల 6 అంగుళాల కటౌట్. జార్జిని ఢీకొట్టేందుకు కండలు తిరిగిన బాడీలు సైతం భయపడేవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎదురుగా మృత్యువు నిలుచున్నా చివరి శ్వాస వరకు పోరాడే అతని నైజం ముందు శతృవులు బిక్కచచ్చిపోయేవారు. మతోన్మాద శక్తులకు, ఫ్యూడల్ శక్తులకు సింహస్వప్నం అతను. అందుకేనేమో ఒంటరిని చేసి 32 మంది ప్రొఫెషనల్ గూండాలు చుట్టుముట్టి 60కి పైగా కత్తిపోట్లు కసిదీరా పొడిచారు. ప్రాణాలు వదిలాడని తెలిసిన తర్వాతే కత్తిపోట్లు ఆగాయంటే జార్జిరెడ్డి భయం ప్రత్యర్థులను ఎంత వణికించిందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ చెగువేరా. హోల్ హైదరాబాద్ కి సోలో అందగాడు. బాక్సర్, బ్లేడ్ ఫైటర్. అరుణతార, క్రాంతిధార, కాంతిధార. ఉస్మానియా విద్యార్థి జార్జ్ రెడ్డి హత్య నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అట్టుడికించింది. 1972 ఏప్రిల్ 14న సరిగ్గా అంబేద్కర్ జయంతి రోజునే జార్జ్ హత్య జరగడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60కి పైగా కత్తిపోట్లు పొడిచి కసిదీరా కడతేర్చింది జార్జ్ వ్యతిరేకవర్గం. ధూల్ పేట నుంచి వచ్చిన 30 మందికి పైగా కరుడుగట్టిన గూండాలు జార్జ్ ను ప్రాణం పోయేవరకు పొడిచి పొడిచి చంపేశారు. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక ఒంటరిగా దొరికిన జార్జ్ ను అంతం చేశాయి అరాచక శక్తులు. ఆ కేసులో లఖన్ సింగ్, సూర్ దాస్ రామచంద్రారెడ్డితో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఉస్మానియా విద్యార్థి ఎన్నికలు జరగడానికి ఒకరోజు ముందు జార్జ్ హత్య జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ విద్యార్థి ఎన్నికలు జరుగుతున్నా.. ఒక్క ఉస్మానియా మాత్రమే రణరంగాన్ని తలపించాయి. పోలీసు పికెటింగ్ మధ్య విద్యార్థులు ఎన్నికలు ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. ఏబీవీపీ తరఫున లఖన్ సింగ్ ప్యానెల్, PDS తరఫున జార్జ్ రెడ్డి ప్యానెల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జార్జ్ రాకతో ఉస్మానియాలో ఎన్నికల వాతావరణమే మారిపోయింది. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎన్నికల్లో పోటీచేసేందుకు భయపడే రోజుల నుంచి జార్జ్ అండతో ఏబీవీపీ-ఆర్ఎస్ఎస్-NSUI(కాంగ్రెస్ విద్యార్థి విభాగం) నాటి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అప్పటికే ఉస్మానియాలో వివిధ ఎన్నికల్లో ఏబీవీపీకి వ్యతిరేక ఫలితాలొచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది ఏబీవీపీ. అప్పటికే జార్జ్ ప్యానెల్ దే గెలుపు అన్నంతలా మూడ్ క్రియేట్ అయింది. అలాంటి టైంలో జార్జ్ హత్య జరగడం విద్యార్థి లోకాన్ని నివ్వెరపరిచింది. జార్జ్ హత్యతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. కొన్ని నెలల పాటు హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ ప్రతీ గల్లీలో జార్జ్ రెడ్డి అమర్ రహే అన్న నినాదాలు గోడలపై రాయబడ్డాయి. అంతలా జార్జ్ రెడ్డి విద్యార్థిలోకాన్ని, యువతను రగిలించాడు.

#_జార్జ్_రెడ్డి_హత్యకు_దారితీసిన_పరిస్థితులు ?

1960-70ల్లో దేశంలోని అన్ని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో బూర్జువా వర్గాలు, ఫ్యూడల్ శక్తులు, మతోన్మాద శక్తులు పేట్రేగిపోయేవి. పెత్తందారీ, ఉన్నత వర్గాలకు చెందిన వారసులు మాత్రమే యూనివర్సిటీల్లో చదువుకునే రోజులవి. గ్రామీణ, బడుగు-బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు స్కాలర్ షిప్పులతో మాత్రమే చదువుకునే రోజులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నత విద్య తమకు మాత్రమే, తమదే అన్న అహంకార ధోరణి ఉండేది బలిసిన వర్గాల వారసుల్లో. ఉస్మానియా అందుకు మినహాయింపేం కాదు. 1967 ఉస్మానియా క్యాంపస్ లో అడుగుపెట్టిన జార్జ్ రెడ్డికి మొదట్లో అక్కడి పరిస్థితులు మింగుడు పడలేదు. క్రమంగా అకడమిక్ బుక్స్ తో పాటు నాన్ అకడమిక్ బుక్స్ చదువుతూ సామాజిక స్థితిగతులను అవగాహన చేసుకున్నాడు జార్జ్. మతోన్మాద-ఫ్యూడల్ శక్తులను ఎదుర్కోవాలంటే ప్రగతిశీల భావాలు, రాడికల్ భావాలే కరెక్ట్ అని నమ్మిన జార్జ్.. ఆ వర్గాలపై ఎదురుతిరిగాడు. ఉస్మానియాలో లంపెంగ్ గ్యాంగ్ అనే ఓ అరాచక మూక గ్రామీణ, వెనుకబడిన విద్యార్థులను హింసించడం, అమ్మాయిలను ఈవ్ టీజింగ్ పేరుతో వేధించడం చేస్తుండేవి. లంపెంగ్ గ్యాంగ్ చేతిలో అన్యాయానికి గురైన విద్యార్థులకు జార్జ్ అండగా నిలిచాడు. క్యాంపస్ కొచ్చింది చదువుకోవడానికి భయపడ్డానికి కాదని ధైర్యం నూరిపోశాడు. ఆ సందర్భంలో వచ్చిందే ‘‘జీనా హైతో మర్ నా సీకో… కదం కదం పర్ లడ్నా సీకో(బతకాలంటే చావడం నేర్చుకో.. అడుగడుగునా ఎదురించడం నేర్చుకో)’’ అన్న నినాదంతో గర్జించాడు జార్జ్. ఆ ఒక్క నినాదం వేలాదిమంది విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించింది. కాలేజీ ఎన్నికల్లో పోటీ సంగతి పక్కన పెడితే కనీసం హక్కుల్లో, ఆఖరికి యూనివర్సిటీ హాస్టల్లో తిండి దగ్గరా అవమానాలు, వివక్షకు గురైన ఎంతోమంది విద్యార్థులను తట్టిలేపింది. దాంతో అరాచకమూకలు అదిరిపడ్డాయి. మతోన్మాద-ఫ్యూడల్ శక్తులకు సింహస్వప్నంగా మారాడు జార్జ్ రెడ్డి. అప్పటిదాకా క్యాంపస్ కు మాత్రమే పరిమితమైన జార్జ్ రెడ్డి భావజాలం-విప్లవం… హైదరాబాద్ మొత్తానికి విస్తరించింది. ఎక్కడ అభాగ్యులు అన్యాయానికి గురైతే అక్కడ తేలేవాడు. తనను తానో ఆదర్శ నాయకుడిగా మలుచుకునేందుకు స్లిప్పర్స్ ధరించాడు. తనకిష్టమైన ఆలివ్ గ్రీన్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్ ని తగలబెట్టి రెండే రెండు జతలకు పరిమితమయ్యాడు. సిటీ బస్సుల్లో సాదాసీదాగా తిరిగేవాడు. ఆకలితో అలమటించే అభాగ్యులకు సంఘీభావంగా ఒకపూట మాత్రమే భోజనం చేసేవాడు. దాంతో హైదరాబాద్ హీరోగా మారిపోయాడు జార్జ్. హైదరాబాద్ చెగువేరాగా కీర్తించబడ్డాడు. పాతికేళ్ల వయసులో విద్యార్థులనే కాదు ఏకంగా రాజకీయాలనే శాసించే విద్యార్థి శక్తిగా ఎదిగాడు జార్జ్. అతన్ని మరింత కాలం బతకనిస్తే భారత రాజకీయాలనే మార్చేస్తాడేమో అని భయపడింది నాటి బూర్జువా-భూస్వామ్య వర్గం. అందుకే పెద్ద పెద్ద వ్యక్తులు జార్జ్ హత్యకు పథకం రచించారంటారు. ఆ హత్యలో లంపెంగ్ గ్యాంగ్, లఖన్ సింగ్ గ్యాంగ్ కేవలం పాత్రధారులు మాత్రమే. నిజానికి జార్జ్ హత్య జరిగిన టైంలో క్యాంపస్ మొత్తం పోలీసు పహారాలో ఉంది. పోలీసుల కళ్లెదుటే హత్య జరిగినా ఏ ఒక్క ఖాకీ ఆపేందుకు ప్రయత్నించలేదన్న వాదనలున్నాయి. ధూల్ పేట నుంచి దిగిన గూండాలు ఇంజనీరింగ్ కాలేజీ మెట్లు జార్జ్ హత్యతో తడిసింది నిజం. 60 కత్తిపోట్లలో ఓ విప్లవ నినాదం నేలకొరిగిందీ నిజం. ప్రత్యక్ష సాక్షులు పెద్ద ఎత్తున వాంగ్మూలమిచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులే ప్రాసిక్యూషన్ ను పక్కదోవ పట్టించారన్న ఆరోపణలున్నాయి. దాంతో జార్జ్ హత్య ఫార్స్ కేసుగా మిగిలిపోయి కొట్టేయబడింది. ఆ హత్య తర్వాత ఓ ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఓ నాయక్ తో సహా మొత్తం 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్టు నాటి పీవీ ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకుంది. విజయవంతంగా జార్జ్ హత్య కేసును ఏబీవీపీ-ఆర్ఎస్ఎస్ పై నెట్టి ఆ నెత్తుటి మరకలను తుడిచేసుకుంది నాటి అధికార కాంగ్రెస్.

#_జార్జ్_ను_విప్లవం_వైపు_నడిపించిన_సంఘటనలేంటి ?

విప్లవయోధుడు, అరుణతార, క్రాంతిధార. జార్జ్ రెడ్డి పుట్టింది దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరమే. 1947 జనవరి 15న జన్మించాడు జార్జ్. బ్రిటీషర్స్ వదిలి వెళ్లింది భారతదేశాన్ని మాత్రమే. బానిస సంకెళ్లు కాదన్న సత్యం తెలుసుకునేందుకు దేశానికి ఎంతో కాలం పట్టలేదు. సోషలిస్ట్ ప్రభుత్వం ముసుగులో నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ ప్రభుత్వం సామ్యవాదం వైపు అడుగులు వేసింది. దాంతో దేశవ్యాప్తంగా అసహనం రాజ్యమేలింది. అది చరిత్ర. దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ విశ్లేషకులకు స్వతంత్ర భారతదేశపు భ్రమలు తొలిగిపోయాయి. స్వతంత్రం వచ్చింది కానీ రాజకీయ స్వాతంత్రం రాలేదన్న నిర్ణయానికొచ్చారంతా. అప్పటికే యుక్తవయసులోకి వచ్చి సామాజిక స్థితిగతులను తన మేధస్సుతో తర్కించడం, శోధించడం మొదలుపెట్టిన జార్జ్ రెడ్డికి అంతా అయోమయంగా కనిపించింది. ఓ వైపు ప్రభుత్వమే పేదలను దోపిడీ చేస్తున్న తీరు మింగుడుపడలేదు. ఆ సమయంలోనే బెంగాల్లో చారుమజుందార్ నక్సల్బరీ ఉద్యమాన్ని లేవదీశారు. తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసి నిజాం నవాబును ఉరికించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నక్సల్బరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు చారు మజుందార్. మరోవైపు శ్రీకాకుళంలో గిరిజన రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. వీటిమధ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్రా ఉద్యమాలు ఎగిశాయి.

అంతర్జాతీయంగా వియాత్నం-అమెరికా యుద్ధం, లాటిన్ అమెరికా దేశాలైన క్యూబా, బొలివియా లాంటి దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాలమది. వాటికితోడు స్వేచ్ఛాస్వతంత్రాల కోసం ఆఫ్రికా దేశాలు ఉద్యమిస్తున్న సందర్భం. వాటన్నింటి మధ్య పొలిటికల్ గా ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని స్థితిలో క్రాస్ రోడ్స్ లో నిలబడ్డాడు జార్జ్. అంతకుముందే కొండపల్లి సీతారామయ్య స్థాపించిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(RSU), పీపుల్స్ వార్, కమ్యూనిస్ట్ సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీలతో సంబంధాలున్న జార్జ్… తన విప్లవ పంథా ఎటువైపో తేల్చుకోలేకపోయాడు. సోషలిస్ట్ సిద్ధాంతాలతో కాంగ్రెస్ లోని ఫ్రెషర్స్ గ్రూప్ ‘‘యంగ్ టర్క్స్’’ బృందంగా ఏర్పడింది. సోషలిస్ట్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కానీ దాని అసలు రంగు తెలిశాక బయటకొచ్చేశాడు. 1969-70ల్లో సోవియట్ యూనియన్ అండతో కాంగ్రెస్ పార్టీని పెట్టుబడి దారీ సంస్కరణ వైపు నడిపించే ప్రయత్నం జరిగింది. దానికోసమే యంగ్ టర్స్క్ బృందం కాంగ్రెస్ పార్టీలో ఫ్రెషర్ గ్రూపుగా అవతరించింది. ఫ్యూడల్ భూస్మామ్యానికి వ్యతిరేకంగా యంగ్ టర్క్స్ తీవ్రవాద నినాదాలు జార్జ్ ని ఆకర్షించాయి. వారు స్థాపించిన ‘‘సోషలిస్ట్ స్టడీఫోరం’’గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధితో నమ్మాడు. కానీ అవి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను కొత్తముసుగుతో పరిరక్షించే కొత్త ఎత్తుగడని తెలుసుకున్నాడు. దానిపై భ్రమలు వీడి విప్లవ పంథాను స్వీకరించాడు. ఆ సమయంలోనే ఏడాది పాటు యూనివర్సిటీ నుంచి రస్టిగేట్ చేస్తే టైం వేస్ట్ చేయకుండా వందలకొద్ది పుస్తకాలు చదివాడు జార్జ్. తన సబ్జెక్ట్స్ అయిన మ్యాథ్స్-ఫిజిక్స్ తో పాటు నాన్ అకడమిక్ బుక్స్ ని విపరీతంగా స్టడీ చేశాడు. అక్రమంలోనే మార్కోవ్ మ్యాథ్స్ ఈక్వెషన్స్ ని సాల్వ్ చేశాడు, బెర్క్ లీ ఫిజిక్స్ థీయరీలపై డీటెయిల్డ్ నోట్స్ తయారు చేశాడు. నోర్ చామ్స్ కీ రాసి ఎట్ వార్ విత్ ఆసియా, ఫ్రెడ్రిక్ హెగెల్స్ రాసిన సైన్స్ అఫ్ లాజిక్, అలెక్స్ హెలీ రాసిన మాల్కం ఎక్స్ ఆటో బయోగ్రఫీతో పాటు ఎన్నో విలువైన పుస్తకాలు చదివాడు. ప్రపంచ విప్లవకారుడు చెగువేరా జీవితం జార్జ్ ను విపరీతంగా ఆకర్షించింది. చే రాసిన గెరిల్లా వార్ ఫేర్ అండ్ రెవల్యూషన్, బొలివియన్ డైరీస్ లాంటి గ్రంధాలు జార్జ్ ని విపరీతంగా ప్రభావితం చేశాయి. ట్రాట్స్కీ, ప్లేటో, సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనలను ఔపోసన పట్టాడు జార్జ్. మార్క్సిజం కోణంలో చుట్టూ ఉన్న సమాజాన్ని విశ్లేషించుకున్నాడు. సామ్యవాదం ముసుగులో ప్రభుత్వాలు సాగిస్తున్న దోపిడిని అర్థం చేసుకున్నాడు. అప్పటికి మార్క్సిజాన్ని స్వీకరించలేదు జార్జ్. అప్పటికి తన పొలిటికల్ స్టాండ్ ని ఎటూ తేల్చుకోలేని స్థితిలోనే ఉన్నాడు జార్జి అజ్ఞాతవాసం తర్వాత జరిగిన యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిచాడు.

జాతీయ, అతర్జాతీయ పరిణామాలు జార్జిరెడ్డిలోని ప్రశ్నించే తత్వాన్ని తట్టిలేపాయి. 1967 నక్సల్బరీ పోరాటం, 1969 తెలంగాణ ఉద్యమం, వియత్నాం యుద్ధం, శ్రీకాకుళ రైతాంగ పోరాటం జార్జ్ ఆలోచనల్ని కొత్తతీరం వైపు తీసుకెళ్లాయి. తన పుట్టుక పీడిత ప్రజల పక్షానే నిలిచేందుకే అని నమ్మాడు. దాంతో అప్పటి ఉపాధ్యయ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య ప్రోత్సాహంతో మార్క్సిస్టు పంథాను స్వీకరించాడు. ఐడియాలజీ మాత్రమే కాదు ఆచరణ జార్జీరెడ్డి మరో ప్రత్యేకత. క్యాంపస్ లో మెజారిటీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవాళ్లే. ఆ రోజుల్లో తోటి విద్యార్థులతో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విబేధాలుండేవి. కానీ విప్లవాన్ని శ్వాసించాడో అప్పటి నుంచి అట్టడుగు వర్గాల జీవన విధానాన్ని అలవర్చుకున్నాడు. తనను తాను మార్చుకున్నాడు. ఆదర్శ విప్లవకారుడిలా మార్చుకునేందుకు స్లిప్పర్లు వేసుకునేవాడు. రెండే రెండు జతల బట్టలు వేసుకునేవాడు. ఆకలితో అలమటించే అభాగ్యులకు సంఘీభావంగా ఒక్క పూట మాత్రమే తినేవాడు. కాగితం మీద రాస్తే ఎక్కడా ఖాళీ ఉండేది కాదు. దేన్నైనా పొదుపుగా ఉపయోగించేవాడు. నిర్లక్ష్యం, అలసత్వం అస్సలు కనిపించేది కాదు. ఎప్పుడూ సిటీ బస్సుల్లోనే తిరిగేవాడు. అడిగిన వారికి, అడగని వారికి చేతనైన సాయం చేసేవాడు. తన స్కాలర్ షిప్ డబ్బులతో ఏ మాత్రం ఆధారం లేని ఓ స్నేహితుడికి వ్యాపారం పెట్టించిన గొప్ప మానవతావాది జార్జ్. తానొక్కడే కాదు తన చుట్టూ ఉన్న సంపన్న విద్యార్థులను కూడా డీ క్లాసిఫై చేయించాడు. ఇదంతా ఒకెత్తైతే విద్యార్థుల్లో సాంఘీక స్పృహ, ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు కృషి చేయడం మరో ఎత్తు. తనలాంటి భావాలున్న కొందరు స్నేహితులతో PDSUను ఏర్పాటు చేశాడు. PDSU పేరుతో స్టడీ సర్కిళ్లు నడిపాడు. అందులో సామాజిక మార్పుకు సంబంధించిన చర్చలు జరిగేవి. ఆస్ట్రానమీ, సైన్స్ కాలేజీకి ఆనుకుని ఉండే బండ క్యాంటీన్ జార్జ్ స్నేహితులకు అడ్డా. అక్కడే చర్చలు జరిగేవి.

సైన్స్ సిద్ధాంతాలు, భౌతికవాద తత్వశాస్త్రం, భారతదేశంలో పేదరికం, గ్వాంటేమాల సంఘటనలు, పోకో సిద్ధాంతం, క్యూబన్ పోరాటం, పాలస్తీనా సమస్య, ఆఫ్రికా ప్రజల విముక్తి పోరాటాలపై జార్జి స్పీచులిస్తుంటే ముగ్ధులై వినేవాళ్లంతా. మతోన్మాదం, వియాత్నం యుద్ధంపై కరపత్రాలు ముద్రించి పంచిపెట్టేవాడు. శాస్త్రీయ విద్యావిధానంపై జాతీయస్థాయిలో జరిగిన ఓ సెమినార్ లో జార్జి ఇచ్చిన స్పీచ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. క్రైసిస్ ఇన్ క్యాంపస్ డాక్యుమెంటరీలో విద్యార్థుల్లో ఉన్న అశాంతిపై జార్జీ మాట్లాడాడు. ధిక్కార స్వరాల్ని వ్యవస్థ ఎలా విస్మరించిందో.. శాంతియుత నిరసనల్ని అధికారం ఎలా అణిచివేస్తుందో వివరించాడు. అలా చెప్తుంటే ప్రాఖ్యాత ఫ్రాన్స్ విప్లవ రచయిత ఫ్రాన్జ్ ఫేనన్(franz Fanon) చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి.

1970ల్లో భూస్వామ్య వర్గాలు యూనివర్సిటీలోకి ఎంటరయ్యాయి. ఫలితంగా ఓయూలో అరాచక వాతావరణం చెలరేగింది. యూనివర్సిటీలో అప్రజాస్వామిక వాతావరణం ఉండేది. ఓ వర్గం భావజాలమే రాజ్యమేలుతున్న విద్యార్థి విభాగంలో ఆనాటి ఫ్యూడల్ శక్తుల వారసులు చక్రం తిప్పారు. వాళ్లను లంపెంగ్ గ్యాంగ్ అనేవాళ్లు. అమ్మాయిలను వేధించడం, ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను హింసించడం లంపెంగ్ గ్యాంగ్ నైజం. పాలకమండలి వ్యవహారంలో జోక్యం చేసుకునేవారు. పీజీ క్యాంపస్ హాస్టల్ పై అధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారు. లంపెంగ్ గ్యాంగ్ కు పాలకమండలిలో కొందరు మద్ధతిచ్చేవారు. దాంతో ఆ గ్యాంగ్ మరింత బరితెగించింది. దళితులకు, అమ్మాయిలకు చదువు ఎందుకని మతం ముసుగులో కులదురహంకారంతో వెక్కిరించేవారు. వాళ్ల అరాచకాలకు జార్జిరెడ్డి ఎదురుతిరిగాడు. లంపెంగ్ గ్యాంగ్ చేతిలో అన్యాయానికి గురైన విద్యార్థులను జార్జి కూడగట్టాడు. వాళ్లలో ధైర్యం నింపాడు. ఈవ్ టీజింగ్ కు బలైన అమ్మాయిలకు అన్నయ్యాడు. లంపెంగ్ గ్యాంగ్ కు మద్ధతిచ్చిన పాలకవర్గంలోని అధికారులను నిలదీశాడు. తన పేరు వింటేనే నీళ్లు నమిలే పరిస్థితిని కల్పించాడు. అప్పటి నుంచే జార్జ్ పై భౌతిక దాడులు మొదలయ్యాయి. 1972 ఫిబ్రవరి 7న జరిగిన దాడి వాటిలో ఒకటి. ఆరోజు లంపెంగ్ గ్యాంగ్ తనపై జరిపిన దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన జోలికొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చేతల్లో చూపించాడు. అప్పట్నించి ఉస్మానియా కేంద్రంగా సాగించిన ఉద్యమాన్ని హైదరాబాద్ మొత్తానికి విస్తరించాడు. ప్రజాసమస్యలపై పోరాడాడు. ప్రజా మద్ధతుతో పాటు మేధావుల మద్ధతు పొందాడు. హైదరాబాదులో జార్జి రెడ్డిచేస్తున్న పోరాటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అరాచక శక్తులకు, మతోన్మాద శక్తులకు సింహస్వప్నంలా మారాడు. పాలక వ్యవస్థకు చెమటలు పట్టించాడు. దాంతో ప్రభుత్వం జార్జిరెడ్డిని టార్గెట్ చేసింది. అక్రమ కేసులతో పీడీఎస్ కార్యకర్తలను వేధించింది. అయినా జార్జి వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని ఎన్నో వేదికలపై ఎండగట్టాడు.

PDSU పోరాటాల్ని ఎప్పుడైతే క్యాంపస్ దాటించాడో అప్పటి నుంచే పాలక వ్యవస్థకు టార్గెట్ గా మారాడు. పేదల పక్షాన జార్జిరెడ్డి చేసిన ఉద్యమాలు నాటి ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. జార్జిని అలాగే వదిలేస్తే భారత రాజకీయాల్నే మార్చే కొత్త శక్తిలా మారతాడని నాటి పాలకులు భయపడ్డారు. అప్పటివరకు లంపెంగ్ గ్యాంగ్ కు మాత్రమే అవసరమైన జార్జి మరణం పాలక వ్యవస్థకు అత్యవసరంలా మారింది. అందుకే క్యాంపస్ లో జార్జిరెడ్డి హత్య జరగడరం హంతకులు తప్పించుకోవడం ఈజీ అయింది. ఆనాడు జార్జిరెడ్డి ఉస్మానియాలో కాలుపెట్టకపోయి ఉంటే క్యాంపస్ పరిస్థితి మరోలా ఉండేదంటారు చాలామంది. మతోన్మాద, ఫ్యూడల్ శక్తుల చేతిలో బందీ అయి అచేతనంగా ఉండేదేమో. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి చేసిన పోరాటమే నేడు ఉస్మానియాలో ప్రజాస్వామ్య శక్తులు ఎదగడానికి కారణమైంది.

నిజానికి జార్జ్ హత్యను అప్పటి ఏబీవీపీ నాయకుల ఆత్మవిమర్శకు కారణమైందంటారు. బీజేపీ నేతలు, అప్పటి ఏబీవీపీ స్టూడెంట్ లీడర్స్ సీహెచ్ విద్యాసాగర రావు(మహారాష్ట్ర మాజీ గవర్నర్), నల్లు ఇంద్రాసేనారెడ్డి(బీజేపీ మాజీ ఎంపీ), మురళీధర్ రావు(ఇప్పటి బీజేపీ నేత), బంగారు లక్ష్మణ్… కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిలాంటి వాళ్లంతా జార్జిరెడ్డికి వైరివర్గం. వాళ్లు సైతం కొన్ని సందర్భాల్లో జార్జ్ హత్య జరగకుండాల్సిందని ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు. సైద్ధాంతికంగా జార్జ్ తో విబేధించినా అతని భావజాలం ప్రత్యర్థులను సైతం ఆకర్షించిందంటారు. అలాంటి ఇంటలెక్చువల్ బతికి ఉంటే భారత రాజకీయాలు మరోలా ఉండేవని సూత్రీకరించారు.

#_జార్జ్_హత్యలో_పీవీ_ప్రభుత్వానిదే_పాపమా ?

జార్జ్ రెడ్డి. ఉస్మానియా విప్లవ యోధుడిగా దేశం దృష్టిని ఆకర్షించిన నవయువకుడు. 25 ఏళ్ల వయసులో 1972 ఏప్రిల్ 14న జార్జ్ ను అతి కిరాతకంగా చంపింది అతని ప్రత్యర్థి వర్గం. జార్జ్ హత్యకు ఎన్నైనా కారణాలుండొచ్చు. కానీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు పాత్ర వివాదస్పదం అంటారు చరిత్రకారులు. జార్జ్ హత్య జరిగిన రోజు ఉస్మానియా క్యాంపస్ లో పోలీస్ పికెట్ నిర్వహించారు. చుట్టూ పోలీసులు మొహరించినా ఓ బ్రిల్లియంట్ స్టూడెంట్ ప్రాణాలు కాపాడలేకపోయారన్న అపప్రద నాటి సీఎం పీవీ మోయాల్సి వచ్చింది. నిజానికి జార్జ్ హత్యను ఏబీవీపీ-ఆర్ఎస్ఎస్ కు అంటగట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ వర్గంతో జార్జ్ కు సైద్ధాంతిక విబేధాలున్న మాట నిజం. కానీ జార్జ్ హత్య రాజ్యం చేసిన కుట్ర అన్నది చరిత్రకారుల విశ్లేషణ. అప్పట్లో జార్జ్ ను అంతం చేయడం లంపెంగ్ గ్యాంగ్, లఖన్ సింగ్ గ్యాంగ్ కు ఓ అవసరం. కానీ పెత్తందారీ, ఫ్యూడల్ శక్తులు, మతోన్మాద శక్తులకు అత్యవసరంగా మారింది. జార్జ్ ను అలాగే వదిలేస్తే రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాడన్న భయం నాటి భూస్వామ్య వర్గాల్లో పెరిగింది. ఆ భయమే అతన్ని అంతం చేసేందుకు ఉసిగొల్పిందంటారు.

1972 ఉస్మానియా విద్యార్థి ఎన్నికలు ఏబీవీపీ-పీడీఎస్ కు ప్రతిష్టాత్మకం. కానీ జార్జ్ హత్యకు నెలరోజుల ముందు గుర్తు తెలియని, క్యాంపస్ కు సంబంధం లేని 30 మందికి పైగా అనుమానితులు వివిధ హాస్టల్లలో వచ్చి చేరారు. జార్జ్ వర్గంతో పాటు చాలామంది విద్యార్థులు వాళ్లను గుర్తించి క్యాంపస్ నుంచి తరిమేయాలని అప్పటి వీసీ నరోత్తమ రెడ్డితో సహా పోలీసులకు వినతి పత్రాలిచ్చారు. కానీ పాలకమండలి అలసత్వం వహించింది. పోలీసులు చూసీ చూడనట్టు వదిలేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా విద్యార్థుల అనుమానాల్ని లైట్ తీసుకుంది. జార్జ్ హత్య జరిగిన రోజు.. హత్య జరిగిన ప్రాంతానికి అతి సమీపంలో పోలీస్ పికెట్ ఉన్నదట. పోలీసులకు జార్జ్ హత్య విషయం తెలిసి కూడా ప్రతిఘటించలేకపోయారన్న వాదనలున్నాయి. అప్పటి ఏబీవీపీ స్టూడెంట్ లీడర్ నూర్ దాస్ రామచంద్రారెడ్డి మాటల్లో చెప్పాలంటే ఓ పోలీస్ తన బంధూకుకు ఉన్న బ్యారెల్ తో పొడిచాడని ఆ తర్వాతే గూండాలు జార్జ్ ని రౌండప్ చేసి చంపారని చెప్పాడు. నిజానికి ఏబీవీపీ అప్పటి స్టూడెంట్ లీడర్స్ జార్జ్ హత్య విద్యార్థి గొడవల్లో భాగంగా జరిగిందని ప్రచారం చేసారు. ఆ హత్య వెనుక భారీ కుట్రకోణం ఉందన్నది చాలామంది అనుమానం. జార్జ్ హత్య తర్వాత 9 మందికి శిక్ష ఖరారైంది. 11 మంది పోలీసులను సస్పెండ్ చేసింది పీవీ ప్రభుత్వం. జార్జ్ హత్య తర్వాత హైదరాబాద్ కేంద్రంగా రాజకీయంగా ఎన్నో మార్పులు జరిగాయి. విద్యార్థి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దాంతో 1973 జనవరి 10న ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది పీవీ. పీవీ ప్రభుత్వం కూలిపోవడానికి జార్జ్ రెడ్డి హత్య కూడా ఓ కారణం అన్నవాళ్లూ ఉన్నారు.

#_తెలంగాణ_విషయంలో_జార్జ్_స్టాండ్

జార్జ్ రెడ్డి. కదిలే కెరటం. అతనో విప్లవం. అతని మెదడు పాదరసం. అతని ప్రతీ అడుగూ మతోన్మాద-ఫ్యూడల్ శక్తుల గుండెల్లో దిగిన గునపం. అపారమైన మేధస్సు కలిగిన జార్జ్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్ లో చేరింది 1967లో. అంతకుముందు అంటే 1965-67 మధ్య పీయూసీలో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన స్టూడెంట్. మెడిసిన్ చదవాలని కలలుగన్న డ్రీమర్. కానీ ముల్కీ నిబంధనల కారణంగా, అప్పుడప్పుడే ఎగిసిపడుతున్న ముల్కీ ఉద్యమ తీవ్రత కారణంగా నాన్ లోకల్ ముద్రతో మెడిసిన్ సీటు కోల్పోయాడు జార్జ్.

తనకిష్టమైన మ్యాథ్స్-ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అపారమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకున్న జార్జ్.. నాన్ అకడమిక్ బుక్స్ చదివి ప్రాంతీయ-జాతీయ-అంతర్జాతీయ అంశాలెన్నింటినో తనదైన కోణంలో విశ్లేషించేవాడు. లాటిన్ అమెరికా దేశాల విముక్తి పోరాటం, ఆఫ్రికా దేశాల స్వతంత్ర కాంక్ష, వియాత్నం యుద్ధంతో సాహా ఎన్నో అంశాలపై స్పష్టమైన అవగాహన కల్గిన వ్యక్తి. అప్పుడప్పుడే దేశంలో నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం వేదికగా రైతాంగ పోరాటం మొదలయ్యాయి. ప్రతీ అంశాన్ని, ప్రతి సమస్యను ఓ థింక్ ట్యాంక్ లాగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకునేవాడంటారు అతని సన్నిహితులు. అలాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంపై ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడన్నది చాలామందికొచ్చే డౌట్. ముల్కీ ఉద్యమంతో మెడిసిన్ సీటు కోల్పోయిన జార్జ్ మొదట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై నెగిటివ్ గానే ఉండేవాడట. అయితే నాటి ఉద్యమ పరిస్థితులను అర్థం చేసుకుని, తన పరిచయస్తులు, అప్పటి కమ్యూనిస్ట్ నాయకులతో విస్తృత చర్చలు జరిపాక ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని గుర్తించాడట జార్జ్. తన హత్యకు కొన్ని నెలల ముందు తెలంగాణ ఉద్యమం విషయంలో తాను ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉండేదని.. అనవసరంగా అపార్థం చేసుకుని దానిపై ఏమీ మాట్లాడలేకపోయానని సన్నిహితులతో వాపోయాడట జార్జ్. తెలంగాణ ఉద్యమ తీవ్రతను ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో ఆనాటి నుంచే పేదల పక్షాన నిలిచేందుకు సిద్ధమయ్యాడంటారు. ముల్కీ ఉద్యమంలో భాగంగా విద్యార్థి పోరాటాలకు తనవంతుగా పాదం కదిపాడని కూడా అంటారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అనుకునేసరికి అతను సమాధి అయిపోయాడంటారు జార్జ్ సన్నిహితులు.జార్జ్ రెడ్డి బయోగ్రఫీ..

తనకిష్టమైన మ్యాథ్స్-ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అపారమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకున్న జార్జ్.. నాన్ అకడమిక్ బుక్స్ చదివి ప్రాంతీయ-జాతీయ-అంతర్జాతీయ అంశాలెన్నింటినో తనదైన కోణంలో విశ్లేషించేవాడు. లాటిన్ అమెరికా దేశాల విముక్తి పోరాటం, ఆఫ్రికా దేశాల స్వతంత్ర కాంక్ష, వియాత్నం యుద్ధంతో సాహా ఎన్నో అంశాలపై స్పష్టమైన అవగాహన కల్గిన వ్యక్తి. అప్పుడప్పుడే దేశంలో నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం వేదికగా రైతాంగ పోరాటం మొదలయ్యాయి. ప్రతీ అంశాన్ని, ప్రతి సమస్యను ఓ థింక్ ట్యాంక్ లాగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకునేవాడంటారు అతని సన్నిహితులు. అలాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంపై ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడన్నది చాలామందికొచ్చే డౌట్. ముల్కీ ఉద్యమంతో మెడిసిన్ సీటు కోల్పోయిన జార్జ్ మొదట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై నెగిటివ్ గానే ఉండేవాడట. అయితే నాటి ఉద్యమ పరిస్థితులను అర్థం చేసుకుని, తన పరిచయస్తులు, అప్పటి కమ్యూనిస్ట్ నాయకులతో విస్తృత చర్చలు జరిపాక ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని గుర్తించాడట జార్జ్. తన హత్యకు కొన్ని నెలల ముందు తెలంగాణ ఉద్యమం విషయంలో తాను ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉండేదని.. అనవసరంగా అపార్థం చేసుకుని దానిపై ఏమీ మాట్లాడలేకపోయానని సన్నిహితులతో వాపోయాడట జార్జ్. తెలంగాణ ఉద్యమ తీవ్రతను ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో ఆనాటి నుంచే పేదల పక్షాన నిలిచేందుకు సిద్ధమయ్యాడంటారు. ముల్కీ ఉద్యమంలో భాగంగా విద్యార్థి పోరాటాలకు తనవంతుగా పాదం కదిపాడని కూడా అంటారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అనుకునేసరికి అతను సమాధి అయిపోయాడంటారు జార్జ్ సన్నిహితులు.

Updated: April 20, 2020 — 6:30 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *