తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 7

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్చ పొయిందట.
గాజుల బేరము భోజనానికి సరి.
గాలిలో దీపం పెట్టి దెవుడా నీదె భారం అన్నట్టు.
గాలికి పొయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు.
గంతకు తగ్గ బొంత.
గతి లేనమ్మకు గంజే పానకము.
గోరుచుట్టు మీద రోకలి పోటు.
గోడ మీది పిల్లి.
గోడలకు చెవులుంటాయి.
గొడ్డుని చూసి గడ్డెయ్యాలి.
గొముఖ వ్యాఘ్రమ్.
గొంతెమ్మ కోరికలు.
గొటితొ పొయేదానికి గొడ్డలి వాడినట్టు.
గ్రుడ్డి కన్న మెల్ల మేలు.
గ్రుడ్డి ఎద్దు జొన్న చేలొ పడినట్లు.
గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
గుడ్డికన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే.
గుడి మింగే వాడికి నంది పిండిమిరియం.
గుడిని, గుడిలో లింగాన్ని, మింగినట్లు.
గుడ్ల మీద కోడిపెట్ట వాలే.
గుంభనం గునపం లాంటిది, బయటే వాడుకొవాలి,కడుపులో వున్టే పోట్లు పొడుస్టుంది.
గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకొన్నాడట.
గురువుకు పంగనామాలు పెట్టినట్లు.
గురువును మింగిన శిశ్యుడు.
ఎద్దులాగా ఏడాది బ్రతికే కంటె, ఆంబోతు లాగా ఆరు నెలలు బ్రతికితే చాలు.
ఎదురుగా ఉన్నవాడె పెళ్ళికొడుకు అందిట.
ఈ ఊరుకు ఆ ఊరు ఎంత దూరమో, ఆ వూరు నుంచి ఈ ఊరు అంతే దూరం.
ఈతకు మించిన లోతు లేదు.
ఎలుగు బంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా ,నలుపు నలుపేకాని తెలుపు రాదు.
ఎంగిలి చెతితొ కాకిని తోలడు.
ఎంత చెట్టుకి అంత గాలి.
ఎర్ర చీర కట్టున్నదల్లా నీ పెళ్ళామే?
ఎవడి ముడ్డి కింద నీళ్ళు వొస్తే వాడికి తెలుస్తుంది బాధ ఏమిటో.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
దాసుని తప్పు దండంతో సరి.
డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కాడట.
డబ్బు పొయే శని పట్టె.
డబ్బుకు లోకం దాసొహం.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23

తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *