తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 5

చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు.
చాప కింద నీరులా.
చావు కబురు చల్లగా చెప్పినట్టు.
చావు తప్పి కన్ను లొట్ట పొయినట్లు.
చచ్చినవాని కండ్లు చారెడు.
చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం.
చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి యెరగదట.
చదివిన కొద్దీ ఉన్నమతి పోయింది.
చదువు రాని వాడు వింత పశువు.
చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ.
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
చక్కనమ్మ చిక్కినా అందమే.
చల్ల కొచ్చి ముంత దాచినట్లు.
చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగాడట.
చస్తుంటే సంధ్యా మంత్రమన్నాడట ఒకడు.
చెడపకురా, చెడేవు.
చెముడా అంటే మొగుడా అన్నట్టు.
చెప్పే వాడికి వినే వాడు లొకువ.
చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ.
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు.
చెవిలో జోరీగ లాగా.
చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23

తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *